XIAOMI CAUGHT CHEATING WITH SMARTPHONE PERFORMANCE AFTER SAMSUNG HERE IS THE DETAILS AK GH
Xiaomi Cheating: స్మార్ట్‌ఫోన్ పర్ఫార్మెన్స్ విషయంలో షియోమి చీటింగ్.. ఇంతకు ముందే బయటపడిన శామ్సంగ్ వ్యవహారం
ప్రతీకాత్మక చిత్రం
శ్యామ్‌సంగ్(Samsung) ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసిన శ్యామ్‌సంగ్ గెలాక్సీ S22 ఫ్లాగ్‌షిప్‌లలో పనితీరును తగ్గించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు షియోమి సంస్థ తన తాజా షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్లలో కూడా అదే పని చేస్తున్నట్లు బయటపడింది.
శామ్సంగ్(Samsung) ఈ సంవత్సరం ప్రారంభంలో విడుదల చేసిన శామ్సంగ్ గెలాక్సీ S22 ఫ్లాగ్‌షిప్‌లలో పనితీరును తగ్గించినట్లు ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు షియోమి సంస్థ తన తాజా షియోమి 12 సిరీస్ స్మార్ట్ఫోన్లలో కూడా అదే పని చేస్తున్నట్లు బయటపడింది. ఆండ్రాయిడ్ పోలీస్ తెలిపిన వివరాల మేరకు.. షావోమీ స్మార్ట్ఫోన్లలో Geekbench బెంచ్‌మార్కింగ్ స్పూఫ్డ్ వెర్షన్స్ యాప్‌లలో ఫెర్మామెన్స్ వ్యత్సాసాలను గుర్తించినట్లు పేర్కొన్నారు. ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక ప్రకారం.. షియోమి 12 Pro, షియోమి 12X గేమ్‌లు లేదా బెంచ్‌మార్క్‌లుగా గుర్తించే యాప్‌లలో మెరుగైన పనితీరును కనబరుస్తున్నాయి.
గీక్‌బెంచ్ ప్రకారం.. అటువంటి ప్రవర్తన ఈ వారం తర్వాత దాని బెంచ్‌మార్క్ చార్ట్‌ల నుంచి ప్రభావితమైన ఫోన్లను తొలగించడానికి దారి తీస్తుంది. దీని గురించి ఆండ్రాయిడ్ పోలీస్ బ్లాగ్ విడుదల చేసిన ప్రకటనలో.. షియోమి గేమ్స్‌గా గుర్తించే యాప్‌లు, బెంచ్‌మార్క్‌లకు మెరుగైన పనితీరు కనబరుస్తూ.. ఇతర యాప్‌ల కోసం థ్రోట్లింగ్ పనితీరును అందిస్తుందని తెలిపింది.
వివిధ మోడళ్లకు పరీక్ష ఫలితాలు మారుతూ ఉంటాయి. అయితే షియోమి 12 సిరీస్‌లో.. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1తో పనిచేసే షియోమి 12 ప్రో క్వాలక్కమ్888-ఆధారిత షియోమి 12Xతో పోలిస్తే థ్రోట్లింగ్ సమస్యతో ఎక్కువగా ప్రభావితమైనట్లు గగుర్తించారు. సిస్టమ్ గీక్‌బెంచ్ లేదా జెన్షిన్ ఇంపాక్ట్‌గా గుర్తించే గీక్‌బెంచ్ యాప్ వెర్షన్లు, సిస్టమ్ నెట్‌ఫ్లిక్స్ లేదా గూగుల్ క్రోమ్ యాప్ వెర్షన్లతో పోల్చితే షియోమి 12 ప్రోలో 50 శాతం వరకు మెరుగైన సింగిల్-కోర్ పనితీరుతో ఫలితాలను సాధించింది. షియోమి 12X కూడా కొంత మేరకు ప్రభావితమైందని ఆండ్రాయిడ్ పోలీస్ నివేదిక తెలిపింది.
యాప్‌ను గీక్‌బెంచ్ యాప్‌గా ఫోన్ గుర్తించిన సమయంలో ఫోన్ పెర్ఫార్మెన్స్(Performance)లో వ్యత్యాసం గుర్తించినట్లు తెలిసింది. ప్లేస్టోర్‌లోని యాప్‌లకు సంబంధించిన అంశంలో రిజల్ట్స్ మెరుగ్గానే ఉంటున్నాయని.. కార్పొరేట్ తరహా యాప్‌ల విషయంలో పర్ఫార్మెన్స్ తగ్గుతున్నట్లు కనిపిస్తోందన్నారు. షియోమి 12X గేమ్, బెంచ్‌మార్క్ మధ్య పనితీరు వ్యత్యాసం కనిపించిది. ఇది షియోమి 12 ప్రోలో జరగలేదు.
యాప్‌లను, ప్యాకేజ్ నేమ్స్ ఆధారంగా డిఫరెంట్ ప్రొఫైళ్లను లోడ్ చేసి, షియోమి స్మార్టఫోన్ల థ్రోట్లింగ్కు పాల్పడుతోంది. గేమ్స్, బెంచ్‌మార్కింగ్ అప్లికేషన్ల అంశంలో బెటర్ ఫెర్ఫార్మెన్స్ కనిపిస్తోంది. ఇతర తక్కువ డిమాండ్ ఉన్న యాప్‌ల విషయంలో థ్రోట్లెడ్ పెర్ఫార్మెన్స్ ప్రొఫైల్‌లు పని చేస్తున్నాయి.
శామ్సంగ్ తన Samsung Galaxy S22 స్మార్ట్ఫోన్ల పనితీరును థ్రోట్ చేస్తున్నట్లు ఇటీవల బయటపడింది. సమస్యను పరిష్కరించడానికి కంపెనీ తర్వాత ఒక అప్డేట్ను ప్రారంభించింది. కంపెనీ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కూడా వివాదానికి క్షమాపణలు చెప్పారు. Samsung DX CEO JH హాన్ వాటాదారుల ముందు మాట్లాడుతూ.. ఈ సమస్యపై కస్టమర్ల ఆందోళనలను కంపెనీ చూడలేకపోయిందన్నారు. ఈ విషయంపై దృష్టి పెడతామని, వినియోగదారులకు క్షమాపణలు కూడా చెప్పారు.
Published by:Kishore Akkaladevi
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.