Xiaomi Offer | ప్రీమియం స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేయాలని ఆలోచిస్తున్నారా? అయితే శుభవార్త. దిగ్గజ ఈకామర్స్ సంస్థ అమెజాన్‌లో (Amazon) భారీ తగ్గింపు ఆఫర్ అందుబాటులో ఉంది. అదిరిపోయే ఫీచర్లు ఉన్న స్మార్ట్‌ఫోన్‌ను (Smartphone) భారీ తగ్గింపుతో పొందొచ్చు. ఎలా అని అనుకుంటున్నరా? అయితే మీరు షావోమి 11టీ ప్రో 5జీ ఫోన్‌పై లభిస్తున్న ఆఫర్ వివరాలు తెలుసుకోవాల్సిందే.
ఈ ఫోన్లో 108 కెమెరా, 120 వాట్ చార్జింగ్ స్పీడ్ వంటి ఫీచర్లు ఉన్నాయి. ఈ ఫోన్‌ను ఇప్పుడు మీరు రూ. 36,999కు కొనొచ్చు. ఈ స్మార్ట్‌ఫోన్ ఎంఆర్పీ రూ. 52,999. అంటే మీకు ఈ ఫోన్‌పై 30 శాతం డిస్కౌంట్ లభిస్తోందని చెప్పుకోవచ్చు. బ్యాంక్ ఆఫర్ ఉంది. ఇందులో భాగంగా బ్యాంక్ క్రెడిట్ కార్డు కలిగిన వారికి రూ. 4 వేల వరకు తగ్గింపు వస్తుంది.
ఎక్స్చేంజ్ ఆఫర్+బ్యాంక్ డిస్కౌంట్.. రూ.199కే కొత్త స్మార్ట్‌ఫోన్ పొందండిలా!
ఈ ఆఫర్లు అన్నింటినీ కలుపుకుంటే.. షావోమి 11టీ ప్రో ఫోన్‌ను రూ. 32,999కే కొనొచ్చు. ఇంకా ఎక్స్చేంజ్ ఆఫర్ కూడా లభిస్తోంది. ఏకంగా రూ. 30,000 వరకు ఎక్స్చేంజ్ తగ్గింపు సొంతం చేసుకోవచ్చు. అంటే ఫోన్‌పై పలు రకాల ఆఫర్లు అందుబాటులో ఉన్నాయని చెప్పుకోవచ్చు.
కిల్లింగ్ ఆఫర్.. రూ.37,000 ఫోన్‌ను రూ.13 వేలకే కొనండి!
ఇక ఫోన్ ఫీచర్ల విషయానికి వస్తే.. ఇందులో 6.67 అంగుళాల అమొలెడ్ డిస్ప్లే, డాల్బే విజన్, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేటు, గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్, 12 జీబీ ర్యామ్, 256 జీబీ మెమరీ, స్నాప్‌డ్రాగన్ 888 ప్రాసెసర్, ఎక్స్60 5జీ మోడెమ్, 108 ఎంపీ ట్రిపుల్ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్ సపోర్ట్ వంటి ఫీచర్లు ఉన్నాయి. బ్యాటరీ 17 నిమిషాల్లోనే ఫుల్ అవుతుంది.
ఈఎంఐ ఆఫర్లో కూడా ఈ ఫోన్ కొనొచ్చు. నెలవారీ ఈఎంఐ రూ. 1768 నుంచి ప్రారంభం అవుతోంది. 24 నెలలకు ఇది వర్తిస్తుంది. అదే ఏడాది ఈఎంఐ పెట్టుకుంటే నెలకు రూ. 3339 చెల్లించాల్స వస్తుంది. ఇంకా నో కాస్ట్ ఈఎంఐ బెనిఫిట్ కూడా పొందొచ్చు. ఆరు నెలల వరకు టెన్యూర్ పెట్టుకోవచ్చు. నెలకు రూ. 6167 ఈఎంఐ కట్టాల్సి వస్తుంది. కాగా ఈ ఈఎంఐ ఆఫర్లు అనేవి కార్డు ప్రాతిపదికన మారుతూ ఉంటాయి. అందువల్ల ఏ కార్డుపై ఎలాంటి ఆఫర్లు ఉన్నాయో కొనే ముందు చెక్ చేసుకోవచ్చు. ఈఎంఐ ట్రాన్సాక్షన్లపై రూ. 200 వరకు ప్రాసెసింగ్ ఫీజు పడుతుంది. అందువల్ల ఈ విషయాన్ని గుర్తించుకోవాలి. కొన్ని బ్యాంకులు ఈ చార్జీలను వసూలు చేస్తున్నాయి.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Amazon, Latest offers, Mobile offers, Xiaomi