XIAOMI 12 PRO VS ONEPLUS 10 PRO HERE ARE THE PRICES FEATURES CAMERA AND DISPLAY DETAILS OF THESE TWO SMARTPHONES GH VB
Smartphones: షియోమి 12 ప్రో vs వన్‌ప్లస్ 10 ప్రో.. ఈ రెండు స్మార్ట్ఫోన్ల ధరలు, ఫీచర్ల వివరాలిలా..
ప్రతీకాత్మక చిత్రం
ఎంట్రీ, మిడ్ లెవల్ స్మార్ట్ ఫోన్ సెగ్మెంట్‌పై ఇప్పటివరకు ప్రభావం చూపిన షియోమి కంపెనీ.. తాజాగా టాప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై దృష్టిసారించింది. అందుకు తగ్గట్టుగానే హై ఎండ్ రేంజ్లో షియోమి 12 ప్రో ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది.
ఎంట్రీ(Entry), మిడ్ లెవల్ స్మార్ట్ ఫోన్(Smartphone) సెగ్మెంట్‌పై ఇప్పటివరకు ప్రభావం చూపిన షియోమి కంపెనీ.. తాజాగా టాప్ రేంజ్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్‌పై(Smartphone) దృష్టిసారించింది. అందుకు తగ్గట్టుగానే హై ఎండ్ రేంజ్లో షియోమి(Xiomi) 12 ప్రో ఫోన్‌ను భారత్‌లో లాంచ్ చేసింది. ఆఫర్లు, బ్యాంక్ డిస్కౌంట్(Bank Discount) లేకుండా అయితే ఈ స్మార్ట్ ఫోన్ ధర సుమారు రూ.62,999గా ఉండనుంది. అయితే ఇంత భారీ ధరతో కస్టమర్ల దృష్టిని ఆకర్షించడానికి షియోమికి పోటీగా వన్‌ప్లస్ కంపెనీ వన్‌ప్లస్ 10 ప్రో డివైజ్‌ను మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఈ రెండు బ్రాండ్లు హై ఎండ్ సెగ్మెంట్లో నువ్వా-నేనా అంటూ పోటీపడుతున్నాయి. Xiaomiకి పోటీగా Samsung, Apple, Google సైతం హై రేంజ్ స్మార్ట్ ఫోన్లతో కస్టమర్లను ఆకర్షించడానికి ప్రయత్నం చేస్తున్నాయి. షియోమి 12 Pro -వన్ ప్లస్ 10 ప్రో... పీచర్లు, కెమెరా ధరలను సరిపోల్చుతూ ఓసారి పరిశీలిద్దాం.
* షియోమి 12 ప్రో VS వన్ ప్లస్ 10 ప్రో
Xiaomi 12 Pro భారతదేశంలో ప్రారంభ ధర రూ. 62,999తో లాంచ్ అయింది. 8GB + 256GB వేరియంట్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే 12GB RAM, 256GB స్టోరేజ్ కెపాసిటీతో కూడా మార్కెట్లోకి రానున్నాయి. మీరు ఈ స్మార్ట్‌ఫోన్ సొంతం చేసుకోవాలంటే రూ. 66,999 చెల్లించాల్సి ఉంటుంది. వన్‌ప్లస్10 Pro 8GB + 128GB మోడల్ ప్రారంభ ధర రూ.66,999తో ఇండియాలో లాంచ్ అయింది. OnePlus 10 Proలో ఎక్కువ స్టోరేజ్ కెపాసిటీ కావాలంటే రూ.71,999 చెల్లించాలి.
* డిస్ప్లే
షియోమి 12 Pro 6.73-అంగుళాలతో E5 AMOLED డిస్ప్లేను కలిగి ఉంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో పాటు WQHD+ రిజల్యూషన్‌ను అందిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. పంచ్ హోల్ కటౌట్ స్క్రీన్ పైభాగంలో ఉంటుంది.
వన్ ప్లస్10 ప్రో 6.7-అంగుళాల AMOLED డిస్ప్లేతో ఆకర్షణీయంగా కనిపిస్తుంది. ఇది 120Hz రిఫ్రెష్ రేట్‌తో QHD+ రిజల్యూషన్‌ను ఉత్పత్తి చేస్తుంది. డిస్ప్లే కార్నింగ్ గొరిల్లా గ్లాస్ రక్షణను కూడా పొందుతుంది. పంచ్ హోల్ లేఅవుట్ ఫోన్ పైన భాగంలో-ఎడమ వైపున ఉంటుంది.
* హార్డ్‌వేర్
Xiaomi 12 ప్రో స్మార్ట్‌ఫోన్ సరికొత్త స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్సెట్ ద్వారా పనిచేస్తుంది. ఇండియాలో 8GB లేదా 12GB RAM అందుబాటులోకి రానున్నాయి. విస్తరించడానికి స్లాట్ లేకుండా అయితే స్టోరేజ్ ఆప్షన్లలో 128GB మరియు 256GB అందుబాటులోకి రానున్నాయి.
వన్ ప్లస్ 10 ప్రో సరికొత్త Snapdragon 8 Gen 1 చిప్సెట్ ద్వారా శక్తిని ఉపయోగిస్తుంది. 8GB లేదా 12GB RAM మాత్రేమే ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. అందుకు తగ్గట్టుగా 128GB , 256GB స్టోర్ మాత్రమే ఉంటుంది.
* కెమెరా
షియోమి12 Pro 50-మెగాపిక్సెల్ సెన్సార్లతో ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్తో అందుబాటులోకి రానుంది. OIS, అల్ట్రా-వైడ్-యాంగిల్ టెలిఫోటో స్వభావంతో ప్రాథమికంగా ఉంటుంది. ఫోన్ ముందు భాగంలో 32-మెగాపిక్సెల్ స్నాపర్ ఉంటుంది.
OnePlus 10 Pro 48-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్ అండ్ 8-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్‌తో కూడిన ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో అందుబాటులోకి రానుంది. అలాగే డ్యూయల్-LED ఫ్లాష్‌ని కలిగి ఉంది. ఫోన్ ముందువైపు 32-మెగాపిక్సెల్ షూటర్‌తో వస్తుంది.
* బ్యాటరీ
షియోమి 12 ప్రో 4600mAh బ్యాటరీతో వస్తుంది. అలాగే 120W ఫాస్ట్ వైర్డ్ ఛార్జింగ్, 50W ఫాస్ట్ వైర్లెస్ ఛార్జింగ్‌కు ఇది సపోర్ట్ చేస్తుంది. 10W రివర్స్ వైర్లెస్ చార్జర్‌ను సపోర్ట్ చేస్తుంది.
OnePlus 10 Pro పెద్ద 5000mAh బ్యాటరీతో రూపొందించారు. అయితే ఇది 80W ఫాస్ట్ వైర్డు ఛార్జింగ్ స్పీడ్‌ను మాత్రమే అందిస్తుంది. అయితే వైర్లెస్ వేగం 50W వద్ద Xiaomi 12 Pro మాదిరిగానే ఉంటుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.