XIAOMI 12 PRO MAX LAUNCHING THE PRO MAX FLAGSHIP SMARTPHONE OF ITS OWN IN 2022 THIS FULL DETAILS HERE GH VB
Xiaomi 12 Pro Max: ఈ ఏడాదిలోనే షియోమీ నుంచి 'ప్రో మ్యాక్స్' ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ లాంచ్.. ఈ ఫోన్ ప్రత్యేకతలివే..
ప్రతీకాత్మక చిత్రం
షియోమీ కంపెనీ త్వరలో షియోమీ 12 ప్రో మ్యాక్స్ (Xiaomi 12 Pro Max) ఫ్లాగ్షిప్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ (Smartphone) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి.
ప్రముఖ స్మార్ట్ఫోన్ల తయారీ సంస్థ షియోమీ (Xiaomi) ఎప్పటికప్పుడు సరికొత్త మొబైల్స్ (Mobiles) లాంచ్ చేస్తూ యూజర్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది. ఈ నేపథ్యంలోనే మరొక కొత్త ఫోన్ తీసుకొచ్చేందుకు రెడీ అయ్యింది. లేటెస్ట్ టెక్ రిపోర్ట్స్ ప్రకారం, కంపెనీ త్వరలో షియోమీ 12 ప్రో మ్యాక్స్ (Xiaomi 12 Pro Max) ఫ్లాగ్షిప్ మోడల్‌ను మార్కెట్లోకి తీసుకురానుంది. ఈ ఏడాది నాటికి ఈ స్మార్ట్‌ఫోన్ (Smartphone) అందుబాటులోకి వచ్చే అవకాశాలు ఉన్నాయి. ఫోన్ మోడల్లోని మ్యాక్స్ పదాన్ని బట్టి చూస్తే ఇది పెద్ద స్క్రీన్‌ను కలిగి ఉండొచ్చని తెలుస్తోంది. ఈ కంపెనీ గతేడాది డిసెంబర్ చివర్లో షియోమీ 12, షియోమీ 12 ప్రో అనే హై-ఎండ్ వేరియంట్స్ తీసుకొచ్చింది. అయితే వీటి కంటే మరింత మెరుగైన ఫీచర్లతో షియోమీ 12 అల్ట్రాని కూడా తీసుకొచ్చేందుకు సిద్ధమైనట్టు తెలుస్తోంది. అలాగే 12 సిరీస్ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్‌ల్లో 'ప్రో మ్యాక్స్' అనే వెరీ హై-ఎండ్ తీసుకొస్తున్నట్లు తెలియడంతో మొబైల్ ప్రియులు ఎగ్జైట్ అవుతున్నారు.
ఈ కంపెనీ యాపిల్ బ్రాండ్ నుంచి వచ్చిన ఫోన్ల డిజైన్స్‌ను కాపీ కొట్టడంతో ఈ చైనీస్ సంస్థకు యాపిల్ కాపీ కాట్ అనే ముద్ర పడిపోయింది. ఇప్పుడు ఈ కంపెనీ యాపిల్ ఐఫోన్ పేరు కూడా తన మొబైల్ కోసం కాపీ కొట్టినట్లు తెలుస్తోంది. గతంలో యాపిల్ సంస్థ ప్రో మ్యాక్స్ పేరుతో ఐఫోన్స్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇదే పేరును షియోమీ తన కొత్త ఫోన్‌కు కూడా పెడుతున్నట్టు టెక్ ఎక్స్పర్ట్స్ తెలుపుతున్నారు.
ఈ స్మార్ట్‌ఫోన్‌లో లైకా బ్రాండ్ నుంచి తయారైన కెమెరాను షియోమీ ఉపయోగించవచ్చు. ఇది కొనుగోలుదారులను మరింత ఆకట్టుకునే అవకాశం ఉంది. ప్రైస్ బ్యాండ్‌ను పెంచుతున్నప్పుడు కంపెనీ తన సాఫ్ట్‌వేర్‌ను మరింత బెటర్ గా తయారు చేయాల్సి ఉంటుంది. ఈ బిగ్ ఫోన్ పనితీరుకు మద్దతు ఇవ్వడానికి బిగ్ బ్యాటరీ కూడా అందించడం అవసరం. షియోమీ 12 ప్రో మ్యాక్స్ ప్రస్తుత షియోమీ 12 ప్రో ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ కంటే మరింత పవర్‌ఫుల్‌గా ఉండొచ్చు. లీక్‌లో పేర్కొన్న టైమ్‌లైన్‌ను పరిశీలిస్తే, షియోమీ 12 ప్రో మ్యాక్స్‌లో అప్ కమింగ్ Snapdragon 8 Gen 1+ చిప్సెట్ని ఉపయోగించవచ్చు. 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా మాడ్యూల్‌ను కలిగి ఉండే అవకాశముంది. లేదా ఎక్కువ మెగాపిక్సల్ కెమెరాలను అందించవచ్చు. షియోమీ 12 ప్రో మ్యాక్స్ 200W ఫాస్ట్ ఛార్జింగ్ స్పీడ్‌ను పొందిన తొలి స్మార్ట్‌ఫోన్ కావచ్చు.
ఈ ఫీచర్లన్నిటినీ కలిపి చూస్తే షియోమీ 12 ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ శాంసంగ్, గూగుల్, యాపిల్ వంటి బ్రాండ్ ఫోన్లకు బలమైన పోటీ ఇవ్వొచ్చని చెప్పవచ్చు. షియోమీ ప్రో మ్యాక్స్ స్మార్ట్‌ఫోన్ మీరు మార్కెట్లో శాంసంగ్ గెలాక్సీ అల్ట్రా లేదా యాపిల్ ఐఫోన్ ప్రో మ్యాక్స్ వేరియంట్ కోసం చెల్లించే ధర కంటే చాలా తక్కువగా ఉండొచ్చు. ఈ షియోమీ ఫ్లాగ్షిప్ స్మార్ట్‌ఫోన్ గురించి మరిన్ని వివరాలు త్వరలో తెలిసే అవకాశం ఉంది. ఒకవేళ ఇదే సంవత్సరంలో షియోమీ కొత్త ఫోన్ విడుదలైతే వన్‌ప్లస్ ఫోన్ నుంచి కూడా పోటీ ఎదుర్కోవాల్సి వస్తుంది. ఎందుకంటే వన్‌ప్లస్ 10 సిరీస్‌లో భాగంగా తన మొట్టమొదటి అల్ట్రా వేరియంట్‌ను తయారు చేస్తోంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.