Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి షాక్

Xiaomi | షావోమీ స్మార్ట్‌ఫోన్లలో డిఫాల్ట్‌గా ఉండే బ్రౌజర్ యూజర్ ఓపెన్ చేసే అన్ని వెబ్‌సైట్లను రికార్డ్ చేస్తున్నట్టు గబీ సిర్లిగ్ పరిశోధనలో తేలింది. గూగుల్ సెర్చ్, డక్‌డక్‌గో సెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇందులో ఉన్నాయి.

news18-telugu
Updated: May 1, 2020, 1:18 PM IST
Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి షాక్
Xiaomi: షావోమీ స్మార్ట్‌ఫోన్లు వాడుతున్నవారికి షాక్ (ప్రతీకాత్మక చిత్రం)
  • Share this:
మీరు షావోమీ స్మార్ట్‌ఫోన్ వాడుతున్నారా? ఈ బ్రాండ్‌కు చెందిన రెడ్‌మీ, ఎంఐ, పోకో స్మార్ట్‌ఫోన్స్ ఉపయోగిస్తున్నారా? అయితే జాగ్రత్త. కోట్లాది మంది యూజర్ల డేటాను షావోమీ రికార్డ్ చేస్తుందున్న వార్తలు కలకలం రేపుతున్నాయి. దీంతో మరోసారి ప్రైవసీ అంశం తెరపైకి వచ్చింది. భారతదేశంలో అతిపెద్ద స్మార్ట్‌ఫోన్ సెల్లింగ్ బ్రాండ్‌గా షావోమీ పేరు తెచ్చుకున్న సంగతి తెలిసిందే. కోట్లాది ఫోన్లను ఇండియాలో అమ్మింది షావోమీ. కానీ ఇప్పుడు ఈ బ్రాండ్ యూజర్ల డేటాను రికార్డ్ చేస్తుందన్న వార్తలొస్తున్నాయి. సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ గబీ సిర్లిగ్ ఈ విషయాన్ని బయటపెట్టారు. తన రెడ్‌మీ నోట్ 8 స్మార్ట్‌ఫోన్‌ తాను చేస్తున్నదంతా రికార్డ్ చేస్తోందని సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ వెల్లడించడం కలకలం రేపుతోంది. యూజర్ల బిహేవియర్‌ను ట్రాక్ చేసి ఆ డేటాను చైనా సంస్థ ఆలీబాబా నిర్వహించే రిమోట్ సర్వర్లకు పంపుతున్నట్టు గుర్తించారు.

షావోమీ స్మార్ట్‌ఫోన్లలో డిఫాల్ట్‌గా ఉండే బ్రౌజర్ యూజర్ ఓపెన్ చేసే అన్ని వెబ్‌సైట్లను రికార్డ్ చేస్తున్నట్టు గబీ సిర్లిగ్ పరిశోధనలో తేలింది. గూగుల్ సెర్చ్, డక్‌డక్‌గో సెర్చ్ యాక్టివిటీస్ కూడా ఇందులో ఉన్నాయి. అంతేకాదు ఇన్‌కాగ్నిటో మోడ్‌లో ఓపెన్ చేసిన సైట్లతో పాటు దీంతో పాటు ఇతర యాక్టివిటీస్, టాస్కులను కూడా ట్రాక్ చేస్తున్నట్టు గుర్తించారు. బీజింగ్‌లో రిజిస్టరైన వెబ్‌డొమైన్స్ సింగపూర్, రష్యాలో నిర్వహిస్తున్న రిమోట్ సర్వర్లకు ఈ డేటా వెళ్తోందని గుర్తించారు. షావోమీకి చెందిన ఎంఐ 10, రెడ్‌మీ కే20 లాంటి స్మార్ట్‌ఫోన్లలో ఇలాగే జరుగుతోందని గుర్తించారు. గబీ సిర్లిగ్ మాత్రమే కాదు మరో సైబర్ సెక్యూరిటీ రీసెర్చర్ ఆండ్ర్యూ టియర్నీ కూడా గూగుల్ ప్లే స్టోర్‌లోని ఎంఐ బ్రౌజర్, మింట్ బ్రౌజర్లు ఇలాగే డేటాను కలెక్ట్ చేస్తున్నట్టు గుర్తించారు.

ఈ ఆరోపణల్ని షావోమీ ఖండించింది. పరిశోధకులు చెప్తున్నవి అవాస్తవాలని కొట్టిపారేసింది. యూజర్ల ప్రైవసీ, సెక్యూరిటీకి మొదటి ప్రాధాన్యం ఇస్తామని, డేటా ప్రైవసీపై స్థానిక చట్టాలను అనుసరిస్తామని స్పష్టం చేసింది. అయితే బ్రౌజర్ డేటాను కలెక్ట్ చేస్తున్నామని షావోమీ ప్రతినిధి ఒప్పుకోవడం విశేషం. ఇన్‌కాగ్నిటో మోడ్‌లో బ్రౌజింగ్ చేస్తే ఎలాంటి డేటాను కలెక్ట్ చేయలేదని షావోమీ వెల్లడించింది.

ఇవి కూడా చదవండి:

Aarogya Setu: బీ అలర్ట్... నకిలీ ఆరోగ్య సేతు యాప్‌తో వల వేస్తున్న పాకిస్తాన్

Online Courses: ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులు అందిస్తున్న 5 వెబ్‌సైట్స్ ఇవే

JioMeet: జియో మీట్ వచ్చేసింది... వీడియో కాల్స్ చేయండి ఇలా
First published: May 1, 2020, 1:18 PM IST
మరిన్ని చదవండి
తదుపరి వార్తలు

Top Stories

corona virus btn
corona virus btn
Loading