ప్రీమియం ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను కొనాలనుకునేవారు యాపిల్ ఐఫోన్లు తీసుకుంటూ ఉంటారు. అయితే బడ్జెట్ స్మార్ట్‌ఫోన్లతో పరిచయం అయిన కంపెనీలు కూడా ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్లను రిలీజ్ చేస్తుంటాయి. చైనాకు చెందిన స్మార్ట్‌ఫోన్ కంపెనీ షావోమీ... ఫ్లాగ్‌షిప్ సెగ్మెంట్‌లో షావోమీ 12 ప్రో (Xiaomi 12 Pro) స్మార్ట్‌ఫోన్‌ను రిలీజ్ చేసింది. సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్‌తో పాటు ఐఫోన్ 13 (iPhone 13) స్మార్ట్‌ఫోన్లకు గట్టి పోటీ ఇచ్చేలా షావోమీ 12 ప్రో ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ గతేడాది చైనాలో లాంఛ్ అయింది. కాబట్టి స్పెసిఫికేషన్స్ తెలిసినవే. ఇదే మొబైల్ ఇప్పుడు ఇండియాకు వచ్చింది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 (Snapdragon 8 Gen 1) ప్రాసెసర్ ఉండటం విశేషం.
షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ రెండు వేరియంట్లలో రిలీజైంది. 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.62,999 కాగా, 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.66,999. మే 2న సేల్ ప్రారంభం కానుంది. అమెజాన్, షావోమీ అధికారిక వెబ్‌సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్‌లో కొనొచ్చు. లాంఛ్ ఆఫర్స్‌లో భాగంగా ఐసీఐసీఐ బ్యాంక్ కార్డు హోల్డర్స్‌కు రూ.6,000 క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఇంట్రడక్టరీ ప్రైస్ కింద షావోమీ నుంచి మరో రూ.4,000 తగ్గింపు లభిస్తుంది. ఈ రెండు ఆఫర్స్ కలిపి 8జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.52,999 ధరకు, 12జీబీ+256జీబీ వేరియంట్‌ను రూ.56,999 ధరకు సొంతం చేసుకోవచ్చు. మే 1న షావోమీ ఫ్యాన్ సేల్ జరుగుతుంది. ఈ సేల్‌లో ఎంఐ, రెడ్‌మీ స్మార్ట్‌ఫోన్లు ఎక్స్‌ఛేంజ్ చేసి ఈ స్మార్ట్‌ఫోన్ కొంటే రూ.20,000 వరకు డిస్కౌంట్ లభిస్తుంది.
iQoo Z6 Pro 5G: పాపులర్ ప్రాసెసర్‌తో ఐకూ జెడ్6 ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్
When performance and perfection combine the way that gives you the best value. #TheShowstopper is here!#Xiaomi12Pro at a stunning price of
just ₹62,999* for 8GB + 256GB and,
just ₹66,999* for 12GB + 256GB
Tune into #XiaomiNext for the next drop:https://t.co/W9TAKgHddN pic.twitter.com/004wyM00lJ
— Xiaomi India (@XiaomiIndia) April 27, 2022
షావోమీ 12 ప్రో స్పెసిఫికేషన్స్
షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల క్వాడ్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఇదే ప్రాసెసర్ ఇటీవల రిలీజైన రియల్‌మీ జీటీ 2 ప్రో స్మార్ట్‌ఫోన్‌తో పాటు వన్‌ప్లస్ 10ప్రో, ఐకూ 9 ప్రో, మోటో ఎడ్జ్ 30 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్22 సిరీస్ స్మార్ట్‌ఫోన్లలో ఉంది. గొరిల్లా గ్లాస్ విక్టస్ ప్రొటెక్షన్ లభిస్తుంది.
Poco M4 5G: రూ.15,000 లోపే మరో 5జీ స్మార్ట్‌ఫోన్... పోకో ఎం4 ప్రత్యేకతలివే
షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. మూడు కెమెరాలు 50మెగాపిక్సెల్ సెన్సార్లతో ఉండటం హైలైట్. ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్‌తో 50మెగాపిక్సెల్ Sony IMX707 సెన్సార్ + 50మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ యాంగిల్ సెన్సార్ + 50మెగాపిక్సెల్ టెలీఫోటో సెన్సార్లతో వెనుకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. రియర్ కెమెరాలో షావోమీ ప్రో ఫోకస్, అల్‌ట్రా నైట్ ఫోటో, పోర్ట్‌రైట్ నైట్ మోడ్, పోర్ట్‌రైట్ హెచ్‌డీఆర్, ఫోటో క్లోన్స్, టైమ్డ్ బరస్ట్, ఫోటో ఫిల్టర్స్, నైట్ మోడ్, 50ఎంపీ మోడ్, డాక్యుమెంట్ మోడ్, ఏఐ కెమెరా, మూవీ ఫ్రేమ్, ప్రో మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో సెల్ఫీలు, వీడియోకాల్స్ కోసం 32మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఫ్రంట్ కెమెరాలో సెల్ఫీ నైట్ మోడ్, ఏఐ బ్యూటిఫై, ఏఐ పోర్ట్‌రైట్, మూవీ ఫ్రేమ్, హెచ్‌డీఆర్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి.
షావోమీ 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌లో 4,600ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. బూస్ట్ మోడ్‌తో 18 నిమిషాల్లో 100శాతం, స్టాండర్డ్ మోడ్‌లో 24 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. 50వాట్ వైర్‌లెస్ టర్బో ఛార్జింగ్, 10వాట్ రివర్స్ వైర్‌లెస్ ఛార్జింగ్ సపోర్ట్ కూడా ఉంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. మూడేళ్లు ఆండ్రాయిడ్ ఓఎస్ అప్‌డేట్స్, నాలుగేళ్లు సెక్యూరిటీ సపోర్ట్ లభిస్తుందని కంపెనీ చెబుతోంది. బ్లూ, గ్రే, పర్పుల్ కలర్స్‌లో కొనొచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Xiaomi