Home /News /technology /

XIAOMI 12 PRO SMARTPHONE LAUNCH IN INDIA TOMORROW PRICE SPECIFICATIONS OTHER DETAILS HERE GH VB

Xiaomi 12 Pro: రేపే ఇండియాలో షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ధర, స్పెసిఫికేషన్స్, ఇతర వివరాలు..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ తయారీ సంస్థ షియోమి (Xiaomi) మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. షియోమి 12 ప్రో (Xiaomi 12 Pro) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 27న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది.

స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ సంస్థ షియోమి (Xiaomi) మరో కొత్త ఫోన్‌ను లాంచ్ చేయనుంది. షియోమి 12 ప్రో (Xiaomi 12 Pro) పేరుతో సరికొత్త స్మార్ట్‌ఫోన్‌ను ఏప్రిల్ 27న ఇండియన్ మార్కెట్లోకి లాంచ్ చేయనుంది. ఈ కొత్త ఫ్లాగ్‌షిప్ ఫోన్ కోసం చాలామంది ఎదురుచూస్తున్నారు. షియోమి ఈ డివైజ్‌ను గత సంవత్సరం డిసెంబర్‌లో చైనాలో విడుదల చేసింది. ఇది ఇప్పుడు Mi 11 అల్ట్రాకు సక్సెసర్‌గా భారత మార్కెట్లోకి వస్తోంది. Xiaomi 12 Pro ఒక హై-ఎండ్ డివైజ్‌గా రానుంది. కాబట్టి మార్కెట్లోని బెస్ట్ హార్డ్‌వేర్‌ను ఇందులో ఆశించవచ్చు.

షియోమి 12 ప్రో ధర (అంచనా)
గ్లోబల్ మార్కెట్‌లో ఈ స్మార్ట్‌ఫోన్ ధరలు $999 (సుమారు రూ. 76,100) నుంచి ప్రారంభమవుతాయి. 8GB + 256GB మోడల్‌కు ఈ ధర వర్తిస్తుంది. కానీ భారతదేశంలో షియోమి వీటి ధరలు మార్చే అవకాశం ఉంది. షియోమి 12 ప్రో మోడల్.. మార్కెట్లో iQOO 9 Pro, OnePlus 10 Pro వంటి డివైజ్‌లతో పోటీ పడనుంది. వీటన్నింటితో పోలిస్తే.. షియోమి 12 ప్రో ధర ఇండియాలో దాదాపు రూ. 60,000 ఉండవచ్చు. బేస్ మోడల్‌ ధర రూ. 58,999 నుంచి ప్రారంభం కావచ్చు. అయితే ఇండియాలో షియోమి 12 ప్రో మోడల్‌లోని అన్ని వేరియంట్‌లను కంపెనీ లాంచ్ చేస్తుందా లేదా అనే దానిపై స్పష్టమైన సమాచారం అందుబాటులో లేదు.

Business Idea: రూ.50వేలతో ఎల్ఈడీ బల్బుల తయారీ యూనిట్.. నెలకు రూ.1.5 లక్షల సంపాదన..


షియోమి 12 ప్రో స్పెసిఫికేషన్లు
షియోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ 6.73 అంగుళాల E5 AMOLED డిస్‌ప్లేతో రానుంది. ఇది WQHD+ రిజల్యూషన్, 120Hz రిఫ్రెష్ రేట్ సపోర్ట్, 522 పిక్సెల్ డెన్సిటీని అందిస్తుంది. స్క్రీన్ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్‌తో వస్తుంది. ఇది 1500 నిట్స్ పీక్ బ్రైట్‌నెస్‌ను అందిస్తుంది. ఈ ఫోన్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. 12GB RAM, 256GB వరకు స్టోరేజ్ ఆప్షన్‌తో వివిధ వేరియంట్లు రిలీజ్ కానున్నాయి. ఇది ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో యూజర్లను ఆకర్షించనుంది. ఈ సెటప్‌లో OIS సపోర్టెడ్ 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 50-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్-యాంగిల్ సెన్సార్, 50-మెగాపిక్సెల్ టెలిఫోటో సెన్సార్ ఉన్నాయి. అదనంగా 32-మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా కూడా ఉంటుంది.

షియోమి 12 ప్రో డివైజ్ ఆండ్రాయిడ్ 12-బేస్డ్ MIUI 13 వెర్షన్‌తో వచ్చిన మొదటి స్మార్ట్‌ఫోన్‌లలో ఒకటి. ఇది డాల్బీ అట్మోస్, హర్మాన్ కార్డాన్ సౌండ్ టెక్నాలజీతో నడిచే క్వాడ్-స్పీకర్ సెటప్‌తో వస్తుంది. ఇందులో 4,600mAh బ్యాటరీని ప్యాక్ చేస్తుంది. ఇది వైర్ ద్వారా 120W ఫాస్ట్ ఛార్జింగ్, 50W వైర్‌లెస్ ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. 10W రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్‌తో ఇతర చిన్న డివైజ్‌లను కూడా ఛార్జ్ చేయవచ్చు. భారతదేశంలో షియోమి 12 ప్రో ఏప్రిల్ 27న లాంచ్ కానుంది. మార్కెట్లోకి వివిధ ప్రొడక్ట్స్‌ను రిలీజ్ చేసేందుకు కంపెనీ పెద్ద ఈవెంట్‌ను నిర్వహిస్తోంది.
Published by:Veera Babu
First published:

Tags: 5G Smartphone, Smartphones, Technology, Xiomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు