Xiaomi Civi Series:షియోమీ నుంచి కొత్త సిరీస్.. యూత్‌ను టార్గెట్ చేస్తూ స్మార్ట్‌పోన్లు

ప్రతీకాత్మకచిత్రం

షియోమీ నుంచి రాబోతున్న కొత్త సివీ సిరీస్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లను షియోమీ వీటిలో పొందుపర్చినట్లు మార్కెట్లో టాక్ నడుస్తోంది.

  • Share this:
మొబైల్ మార్కెట్ రంగంలో తనకంటూ ప్రత్యేక స్థానాన్ని సంపాదించుకున్న షియోమీ.. త్వరలో కొత్త స్మార్ట్‌ఫోన్‌ సిరీస్‌ను తీసుకురానుంది. యవతను టార్గెట్‌గా చేసుకొని ‘షియోమి సివీ’ పేరుతో కొత్త సిరీస్‌ను తీసుకురానున్నట్లు తెలుస్తోంది. ఈ సిరీస్‌తో ప్రత్యేకంగా చైనా మార్కెట్లో తన సత్తా చాటేందుకు కంపెనీ సన్నాహాలు చేస్తోంది. చైనా యూత్‌లో మరోసారి షియోమీ క్రేజ్ పెరిగేలా కొత్త సిరీస్‌ను అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ సిరీస్‌కు సంబంధించిన ఫోన్లను చైనాలో సెప్టెంబర్ 27వ తేదీన లాంచ్ చేయనున్నట్లు షియోమీ అధికారికంగా ప్రకటించింది.

షియోమీ నుంచి రాబోతున్న కొత్త సివీ సిరీస్ కు సంబంధించిన ఎలాంటి వివరాలను కంపెనీ అధికారికంగా ప్రకటించలేదు. అయితే యూజర్లను ఆకట్టుకునే ఫీచర్లను షియోమీ వీటిలో పొందుపర్చినట్లు మార్కెట్లో టాక్ నడుస్తోంది. యూత్ ను టార్గెట్ చేయాలనే ఉద్దేశంతో కెమెరా మీద షియోమీ పూర్తిగా ఫోకస్ చేసిందని, అదే సమయంలో సివీ సిరీస్‌ను చాలా స్లిమ్‌గా తయారు చేసిందని కొన్ని మీడియా కథనాలు వచ్చాయి. ఈ కొత్త సిరీస్‌ను సెప్టెంబర్ 27వ తేదీ మధ్యాహ్నం 2గం.లకు (భారత కాలమానం ప్రకారం ఉదయం గం.11.30ని.లకు) లాంచ్ చేయనున్నట్లు తెలుస్తోంది.

Realme GT Neo 2: రియల్‌మీ జీటీ నియో 2 స్మార్ట్​ఫోన్​ రిలీజ్... స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి


మార్కెట్లోకి త్వరలో రాబోతున్న సివీ సిరీస్.. Mi CC9 అప్‌డేటెడ్ వెర్షన్ అని ఊహాగానాలు వినిపిస్తున్నాయి. ఇదే కోవలో వచ్చిన Mi CC9e, Mi CC9 Meitu కస్టమ్ ఎడిషన్, Mi CC9 ప్రో ప్రీమియం డిజైన్ మాదిరిగానే తాజా సిరీస్ స్మార్ట్‌ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. వీడియో స్ట్రీమింగ్‌కు సివీ ఫోన్‌లు ఎంతో అనుకూలంగా ఉంటాయని సమాచారం.

షియోమీ కంపెనీ ఆగస్టులో మోడల్ నెంబర్ 2107119DC పేరుతో చైనాలో నమోదు చేసుకుంది. అయితే అదే సివీ సిరీస్ అని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి. కొత్తగా తీసుకురాబోతున్న సివీ సిరీస్ ని షియోమీ కంపెనీ కేవలం చైనాకు మాత్రమే పరిమితం చేస్తుందా లేదంటే ప్రపంచ వ్యాప్తంగా లాంచ్ చేస్తుందా అనే విషయంపై ప్రస్తుతానికి స్పష్టత లేదు.

Smartphone Tips: స్మార్ట్‌ఫోన్ స్లోగా ఉందా? వెంటనే ఈ 3 సెట్టింగ్స్ మార్చండి


గతంలో చైనా మార్కెట్‌ను మాత్రమే టార్గెట్ చేస్తూ షియోమీ కంపెనీ తెచ్చిన Mi CC9 ను కేవలం చైనాకు మాత్రమే పరిమితం చేసింది. ఇలాగే కొత్త సివీ సిరీస్‌ను కూడా షియోమీ సొంత దేశానికే పరిమితం చేస్తుందా.. లేదా.. అనే దానిపై కంపెనీ అధికారికంగా స్పందించాల్సి ఉంది. చైనా మార్కెట్‌ను, అక్కడి యూత్‌ను టార్గెట్ చేస్తూ.. ఫోటోలు, వీడియోల మీద పూర్తి ఫోకస్ పెట్టి రూపొందించిన ఈ సివీ సిరీస్‌ గురించి పూర్తి వివరాలు సెప్టెంబర్ 27న అధికారికంగా బయటకు రానున్నాయి.
Published by:Krishna Adithya
First published: