Home /News /technology /

XIAOMI 12 LITE SMARTPHONE LAUNCHED WITH SNAPDRAGON 778G PROCESSOR AMOLED DISPLAY KNOW PRICE AND SPECIFICATIONS SS

Xiaomi 12 Lite: షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా

Xiaomi 12 Lite: షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా

Xiaomi 12 Lite: షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ రిలీజ్... స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్, 120Hz డిస్‌ప్లే, 108MP కెమెరా

Xiaomi 12 Lite | షావోమీ 12 సిరీస్‌లో మరో మొబైల్ లాంఛైంది. షావోమీ 12 లైట్ (Xiaomi 12 Lite) స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది. ఇందులో పాపులర్ ప్రాసెసర్, అమొలెడ్ డిస్‌ప్లే, ట్రిపుల్ కెమెరా సెటప్ ఉండటం విశేషం.

షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ లాంఛైంది. షావోమీ 12 లైట్ (Xiaomi 12 Lite) మోడల్‌ని రిలీజ్ చేసింది కంపెనీ. ఇప్పటికే షావోమీ 12 సిరీస్‌లో షావోమీ 12ఎస్, షావోమీ 12ఎస్ ప్రో, షావోమీ 12ఎస్ అల్‌ట్రా మోడల్స్ రిలీజ్ అయ్యాయి. ఇండియాలో షావోమీ 12 ప్రో 5జీ మొబైల్ అందుబాటులో ఉంది. ఇప్పుడు గ్లోబల్ మార్కెట్‌లో షావోమీ 12 లైట్ లాంఛైంది. ఇందులో స్నాప్‌డ్రాగన్ 778జీ (Snapdragon 778G) ప్రాసెసర్, 120Hz అమొలెడ్ డిస్‌ప్లే, 108MP ట్రిపుల్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందన్న స్పష్టత లేదు. అయితే ఇప్పటికే ఇండియాలో షావోమీ 11 లైట్ అందుబాటులో ఉంది కాబట్టి షావోమీ 12 లైట్ రిలీజ్ కావచ్చని అంచనా.

షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.31,650 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.35,600. ఇక హైఎండ్ వేరియంట్ 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ మోడల్ ధర రూ.39,600. లైట్ గ్రీన్, లైట్ పింక్, బ్లాక్ కలర్స్‌లో కొనొచ్చు. ఇప్పటికే ప్రీఆర్డర్స్ మొదలయ్యాయి.

43 inches Smart TV: 43 అంగుళాల స్మార్ట్ టీవీ... ఆఫర్ ధర రూ.18,999 మాత్రమే

షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే ఇందులో 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. HDR10+, డాల్బీ విజన్ సపోర్ట్ లభిస్తుంది. డిస్‌ప్లేకు కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్ ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. షావోమీ 11 లైట్ మోడల్‌లో కూడా ఇదే ప్రాసెర్ ఉంది. ఈ ప్రాసెసర్‌తో ఇండియాలో రియల్‌మీ జీటీ మాస్టర్ ఎడిషన్, రియల్‌మీ 9 5జీ స్పీడ్ ఎడిషన్, సాంసంగ్ గెలాక్సీ ఎం52 లాంటి మోడల్స్ ఉన్నాయి.

Jio Plans: జియో ప్లాన్ రీఛార్జ్ చేయాలా? ఈ 6 ప్రీపెయిడ్ ప్లాన్స్ పాపులర్



షావోమీ 12 లైట్ స్మార్ట్‌ఫోన్ కెమెరా ఫీచర్స్ చూస్తే 108మెగాపిక్సెల్ Samsung HM2 ప్రైమరీ సెన్సార్ + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 32 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది. ఇందులో 4300ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 67వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ లభిస్తుంది. ఛార్జర్ బాక్సులోనే లభిస్తుంది. ఆండ్రాయిడ్ 12 + ఎంఐయూఐ 13 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. డ్యూయెల్ స్టీరియో స్పీకర్స్ ఉన్నాయి. డాల్బీ ఆట్మస్ సపోర్ట్ లభిస్తుంది. బ్లూటూత్ 5.2, వైఫై 6, ఎన్ఎఫ్‌సీ, 5జీ, 4జీ ఎల్‌టీఈ లాంటి కనెక్టివిటీ ఆప్షన్స్ ఉన్నాయి.
Published by:Santhosh Kumar S
First published:

Tags: 5G Smartphone, Mobile News, Mobiles, Smartphone, Xiaomi

తదుపరి వార్తలు