XIAOMI 11T PRO 5G SMART PHONE ARE GOING TO LAUNCH ON SANKRANTHI PRICE AND FEATURES HERE GH VB
Xiaomi 11T Pro 5G: సంక్రాంతి కానుకగా లాంచ్ కాబోతున్న Xiaomi 11T Pro 5G ధర, ఫీచర్ల వివరాలివే..
ప్రతీకాత్మక చిత్రం
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న షియోమి 11 టీ ప్రో 5జీ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ డేట్ ఫిక్స్ అయ్యింది. జనవరి 19న భారత మార్కెట్లోకి లాంచ్ చేస్తామని షియోమి అధికారికంగా ప్రకటించింది. ధరతో పాటు పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
స్మార్ట్‌ఫోన్ ప్రియులు ఎంతగానో ఎదురుచూస్తోన్న షియోమి 11 టీ ప్రో 5జీ (11T Pro 5G) స్మార్ట్‌ఫోన్ రిలీజ్ (Smartphone release date) డేట్ ఫిక్స్ అయ్యింది. జనవరి 19న భారత మార్కెట్లోకి లాంచ్(Market Launch) చేస్తామని షియోమి(Xiaomi) అధికారికంగా ప్రకటించింది. అయితే, ఇప్పటికే ఈ ఫోన్‌ను యూరప్ మార్కెట్లోకి లాంచ్ చేసింది. భారత్‌లో కూడా ఇవే ఫీచర్లు(Features), ధరతో లాంచ్ అయ్యే అవకాశం ఉందని టెక్ నిపుణులు చెబుతున్నారు. ఇక, షియోమి (Xiaomi) 11టీ ప్రో గ్లోబల్ వేరియంట్ మెటోరైట్ గ్రే, మూన్లైట్ వైట్, సెలెస్టియల్ బ్లూ కలర్ వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. అయితే, భారత మార్కెట్లో ప్రస్తుతానికి గ్రే కలర్ వేరియంట్ మాత్రమే రిలీజ్ కానుంది. అతి త్వరలోనే మిగిలిన కలర్ వేరియంట్లలో కూడా విడుదలయ్యే అవకాశం ఉంది.
కెమెరా విషయానికి వస్తే.. షియోమి 11టీ ప్రో 5జీలో 108 ఎంపీ మెయిన్ కెమెరా, 8 ఎంపీ వైడ్ యాంగిల్ కెమెరా, 5 ఎంపీ టెలి-మాక్రో లెన్స్ కెమెరాలను అందించింది. ఇక దీని ముందు భాగంలో 16 ఎంపీ సెల్ఫీ షూటర్ కెమెరాను చేర్చింది. బ్యాటరీ లైఫ్ విషయానికి వస్తే, షియోమి 11 టీ ప్రో 5జీ 5,000mAh బ్యాటరీని కలిగి ఉంటుంది, యూఎస్బీ టైప్- సీ ఛార్జింగ్ పోర్ట్ ద్వారా 120W వరకు ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
Published by:Veera Babu
First published:
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి.
రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.