Home /News /technology /

XIAOMI 12 SERIES SMARTPHONES LAUNCH WITH POWERFUL CHIPSETS THESE ARE EYE CATCHING SPECIFICATIONS GH VB

Xiaomi 12 Series: పవర్‌ఫుల్ చిప్‌‌సెట్స్‌తో షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు లాంచ్.. కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లు ఇవే..!

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మొబైల్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు తాజాగా లాంచ్ అయ్యాయి. షియోమి సంస్థ ఈ సిరీస్‌లో షియోమి 12, షియోమి 12 ప్రో, షియోమి 12 ఎక్స్ అనే మూడు ఫోన్‌లను విడుదల చేసింది.

మొబైల్ ప్రియులు ఎంతగానో ఆసక్తిగా ఎదురుచూస్తున్న షియోమి 12 సిరీస్ స్మార్ట్‌ఫోన్లు తాజాగా లాంచ్ అయ్యాయి. షియోమి సంస్థ ఈ సిరీస్‌లో షియోమి 12, షియోమి 12 ప్రో, షియోమి 12 ఎక్స్ అనే మూడు ఫోన్‌లను విడుదల చేసింది. ప్రస్తుతానికి, ఈ స్మార్ట్‌ఫోన్లు చైనాలో లాంచ్ అయ్యాయి. ఇవి ఇతర దేశాలకు ఎప్పుడు రిలీజ్ అవుతాయనే దానిపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ మొబైల్ ఫోన్లను మోస్ట్ పవర్‌ఫుల్ చిప్‌‌సెట్స్‌తో తీసుకొచ్చింది షియోమి.

షియోమి 12, షియోమి 12 ప్రోలను అధునాతన పవర్‌ఫుల్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 (Snapdragon 8 Gen 1) చిప్‌‌సెట్స్‌తో విడుదల చేయగా.. షియోమి 12 ఎక్స్ ను స్నాప్‌డ్రాగన్ 870 ప్రాసెసర్‌తో విడుదల చేసింది. ఈ మూడు ఫోన్లలో త్రిబుల్ కెమెరా సెటప్ ఉంది. ఈ ఫోన్లలో ఇంకా ఎన్నో కళ్లు చెదిరే స్పెసిఫికేషన్లు ఉన్నాయి. అవేంటో చూద్దాం.

Smart Watch: ఇలాంటి Smart Watch మీరెప్పుడు చూసి ఉండరు.. 10 రోజుల బ్యాటరీ బ్యాకప్ తో.. అదిరిపోయే ఫీచర్లు..


షియోమి 12 స్పెసిఫికేషన్లు..
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేసే షియోమి 12 6.28-అంగుళాల అమోఎల్ఈడీ ఫుల్‌హెచ్‌డీ ప్లస్ డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్‌తో పనిచేస్తుంది. ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ స్కానర్ కూడా ఉంది. ఫోన్‌పై గీతలు పడకుండా కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ అందించారు. షియోమి 12 ఫోన్ 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ 766 మెయిన్ కెమెరాతో వస్తుంది.

ఇందులో 123-డిగ్రీల ఫీల్డ్ ఆఫ్ వ్యూతో 13-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 3x ఆప్టికల్ జూమ్ & ఓఐఎస్ తో 5-మెగాపిక్సెల్ టెలి మాక్రోషూటర్ కెమెరా ఇచ్చారు. సెల్ఫీలు, వీడియో చాట్ కోసం 32 మెగాపిక్సల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

5జీ, 4జీ ఎల్ఈటీ, వై-ఫై 6ఈ, ఎన్‌ఎఫ్‌సీ, బ్లూటూత్ 5.2, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్ వంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఇచ్చారు. ఆండ్రాయిడ్ 11 ఆధారంగా MIUI 13పై ఫోన్ రన్ అవుతుంది. 4500ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్, 10వాట్ల రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. ఇది 12జీబీ LPDDR5 ర్యామ్ + 256జీబీ యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజీతో వస్తుంది.

Noise Colorfit Ultra 2: మార్కెట్​లోకి నాయిస్ కలర్‌ఫిట్ అల్ట్రా 2 స్మార్ట్​వాచ్ లాంచ్​.. 60 స్పోర్ట్స్​ మోడ్​ల్స్..


షియోమి 12 (Xiaomi 12) 8జీబీ+ 128జీబీ వేరియంట్ ధర 3,699 యెన్లు (దాదాపు రూ.43,700) నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ +256జీబీ ధర 3,999 (దాదాపు రూ. 47,200) యెన్లు, 12జీబీ+ 512జీబీ వేరియంట్ ధర 4,399 యెన్లుగా (దాదాపు రూ.52,000)గా నిర్ణయించింది. ఈ సిరీస్ ఫోన్స్ డిసెంబర్ 31 నుంచి చైనాలో కొనుగోళ్లకు అవైలబుల్ లో ఉంటాయి.

షియోమి 12 ప్రో స్పెసిఫికేషన్లు..
స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో నడిచే షియోమి 12 ప్రో 6.73-అంగుళాల 1440p రిజల్యూషన్‌ డిస్‌ప్లేతో వస్తుంది. ఈ స్క్రీన్ LTPO 2.0 బ్యాక్‌ప్లేన్‌ను ఉపయోగిస్తుంది. ఇది 1-120Hz వేరియబుల్ రిఫ్రెష్ రేట్లతో పనిచేస్తుంది. ఇందులో ఇన్-డిస్ప్లే ఫింగర్ ప్రింట్ స్కానర్, గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌ను అందించారు. 12-బిట్ అవుట్‌పుట్ కలర్లతో వచ్చే షియోమి 12 ఫోన్‌లు 1,500 నిట్స్ గరిష్ఠ బ్రైట్‌నెస్ డిస్‌ప్లే అందిస్తాయి.

షియోమి 12 ప్రో ట్రిపుల్ కెమెరా సెటప్ తో వస్తుంది. ఇందులో 50ఎంపీ సోనీ ఐఎంఎక్స్707 మెయిన్ కెమెరా.. 50ఎంపీ అల్ట్రావైడ్ షూటర్, 50ఎంపీ పోర్ట్రెయిట్ సెన్సార్‌ కెమెరా ఉన్నాయి. ఇది 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా కలిగి ఉంది. అలాగే షియోమి 12లో ఉన్న అన్ని కనెక్టివిటీ ఫీచర్లు ఇందులో అందించారు. ఈ కెమెరాలలో సైబర్ ఫోకస్ టెక్నాలజీ ఇచ్చారు. దీనితో ఫాస్ట్ ఆటో-ఫోకస్ చేసి ముఖాలు, ఇతర బ్యాక్‌గ్రౌండ్ ఎలిమెంట్స్‌పై ఫోకస్ చేయొచ్చు. షియోమి కొత్త నైట్ మోడ్ అల్గారిథమ్‌తో వెలుతురు తక్కువ ఉన్న సమయంలోనూ చక్కటి ఫొటోలు తీస్తుంది.

4,600ఎంఏహెచ్ బ్యాటరీతో వచ్చే ఈ ఫోన్ 120వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్, 50వాట్ల వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేస్తుంది. షియోమి పవర్ మేనేజ్‌మెంట్‌ కోసం సర్జ్ P1 ఛార్జింగ్ చిప్‌ను కూడా ఇందులో ఇచ్చింది.

షియోమి 12 ప్రో రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో వస్తుంది. దీని బేస్ వేరియంట్‌ అయిన 8జీబీ+256జీబీ ధర 4,699 యెన్లు (దాదాపు రూ. 55,100) నుంచి ప్రారంభమవుతుంది. 12జీబీ ర్యామ్+256 జీబీ ధర 5,399 యెన్లు (దాదాపు రూ. 63,300)గా నిర్ణయించింది.

Samsung Galaxy M33 5G: త్వరలోనే శామ్​సంగ్​ గెలాక్సీ M33 5G స్మార్ట్​ఫోన్​ లాంచ్​.. ఆన్​లైన్​లో లీకైన ఫీచర్ల వివరాలివే..


షియోమి 12ఎక్స్ స్పెసిఫికేషన్లు..
6.28-అంగుళాల అమోఎల్ఈడీ (AMOLED) డిస్‌ప్లే, 120 హెట్జ్ రిఫ్రెష్ రేట్, క్వాల్‌కోమ్‌ స్నాప్‌డ్రాగన్‌ 870 చిప్‌సెట్‌తో షియోమి 12ఎక్స్ వస్తుంది. ఇది 256జీబీ ఇంటర్నల్ స్టోరేజ్, 12జీబీ ర్యామ్ తో టాప్ వేరియంట్ తో వస్తుంది. స్మార్ట్‌ఫోన్ 67వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇచ్చే 4,500 ఎంఏహెచ్ బ్యాటరీని కలిగి ఉంది. 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా అందించారు.

50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా, 13 మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 5 మెగాపిక్సెల్ టెలిఫోటో మాక్రో కెమెరాలతో ట్రిపుల్ రియర్ లెన్స్ సెటప్‌తో వస్తుంది. ఫ్లాగ్‌షిప్ స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌కు బదులుగా 12X స్నాప్‌డ్రాగన్ 870 చిప్‌సెట్ అమర్చారు. ఇది వైర్‌లెస్ ఛార్జింగ్ లేదా రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇవ్వదు.

షియోమి 12ఎక్స్ ధర 8జీబీ +128జీబీ వేరియంట్ ధర 3,199 (దాదాపు రూ. 37,500) నుంచి ప్రారంభమవుతుంది. 8జీబీ + 256జీబీ, 12జీబీ + 256జీబీ వేరియంట్‌ ధరలు వరుసగా 3,499 యెన్లు (దాదాపు రూ. 41,000), 3,799 యెన్లు (దాదాపు రూ.44,500)గా నిర్ణయించింది.
Published by:Veera Babu
First published:

Tags: Smart phones, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు