హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xiaomi: ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు.. ఏకంగా 17 రకాల ప్రొడక్ట్స్‌పై షియోమి ధమాకా ఫెస్టివల్ ఆఫర్లు..

Xiaomi: ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు.. ఏకంగా 17 రకాల ప్రొడక్ట్స్‌పై షియోమి ధమాకా ఫెస్టివల్ ఆఫర్లు..

Xiaomi: ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు.. ఏకంగా 17 రకాల ప్రొడక్ట్స్‌పై  షియోమి ధమాకా ఫెస్టివల్ ఆఫర్లు..

Xiaomi: ఇలాంటి ఆఫర్లు మళ్లీ రావు.. ఏకంగా 17 రకాల ప్రొడక్ట్స్‌పై షియోమి ధమాకా ఫెస్టివల్ ఆఫర్లు..

Xiaomi: చైనీస్ స్మార్ట్ బ్రాండ్స్ షియోమి, రియల్‌మీ స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించాయి. స్మార్ట్ ఫోన్స్, లాప్‌ట్యాప్స్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ ట్యాబ్స్, స్మార్ట్‌టీవీలు వంటి 17 రకాల ప్రొడక్ట్స్‌ ధరలు భారీగా తగ్గాయి. వీటిలో టాప్-10 బెస్ట్ డీల్స్ చెక్ చేద్దాం.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ఫెస్టివల్ సీజన్‌లో మార్కెట్‌ పెంచుకోవడానికి ప్రముఖ కంపెనీలు భారీ ఆఫర్లు (Huge Offers) ప్రకటిస్తున్నాయి. తాజాగా చైనీస్ స్మార్ట్ బ్రాండ్స్ షియోమి (Xiaomi), రియల్‌మీ (Realme) సైతం స్పెషల్ డిస్కౌంట్లను ప్రకటించాయి. స్మార్ట్ ఫోన్స్, లాప్‌ట్యాప్స్, వైర్‌లెస్ ఇయర్‌బడ్స్, స్మార్ట్ ట్యాబ్స్, స్మార్ట్‌టీవీలు వంటి 17 రకాల ప్రొడక్ట్స్‌ ధరలు భారీగా తగ్గాయి. వీటిలో టాప్-10 బెస్ట్ డీల్స్ చెక్ చేద్దాం.

* షియోమి11i హైపర్‌ఛార్జ్- 6/128 జీబీ

ఈ స్మార్ట్ ఫోన్ ప్రస్తుత ధర రూ.26,999. దీనిపై కంపెనీ రూ.7000 డిస్కౌంట్ ప్రకటించడంతో ఆఫర్ ప్రైస్ రూ.19,999కు తగ్గింది.

* రెడ్‌మీ స్మార్ట్‌టీవీ X సిరీస్ 43-అంగుళాల

ఈ స్మార్ట్ టీవీ ప్రస్తుత ధర రూ.28,999. అయితే దీనిపై కంపెనీ రూ.6000 డిస్కౌంట్ అందిస్తోంది. ఈ ఆఫర్‌తో దీన్ని రూ.22,999కు కొనుగోలు చేయవచ్చు.

* రెడ్‌మీబుక్ 15

ఈ లాప్‌ట్యాప్ ప్రస్తుతం రూ.41,999కు అందుబాటులో ఉంది. అయితే దీనిపై కంపెనీ ఫెస్టివల్ సీజన్ సందర్భంగా రూ.13,000 భారీ డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ.28,999కు సొంతం చేసుకోవచ్చు.

* రెడ్‌మీ కె50i - 6/64జీబీ

ఈ హ్యాండ్ సెట్‌ను కంపెనీ ప్రస్తుతం రూ.25,999కు అమ్ముతోంది. అయితే ఫెస్టివల్ సీజన్ సందర్భంగా దీనిపై రూ.6000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్‌లో దీన్ని రూ.19,999కు సొంతం చేసుకోవచ్చు.

* షియోమి12 ప్రో - 8/256జీబీ

ప్రస్తుతం ఈ స్మార్ట్‌ఫోన్ రూ.62,999కు అందుబాటులో ఉంది. అయితే దీనిపై కంపెనీ రూ.17,500 భారీ డిస్కౌంట్‌ ప్రకటించింది. దీంతో దీన్ని రూ. 45,499కు సొంతం చేసుకోవచ్చు.

* రెడ్‌మీ నోట్11 ప్రో+ 5జీ 6/128జీబీ

ఈ స్మార్ట్‌ఫోన్ ప్రస్తుత ధర రూ.20,999. అయితే దీనిపై కంపెనీ రూ.4000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ.16,999కు కొనుగోలు చేయవచ్చు.

* ఎంఐ నోట్‌బుక్ అల్ట్రా i5 - 16/512 GB

షియోమి కంపెనీ ఈ లాప్‌ట్యాప్‌పై రూ.8000 డిస్కౌంట్ ప్రకటించింది. ఆఫర్‌లో దీన్ని రూ.55,999కు కొనుగోలు చేయవచ్చు. రూ. 63,999 నుంచి ధర ఈ మేరకు తగ్గింది.

ఇది కూడా చదవండి : స్మార్ట్‌వాచ్‌ కొంటున్నారా..? రూ.15 వేలలోపు బెస్ట్ మోడల్స్ మీ కోసమే..

* షియోమి రోబోట్ వాక్యూమ్-మాప్ 2 ప్రో

ఈ స్మార్ట్ వాక్యూమ్ క్లీనర్‌పై కంపెనీ ప్రస్తుతం రూ. 6000 డిస్కౌంట్ ప్రకటించింది. దీంతో దీన్ని 23,999కు సొంతం చేసుకోవచ్చు. దీని అసలు ధర రూ. 29,999గా ఉంది.

* షియోమి ప్యాడ్ 5 - 6/128 GB

ఈ స్మార్ట్ ట్యాబ్‌పై కంపెనీ రూ.4000 ఆఫర్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ.22,999కు కొనుగోలు చేయవచ్చు. కాగా, దీని ప్రస్తుత ధర రూ. 26,999.

* రెడ్‌మీ ఇయర్‌బడ్స్ 3 ప్రో

ఈ స్మార్ట్ ఇయర్‌బడ్స్ ప్రస్తుత ధర రూ.2,999 కాగా, కంపెనీ దీనిపై రూ.1500 ఆఫర్ ప్రకటించింది. దీంతో దీన్ని రూ. 1,499కు కొనుగోలు చేయవచ్చు.

Published by:Sridhar Reddy
First published:

Tags: Realme, Smart phones, Tech news, Xiaomi

ఉత్తమ కథలు