షావోమీ ఇండియా భారతదేశంలో మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్ చేసింది. షావోమీ 11టీ ప్రో 5జీ (Xiaomi 11T Pro 5G) స్మార్ట్‌ఫోన్‌ను పరిచయం చేసింది. షావోమీ హైపర్‌ఫోన్ (Hyperphone) పేరుతో ఈ స్మార్ట్‌ఫోన్‌ను ప్రచారం చేస్తోంది కంపెనీ. ఇందులో 120వాట్ ఫాస్ట్ ఛార్జింగ్, 120Hz డిస్ప్లే, క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, హర్మాన్ కార్డన్ రూపొందించిన స్పీకర్ సిస్టమ్, ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ లాంటి ప్రత్యేకతలున్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్ వన్‌ప్లస్ 9ఆర్టీ, వివో వీ23 ప్రో, సాంసంగ్ గెలాక్సీ ఎస్21 ఎఫ్ఈ లాంటి మోడల్స్‌కు గట్టి పోటీ ఇవ్వనుంది. ముంబైలో ఎయిర్‌టెల్‌తో కలిసి తొలి 5జీ ట్రయల్‌ను చేస్తున్న మొదటి స్మార్ట్‌ఫోన్ ఇదే కావడం విశేషం.
షావోమీ 11టీ ప్రో 5జీ ధర
షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ మూడు వేరియంట్లలో రిలీజ్ అయింది. 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,999 కాగా, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.41,999. హైఎండ్ వేరియంట్ 12జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ ధర రూ.43,999. ఈ స్మార్ట్‌ఫోన్ సేల్ ప్రారంభమైంది. అమెజాన్, షావోమీ వెబ్సైట్లతో పాటు ఎంఐ హోమ్ స్టోర్స్, ఆఫ్‌లైన్ రీటైలర్ల దగ్గర కొనొచ్చు. లాంఛింగ్ ఆఫర్లో భాగంగా సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డుతో కొంటే రూ.5,000 ఇన్స్టంట్ డిస్కౌంట్ లభిస్తుంది.
Only #Xiaomi11TPro will stun you NOT the pricing ;)#Xiaomi11TPro (8GB, 128GB) for just 34,999* and #Xiaomi11TPro (12GB, 256GB) for 38,999* only. #TheHyperphone sale starts at 2:00pm | Exceptional bank & exchange offers.
షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 5,000ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 120వాట్ హైపర్‌ఛార్జ్ ఛార్జింగ్ టెక్నాలజీ సపోర్ట్ చేస్తుంది. ఈ ఛార్జర్‌తో షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌ను 17 నిమిషాల్లో 100 శాతం ఛార్జింగ్ చేయొచ్చు. కనెక్టివిటీ ఆప్షన్స్ చూస్తే 5జీ, 4జీ, వైఫై 6, బ్లూటూత్, ఎన్ఎఫ్సీ, యూఎస్బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఆప్షన్స్ ఉన్నాయి.
షావోమీ 11టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్‌లో 108 మెగాపిక్సెల్ Samsung HM2 సెన్సార్ + 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ మ్యాక్రో లెన్స్‌తో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 16 మెగాపిక్సెల్ కెమెరా ఉంది. ఇందులో 50 డైరెక్టర్ మోడ్స్, ప్రో టైమ్ ల్యాప్స్, సినిమాటిక్ ఫిల్టర్స్, ఆడియో జూమ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. 8కే వీడియో రికార్డింగ్ చేయొచ్చు.
Published by:Santhosh Kumar S
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.