మీరు కొత్త స్మార్ట్‌ఫోన్ కొనాలనుకుంటున్నారా? మంచి డిస్కౌంట్‌తో టీవీ తీసుకోవాలా? ఇటీవల దసరా, దీపావళి సేల్‌లో కొనలేకపోయారా? అయితే మీకో గుడ్ న్యూస్. భారీ ఆఫర్లు, డిస్కౌంట్లతో మరో అద్భుతమైన సేల్ ప్రారంభం కాబోతోంది. 'బ్లాక్ ఫ్రైడే సేల్' ప్రకటించింది షావోమీ. నవంబర్ 29 నుంచి డిసెంబర్ 2 వరకు ఈ సేల్ జరగనుంది. షావోమీ అఫీషియల్ వెబ్సైట్ అయిన Mi.com, అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఈ సేల్ జరగనుంది. అయితే నాలుగురోజులు సేల్ ఉంటుందని ప్రకటించిన షావోమీ.. .సేల్‌లో ఉండే డీల్స్ మాత్రం రివీల్ చేయలేదు. రెండు మూడు రోజుల్లో డీల్స్ గురించి క్లారిటీ ఇచ్చే అవకాశముంది.
దసరా, దీపావళి సేల్‌ను బాగానే వాడుకున్న షావోమీ... 'బ్లాక్ ఫ్రైడే సేల్'ను అంతే ఘనంగా నిర్వహించే అవకాశముంది. ఇప్పటికే ఇండియాలో రియల్మీ, ఒప్పో, వివో, వన్‌ప్లస్, సాంసంగ్ లాంటి కంపెనీలతో గట్టి పోటీ ఎదుర్కొంటున్న షావోమీ... 'బ్లాక్ ఫ్రైడే సేల్'లో భారీ ఆఫర్లు అందించే అవకాశముంది. అయితే ఈ సేల్‌లోనే 108 మెగాపిక్సెల్ కెమెరా ఉన్న స్మార్ట్‌ఫోన్ లేదా 75 అంగుళాల రెడ్మీ టీవీ లాంఛ్ చేసే అవకాశముందని అంచనా. ఇక ఇప్పటికే అందుబాటులో ఉన్న రెడ్మీ ఫోన్లు, ఎంఐ టీవీలపై భారీ డిస్కౌంట్లు అందించే ఛాన్సుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.