Home /News /technology /

XIAOMI 12S ULTRA WITH SNAPDRAGON 8 GEN 1 LAUNCHED IN CHINA UMG GH

Xiaomi 12S Ultra: షావోమి సరికొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్.. బెస్ట్ ఫీచర్లు.. ఓసారి చూడండీ..!

షావోమీ కొత్త ఫోన్ లాంచ్

షావోమీ కొత్త ఫోన్ లాంచ్

చైనా టెక్ కంపెనీ షియోమి (Xiaomi) ఒక ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో షియోమి 12S, షియోమి 12S ప్రో, షియోమి 12S అల?

ఇంకా చదవండి ...
చైనా టెక్ కంపెనీ షావోమి (Xiaomi) ఒక ప్రీమియం, ఫ్లాగ్‌షిప్ ఫోన్‌తో టెక్ ప్రపంచం దృష్టిని ఆకర్షిస్తోంది. క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC ప్రాసెసర్‌తో పనిచేసే స్మార్ట్‌ఫోన్ పోర్ట్‌ఫోలియోను కంపెనీ తాజాగా రిలీజ్ చేసింది. ఈ జాబితాలో షియోమి 12S, షియోమి 12S ప్రో, షియోమి 12S అల్ట్రా డివైజ్‌లు ఉన్నాయి. షియోమి Mi స్మార్ట్ బ్యాండ్ 7 ప్రో స్మార్ట్‌వాచ్‌తో పాటు ఈ ఫోన్‌లను చైనాలో లాంచ్ చేసింది. వీటన్నింటిలో కస్టమర్లను ఆకర్షిస్తున్న ప్రీమియం డివైజ్‌గా నిలుస్తోంది షియోమి 12S అల్ట్రా మోడల్. దీని అమ్మకాలు చైనాలో జులై 8 నుంచి ప్రారంభం కానున్నాయి. మిగతా రెండు ఫోన్ల సేల్స్ జులై 6 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ హై రేంజ్ స్మార్ట్‌ఫోన్ల ధర, ఫీచర్ల వివరాలు తెలుసుకుందాం.

* షావోమి 12S సిరీస్ ధర
షావోమి 12S అల్ట్రా 8GB+256GB బేస్ వేరియంట్ ధర CNY 5,999 (సుమారు రూ. 70,000) నుంచి ప్రారంభమవుతుంది. 12GB+256GB వేరియంట్ ధర CNY 6,499 (సుమారు రూ. 76,000) కాగా, 12GB+512GB వేరియంట్ ధర CNY 6,999 (సుమారు రూ. 82,000) వరకు ఉంది.

అయితే షియోమి 12S ప్రో బేస్ వేరియంట్ ధర CNY 4,699 (సుమారు రూ. 55,000), మిడిల్ వేరియంట్ ధర CNY 4,999 (సుమారు రూ. 58,000), టాప్ వేరియంట్ ధర CNY 5,899 (సుమారు రూ. 69,000)గా ఉంది. 12GB+256GB స్టోరేజ్ వేరియంట్ ధర CNY 5,399 (సుమారు రూ. 63,000) వరకు ఉంది. షియోమి 12S ధర CNY 3,999 (సుమారు రూ. 47,000) నుంచి ప్రారంభమవుతుంది.

* షావోమి 12S అల్ట్రా స్పెసిఫికేషన్లు
షావోమి 12S సిరీస్‌లో వచ్చిన మూడు ఫోన్లు లేటెస్ట్ స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 SoC చిప్‌సెట్‌తో రన్ అవుతాయి. ఈ ప్రీమియం చిప్ సెట్ బెస్ట్ పర్ఫార్మెన్స్‌ అందిస్తుందని కంపెనీ పేర్కొంది. 12S అల్ట్రా వేరియంట్ 120Hz రిఫ్రెష్ రేట్‌ సపోర్ట్‌తో 6.73-అంగుళాల 2K AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంది. ఇది 240Hz టచ్ శాంప్లింగ్ రేట్‌తో వస్తుంది. దీని డిస్‌ప్లే డాల్బీ విజన్, HDR10+కి కూడా సపోర్ట్ చేస్తుంది. కలర్ మేనేజ్‌మెంట్ కోసం DCI-P3 కవరేజీని కూడా అందించారు.

ఈ ఫోన్ 12GB LPDDR5 RAMతో వస్తుంది. బెస్ట్ కెమెరా క్వాలిటీ కోసం షియోమి జర్మనీకి చెందిన లెసియా (Lecia) బ్రాండ్‌తో ఒప్పందం చేసుకుంది. షియోమి 12S అల్ట్రా ఫోన్‌కు వెనుకవైపు ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. దీంట్లోని ప్రైమరీ కెమెరా 50-మెగాపిక్సెల్ సెన్సార్, పెరిస్కోప్ లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ సెకండరీ సెన్సార్, అల్ట్రా వైడ్ లెన్స్‌తో 48-మెగాపిక్సెల్ సెన్సార్ ఉన్నాయి. దీంతోపాటు 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను పొందుపరిచారు. షియోమి 12S అల్ట్రా డివైజ్.. 67W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేసే 4860mAh బ్యాటరీతో వస్తుంది. చైనా కాకుండా ఇతర దేశాల్లో ఈ ఫోన్‌ను ఎప్పుడు లాంచ్ చేస్తారనే వివరాలను కంపెనీ వెల్లడించలేదు.
Published by:Mahesh
First published:

Tags: 5G Smartphone, Budget smart phone, Tech news, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు