చైనాకు చెందిన ప్రముఖ స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీ షియోమి (Xiaomi) నుంచి విడుదలయ్యే ఫోన్లు (Smartphones) విపరీతమైన డిమాండ్ ఉంటుంది. బడ్జెట్ ధరలోనే ప్రీమియం ఫీచర్లతో ఫోన్లను రిలీజ్ చేసే షియోమి మరో సిరీస్ విడుదలకు సిద్దమవుతోంది. షియోమి 12కి కొనసాగింపుగా షియోమి 13 సిరీస్‌ను డిసెంబర్ 1న లాంఛ్ చేయనున్నట్లు కంపెనీ తన అధికారిక వెబ్‌పేజీ ద్వారా వెల్లడించింది. అయితే ఈ సిరీస్ తొలుత చైనాలో విడుదల కానుంది.
భారత్‌తో సహా ఇతర దేశాల్లో కొత్త సిరీస్ అందుబాటులోకి రావడానికి మరి కొంత సమయం పట్టే అవకాశం ఉంది. కాగా షియోమి 13 లాంచిగ్ను Weibo పోస్ట్ ధృవీకరించింది. ఈ ఈవెంట్లోనే లైకా బ్రాండింగ్, లాంచ్ డేట్‌తో పాటుగా షియోమి 13 మోనికర్ వంటి కీలక అంశాలను ప్రస్తావించింది. ఈ సిరీస్‌లో ఆండ్రాయిడ్ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఆధారపడిన కొత్త MIUI 14 వెర్షన్‌ను అందించనుంది. ఈ సిరీస్‌లో షియోమి 13, షియోమి 13 ప్రో ఫోన్లు మార్కెట్లోకి రానున్నాయి. షియోమి 13, 13 ప్రో స్మార్ట్ఫోన్లు డిసెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు (4:30PM IST) చైనాలోని బీజింగ్‌లో రిలీజ్ అవుతాయి.
రూ.20 వేలకే ఐఫోన్ .. ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ ఆఫర్
కొద్ది రోజుల క్రితమే, షియోమి 13 సిరీస్ నుంచి 14 సిరీస్ అప్‌గ్రేడ్‌పై అనేక పుకార్లు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. అయితే తాజాగా కంపెనీ ఈ పుకార్లను నిజం చేస్తూ తాజాగా షియోమీ 14 టీజర్‌ను లాంచ్ చేసింది. షియోమి 13 సిరీస్‌లో మొత్తం మూడు మోడల్‌లు ఉండనున్నాయి. వాటిలో ఒకటి అల్ట్రా వేరియంట్. ఇది 1- అంగుళాల కెమెరా సెన్సార్ హార్డ్‌వేర్‌తో పనిచేస్తుంది. దీనిలో ఇమేజింగ్ టెక్ కోసం లైకా ట్యూన్ కెమెరాలను అందించనుంది. దీనిపై షియోమి వ్యవస్థాపకుడు, లీజూన్ మాట్లాడుతూ.. రాబోయే షియోమి 13 సిరీస్ కొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 2 చిప్‌సెట్‌పై పని చేస్తుందని తెలిపారు. ఈ సిరీస్ కొత్త హార్డ్‌వేర్‌తో వస్తుందని, అదనపు మన్నిక, వాటర్ స్ప్లాష్‌లను తట్టుకోవడం కోసం IP68 రేటింగ్‌తో దీన్ని డిజైన్ చేశామని చెప్పారు. ఈ ఫోన్ 12GB RAMతో వస్తుందని, ఇది ఆండ్రాయిడ్ 13- ఆధారిత MIUI 14 వెర్షన్‌పై పనిచేస్తుందని పేర్కొన్నారు.
ఈ 4 స్మార్ట్‌ఫోన్స్‌పై భారీ ఆఫర్లు.. ఏకంగా రూ.28 వేల డిస్కౌంట్!
కాగా.. షియోమి దాని ఛార్జింగ్ సామర్థ్యాన్ని ఇప్పటికే ఉన్న 67W నుండి 120Wకి అప్‌గ్రేడ్ చేయనుంది. షియోమి 13 ప్రో డిస్ప్లే 6.65 అంగుళాల 2కె రిజల్యూషన్ క్వర్డ్ అమోల్డ్ డిస్ప్లేను కలిగి ఉంటుంది. ఇక షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను భారత్‌లో ఈ ఏడాది ఏప్రిల్‌లో రూ.62,999 ధర వద్ద లాంఛ్ చేసింది. ఇండియన్ మార్కెట్లో షియోమి 13 ప్రో ధర కొంచెం అధికంగా ఉంటుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, New smartphone, Xiaomi