Home /News /technology /

XIAOMI 12 PRO SMARTPHONE TO BE LAUNCHED IN INDIA SOON PRICE SPECIFICATIONS DETAILS HERE GH VB

Xiaomi 12 Pro: త్వరలోనే భారత మార్కెట్‌లోకి షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్ల వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (Xiaomi) భారత్‌లో వరుసగా ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ Xiaomi 12 Proను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది.

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (Xiaomi) భారత్‌లో వరుసగా ఫోన్లను విడుదల చేస్తోంది. తాజాగా ఫ్లాగ్‌షిప్ ఫోన్ Xiaomi 12 Proను లాంచ్ చేసేందుకు సిద్ధమైంది. కంపెనీ గత ఏడాది డిసెంబర్‌లో చైనాలో ఈ ఫోన్‌ను లాంచ్ చేసింది. చైనాలో ఈ నెలలోనే ఫోన్‌ను మార్కెట్లోకి విడుదల చేయనున్నారు. అయితే Xiaomi 12 ప్రో మోడల్‌ను ఇండియాలో కూడా రిలీజ్ చేస్తామని కంపెనీ గ్లోబల్ వైస్ ప్రెసిడెంట్ మను కుమార్ జైన్ చెప్పారు. గతంలో ఆయన షేర్ చేసిన టీజర్ ప్రకారం ఈ సరికొత్త స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ 12న మధ్యాహ్నం 12 గంటలకు లాంచ్ అవ్వాల్సింది. అయితే కాస్త ఆలస్యంగానైనా సరే ఈ ఫోన్ ఇండియాలో లాంచ్ కానుంది.

షియోమి చైనాలో Xiaomi 12 Proతో పాటు వనిల్లా Xiaomi 12ను కూడా విడుదల చేసింది. ప్రస్తుతానికి ఈ రెండు డివైజ్‌లు భారతదేశంలో లాంచ్ అవుతాయో లేదో స్పష్టంగా తెలియలేదు. అయితే Xiaomi 12 ప్రోను తమ ప్లాట్‌ఫామ్‌లో అమ్మకానికి ఉంచనున్నట్లు అమెజాన్‌ తెలిపింది.

Xiaomi 12 Pro ధర (అంచనా)
షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ ధర CNY 4,699 (సుమారు రూ.55,830) నుంచి ప్రారంభమవుతుంది. ఈ డివైజ్‌ భారతదేశంలో కూడా ఇదే ధరలో అందుబాటులో ఉండవచ్చు. ఇది ఇటీవల విడుదలైన OnePlus 10 Pro ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌తో పోటీపడనుంది. షియోమి 12 ప్రో అమెజాన్ ఇండియా, Mi ఆన్‌లైన్ స్టోర్‌తో పాటు కంపెనీ రిటైలర్స్‌లో అందుబాటులో ఉంటుంది. ఈ డివైజ్ బ్లాక్, బ్లూ, పర్పుల్ కలర్ ఆప్షన్లలో లభిస్తుందని నివేదికలు సూచిస్తున్నాయి.

Top 10 Companies: బెస్ట్ కంపెనీలో జాబ్ కోసం చూస్తున్నారా..? లింక్డ్‌ఇన్‌ ప్రకటించిన టాప్‌-10 కంపెనీలు ఇవే..


* షియోమి 12 ప్రో లాంచ్ డేట్
షియోమి 12 ప్రో ఫోన్ ఇండియాలో ఏప్రిల్ 12న లాంచ్ అయ్యే అవకాశం ఉంది. ఈ లాంచింగ్ ఈవెంట్ యూట్యూబ్, కంపెనీ వెబ్‌సైట్‌లో లైవ్ స్ట్రీమ్ అవ్వనుంది.

* స్పెసిఫికేషన్స్
షియోమి 12 ప్రో ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌పై కంపెనీ MIUI 13 స్కిన్‌తో రన్ అవుతుంది. దీన్ని 120Hz రిఫ్రెష్ రేట్, కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో 6.73-అంగుళాల పూర్తి HD+ AMOLED డిస్‌ప్లేతో రూపొందించారు. డిస్‌ప్లే HDR10+ సపోర్ట్‌, డాల్బీ విజన్ టెక్నాలజీతో వస్తుంది. స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పాటు గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ దీని ప్రత్యేకతలు. ప్రస్తుతానికి ఈ డివైజ్ స్టోరేజ్ వేరియంట్‌ల గురించి స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 50MP ప్రైమరీ కెమెరా, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 50MP పోర్ట్రెయిట్ కెమెరాతో కూడిన ట్రిపుల్ కెమెరా సెటప్‌తో రానుంది. ఈ సెటప్‌తో డివైజ్‌ OIS, 8K వీడియో రికార్డింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 120W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేసే 4,600mAh బ్యాటరీ ఇందులో ఉంటుంది. 5G SA / NSA సపోర్ట్, డ్యుయల్ 4G VoLTE, బ్లూటూత్ 5.2, GPS వంటి కనెక్టివిటీ ఫీచర్లు దీని సొంతం.
Published by:Veera Babu
First published:

Tags: 5g mobile, 5g smart phone, 5g technology, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు