Home /News /technology /

XIAOMI 11I HYPERCHARGE TO LAUNCH IN INDIA ON 2022 JANUARY 6 SUPPORTS 120W FAST CHARGING SS GH

Xiaomi 11i Hypercharge: జనవరి 6న ఇండియాలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్ లాంఛ్... లీకైన ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే

Xiaomi 11i Hypercharge: జనవరి 6న ఇండియాలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్ లాంచ్... లీకైన ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే
(image: Xiaomi India)

Xiaomi 11i Hypercharge: జనవరి 6న ఇండియాలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఫోన్ లాంచ్... లీకైన ధర, స్పెసిఫికేషన్ల వివరాలివే (image: Xiaomi India)

Xiaomi 11i Hypercharge | కొత్త సంవత్సరంలో కొత్త స్మార్ట్‌ఫోన్స్ లాంఛ్ కాబోతున్నాయి. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్మార్ట్‌ఫోన్ జనవరి 6న లాంఛ్ కానుంది. లీకైన ధర, స్పెసిఫికేషన్స్ వివరాలు తెలుసుకోండి.

చైనీస్​ స్మార్ట్​బ్రాండ్​ షావోమీ కొత్త ఏడాదిలో షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్‌ (Xiaomi 11i Hypercharge) స్మార్ట్‌ఫోన్ ఎడిషన్​ను లాంచ్ చేయనుంది. దీన్ని జనవరి 6న భారత మార్కెట్​లోకి లాంచ్​ చేయనున్నట్లు షావోమీ అధికారికంగా వెల్లడించింది. అక్టోబర్​లో చైనాలో విడుదలైన రెడ్‌మీ నోట్ 11 ప్రో ప్లస్ (Redmi Note 11 Pro Plus) స్మార్ట్‌ఫోన్‌​కు ఇది రీబ్రాండెడ్ వెర్షన్​గా వస్తుంది. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 120W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్ ఇస్తుంది. ఇది కేవలం 15 నిమిషాల్లో ఇన్‌బిల్ట్ బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేస్తుందని కంపెనీ పేర్కొంది. ఈ స్మార్ట్​ఫోన్​ 5జీ కనెక్టివిటీకి కూడా మద్దతిస్తుంది.

షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్‌తో పాటు షావోమీ 11ఐ సాధారణ మోడల్​ని కూడా కంపెనీ ఒకేసారి లాంచ్​ చేయనుంది. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఎడిషన్..​ షావోమీ 11ఐ సిరీస్‌లో భాగంగా ఉంటుందని కంపెనీ పోస్ట్ చేసిన టీజర్​లో పేర్కొంది. ఈ స్మార్ట్​ఫోన్ కామో గ్రీన్, స్టెల్త్ బ్లాక్ కలర్​ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

Infinix Note 11: ఇన్ఫీనిక్స్ నోట్ 11 సేల్ మొదలైంది... ఆఫర్ ధర రూ.11,999 మాత్రమే


షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ధర (అంచనా)


షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ ఎడిషన్, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​ రీబ్రాండ్​​ వెర్షన్​గా వస్తోంది. అంటే దీని ధర దాదాపు రెడ్​మీ నోట్​ 11 ప్రోతో సమానంగా ఉండనుంది. చైనాలో విడుదలైన రెడ్​మీ నోట్​ 11 ప్రో 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ వేరియంట్​ CNY 1,899 (దాదాపు రూ. 22,500) ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. 8 జీబీ + 128జీబీ వేరియంట్ CNY 2,099 (దాదాపు రూ. 24,900) వద్ద అందుబాటులో ఉంటుంది. మరోవైపు, 8జీబీ ర్యామ్​ + 256 జీబీ టాప్​ ఎండ్ వేరియంట్​ CNY 2,299 (సుమారు రూ. 27,300) వద్ద అందుబాటులో ఉంటుంది. అయితే ఈ ధరలను కంపెనీ ధ్రువీకరించాల్సి ఉంది.

Smartphone Mistakes: కొత్త స్మార్ట్‌ఫోన్ కొన్నారా? ఈ తప్పులు చేస్తే మీకే రిస్క్

షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్పెసిఫికేషన్లు (అంచనా)


షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ స్పెసిఫికేషన్లను అధికారికంగా ప్రకటించనప్పటికీ, రెడ్​మీ నోట్​ 11 ప్రో ప్లస్​తో సమానంగా ఉంటాయని లీకేజీలను బట్టి తెలుస్తోంది. షావోమీ 11ఐ హైపర్‌ఛార్జ్ 120Hz రిఫ్రెష్ రేట్‌తో కూడిన 6.67 అంగుళాల AMOLED డిస్‌ప్లేతో వస్తుంది. ఇది 108 మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్‌తో ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్​ను కలిగి ఉంటుంది. దీనిలో డ్యూయల్ జేబీఎల్​ -ట్యూన్డ్ స్టీరియో స్పీకర్లు, ఎన్​ఎఫ్​సీ సపోర్ట్ వంటి కనెక్టింగ్​ ఫీచర్లను అందించింది. ఈ ఫోన్‌లో 4,500mAh బ్యాటరీని చేర్చే అవకాశం ఉంది. ఈ డివైజ్ ఆక్టా-కోర్ మీడియాటెక్​ డైమెన్సిటీ 920 SoC ప్రాసెసర్​తో పనిచేస్తుంది. అయితే కంపెనీ అధికారికంగా స్మార్ట్‌ఫోన్‌ను లాంచ్ చేసిన తరువాతే, దీని పూర్తిస్థాయి ఫీచర్లు, స్పెసిఫికేషన్ల వివరాలు తెలిసే అవకాశం ఉంది.
Published by:Santhosh Kumar S
First published:

Tags: Mobile News, Mobiles, Smartphone, Xiaomi

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు