Xiaomi TV Offers | మీరు కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని ప్లాన్ చేస్తున్నారా? అయితే గుడ్ న్యూస్. ఎందుకని అనుకుంటున్నారా? దిగ్గజ ఎలక్ట్రానిక్స్ తయారీ కంపెనీల్లో ఒకటిగా కొనసాగుతూ వస్తున్న షావోమి (Xiaomi) అదిరే ఆఫర్ తీసుకువచ్చింది. 55 ఇంచుల ఓఎల్ఈడీ విజన్ స్మార్ట్ టీవీలపై (Smart TV) భారీ ఆఫర్ అందుబాటులో ఉంచింది. ఏకంగా 50 శాతం డిస్కౌంట్ అందిస్తోంది. 4కే ఓఎల్ఈడీ స్మార్ట్ టీవీ ఎంఆర్‌పీ రూ. 1,99,999గా ఉంది. అయితే దీన్ని మీరు రూ. 99,999కే కొనొచ్చు. అంతేకాకుండా ఇతర ఆఫర్లు కూడా ఉన్నాయి. నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ పొందొచ్చు. అలాగే కస్టమర్లకు రెండేళ్ల పాటు ఎక్సెంటెడ్ వారంటీ అందిస్తోంది. ఇధి ఫ్రీగా పొందొచ్చు. దీని కాస్ట్ రూ. 7,499గా ఉంటుంది.
అంటే 50 శాతం డిస్కౌంట్‌తో పాటుగా ఈ ఉచిత వారంటీ ఎక్సెంట్ బెనిఫిట్ పొందొచ్చు. ఈ స్మార్ట్ టీవీలో 4కే అల్ట్రా హెచ్‌డీ డిస్‌ప్లే ఉంటుంది. ఇంకా డాల్బే విజన్ ఐక్యూ ఆప్షన్ ఉంది. హెచ్‌డీఆర్ 10 ప్లస్ సపోర్ట్ చేస్తుంది. హెచ్ఎల్‌జీ, సెల్ఫ్ ఇల్యూమినేటింగ్ పిక్సెల్స్, హెచ్‌డీఆర్ 10 వంటి ఫీచర్లు ఈ స్మార్ట్ టీవీలో ఉన్నాయి. అంతేకాకుండా కంపెనీ వివిడ్ పిక్సర్ ఇంజిన్ 2 ను ఈ స్మార్ట్ టీవీలో అమర్చింది. దీని వల్ల పిక్చర్ క్వాలిటీ అదిరిపోతుంది.
రూ.7 వేల స్మార్ట్ వాచ్‌ను రూ.1400కే కొనేయండిలా!
ఇక టీవీలో సౌండ్ సిస్టమ్ విషయానికి వస్తే.. 8 స్పీకర్లు ఉంటాయి. ఇందులో 4 యాక్టివ్ డర్వర్స్, 4 ప్యాసివ్ డ్రైవర్స్ ఉంటాయి. డాల్బే ఆటమ్స్, డీటీఎస్ ఎక్స్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. 30 వాట్ సౌండ్ ఔట్‌పుట్ ఉంటుంది. ఇంకా ఈ టీవీలో 3 జీబీ ర్యామ్, 32 జీబీ మమెరీ ఉంటాయి. క్వాడ్ కోర్ కోర్టెక్స్ ఏ 73 ప్రాసెసర్ ఉంటుంది.
138 బెట్టింగ్, 94 లోన్ యాప్స్‌పై కేంద్రం నిషేధం!
ఈ స్మార్ట్ టీవీ ఆండ్రాయిడ్ టీవీ 11 ఆపరేటింగ్ సిస్టమ్‌పై పని చేస్తుంది. ఇంకా ఇందులో ఓకే గూగుల్ , బిల్ట్ ఇన్ క్రోమ్ కాస్ట్ ఉంటుంది. ప్యాచ్ వాల్ 4 పై టీవీ పని చేస్తుంది. ఇంకా ఇందులో బ్లూటూత్ 5.0, వైఫై 6, మూడు హెచ్‌డీఎంఐ పోర్టులు, రెండు యూఎస్‌బీ పోర్టులు, ఎథర్ నెట్ పోర్ట్, 3.5 ఎంఎం జాక్ వంటి ఫీచర్లు ఈ టీవీలో ఉన్నాయి. అందువల్ల కొత్త స్మార్ట్ టీవీ కొనుగోలు చేయాలని భావించే వారు ఈ డీల్‌ను సొంతం చేసుకోవచ్చు. షావోమి వెబ్‌సైట్‌లోకి వెళ్లి నేరుగా ఈ ఆఫర్ పొందొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Budget smart tv, Smart TV, Smart tvs, Xiaomi, Xiaomi Mi TV