హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Xiaomi Offer: అమేజింగ్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.11,000 తగ్గింపు!

Xiaomi Offer: అమేజింగ్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.11,000 తగ్గింపు!

అమేజింగ్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.11,000 తగ్గింపు!

అమేజింగ్ ఆఫర్.. స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ.11,000 తగ్గింపు!

Smartphone Offers |షావోమి స్మార్ట్‌ఫోన్‌పై భారీ తగ్గింపు అందుబాటులో ఉంది. ఏకంగా రూ. 11 వేల వరకు తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. ఫోన్ ప్రత్యేకతలు, ఆఫర్ వివరాల గురించి పూర్తిగా తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

    Xiaomi Sale | కొత్తగా ఫోన్ కొనుగోలు చేయాలని భావించే వారికి భారీ తగ్గింపు ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్స్ తయారీ కంపెనీ అయిన షావోమి (Xiaomi) తన ఫ్లాగ్‌షిప్ స్మార్ట్‌ఫోన్‌పై (Smartphone) భారీ తగ్గింపు ఆఫర్‌ను ప్రకటించింది. గ్రేట్ కెమెరా, గ్రేట్ డిస్‌ప్లే వంటి ఫీచర్లతో కూడిన 5జీ (5G) స్మార్ట్‌ఫోన్‌పై ఈ ఆఫర్ అందుబాటులో ఉంది. ఇది అమేజింగ్ ఆఫర్ అని చెప్పుకోవచ్చు.

    కంపెనీ వెబ్‌సైట్ ప్రకారం చూస్తే.. షావోమి 12 ప్రో 5జీ ఫోన్‌పై ఏకంగా రూ. 11 వేల వరకు తగ్గింపు అందుబాటులో ఉంది. మీరు ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డు ద్వారా ఈ ఫోన్‌ను కొనుగోలు చేస్తే రూ. 6 వేల వరకు తక్షణ తగ్గింపు లభిస్తుంది. అంతేకాకుండా కంపెనీ అదనంగా రూ. 5 వేల డిస్కౌంట్ ఆఫర్ చేస్తోంది. అంటే ఈ రెండు డీల్స్‌ను కలుపుకుంటే షోవమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్‌పై ఏకంగా రూ. 11 వేల డిస్కౌంట్‌ను పొందొచ్చు.

    గుడ్ న్యూస్.. భారీగా పడిపోయిన బంగారం ధర

    అంతేకాకుండా ఈ ఫోన్ కొనుగోలుపై ఇతర ఆఫర్ కూడా ఒకటుంది. షావోమి 12 ప్రో స్మార్ట్‌ఫోన్ కొంటే మూడు నెలల వరకు యూట్యూబ్ ప్రీమియం సబ్‌స్క్రిప్షన్ ఉచితంగానే లభిస్తుంది. దీనికి కూడా మీరు ఎలాంటి డబ్బులు చెల్లించాల్సిన పని లేదు. యాడ్స్ లేకుండా, ఇతర ప్రయోజనాలతో యూట్యూబ్‌ను మూడు నెలల వరకు ఉపయోగించుకోవచ్చు.

    ఉద్యోగులకు భారీ బోనస్.. 2 రోజుల్లో అకౌంట్లలోకి రూ.5 లక్షలు! వారికి మాత్రమే..

    ఇకపోతే షావోమి 12 ప్రో 5జీ ఫోన్ 12 జీబీ ర్యామ్, 256 జీబీ మొమరీ ఆప్షన్‌తో కస్టమర్లకు అందుబాటులో ఉంది. ఈ ఫోన్ ప్రారంభం ధర రూ. 62,999. అన్ని ఆఫర్లను కలుపుకుంటే ఈ ఫోన్‌ను రూ. 51,999కు కొనొచ్చు. కాగా ఈ ఫోన్‌లో 50 ఎంపీ + 50 ఎంపీ + 50 ఎంపీ ఫ్లాగ్‌షిప్ కెమెరా సెటప్ ఉంది. ఇంకా 2కే అమోల్డ్ డిస్‌ప్లే ఉంటుంది. కంపెనీ ఈ ఫోన్‌లో 6.73 అంగుళాల స్క్రీన్‌ను అమర్చింది. హెచ్‌డీఆర్ 10 ప్లస్, డాల్బే విజన్ వంటి ప్రత్యేకతలు ఉన్నాయి. అలాగే ఈ ఫోన్‌లో స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 చిప్‌ సెట్ ఉంటుంది. కెమెరా ముందు భాగంలో 32 ఎంపీ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇంకా ఇందులో అండర్ డిస్‌ప్లే ఫింగర్‌ప్రింగ్ సెన్సార్, 4600 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఐకూ 9 ప్రో స్మార్ట్‌ఫోన్‌కు పోటీగా షావోమి ఈ ఫోన్‌ను మార్కెట్‌లోకి తీసుకువచ్చింది. రెండింటిలోనూ దాదాపుగా ఒకే రకమైన ఫీచర్లు ఉంటాయి. అయితే ఇందులో ఫ్రంట్ కెమెరా ఎక్కువ పిక్సెల్స్ ఉంది. ధర కూడా రెండు ఫోన్లకు దాదాపుగా సమంగానే ఉంది.

    Published by:Khalimastanvali Khalimastanvali
    First published:

    Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Flipkart Big Billion Days, Latest offers, Xiaomi

    ఉత్తమ కథలు