Flipkart Offer | కొత్త ఫోన్ కొనుగోలు చేయాలని భావిస్తున్నారా? అయితే మీకు శుభవార్త. మీకోసం అదిరిపోయే ఆఫర్ ఒకటి అందుబాటులో ఉంది. ఎక్స్చేంజ్ ఆఫర్లో ఉచితంగా స్మార్ట్‌ఫోన్ (Smartphone) పొందొచ్చు. దిగ్గజ ఈకామర్స్ సంస్థ ఫ్లిప్‌కార్ట్‌లో (Flipkart) భారీ ఎక్చ్సేంజ్ ఆఫర్ లభిస్తోంది. మీ పాత ఫోన్ ఇచ్చేస్తే.. ఉచితంగా కొత్త ఫోన్ పొందొచ్చు. ఆఫర్ వివరాలు ఎలా ఉన్నాయో ఇప్పుడు ఒకసారి తెలుసుకుందాం.
షావోమి 11ఐ హైపర్‌చార్జ్ స్మార్ట్‌ఫోన్‌పై ఈ డీల్ అందుబాటులో ఉంది. ఈ ఆఫర్ ఈ ఒక్క రోజు మాత్రమే ఉంటుంది. కేవలం 15 నిమిషాల్లోనే బ్యాటరీ ఫుల్ అయ్యే ఈ స్మార్ట్‌ఫోన్‌ను ఉచితంగానే పొందే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆఫర్లో భాగంగా ఈ ఫోన్ ధర రూ. 20,499 నుంచి ప్రారంభం అవుతోంది. ఈ ఫోన్ ఎంఆర్పీ రూ. 31,999గా ఉంది.
ఉచితంగా 75 జీబీ డేటా.. ఈ ఒక్క రోజే ఆఫర్!
షావోమి 11ఐ హైపర్‌చార్జ్ 6 జీబీ ర్యామ్, 128 జీబీ మెమరీ వేరియంట్ ధర రూ. 24,999గా ఉంది. ఈ ఫోన్‌పై రూ. 7 వేల డిస్కౌంట్ లభిస్తోంది. ఇంకా బ్యాంక్ ఆఫర్లు కూడా ఉన్నాయి. బ్యాంక్ ఆఫర్ కలుపుకొని చూస్తే.. ఈ ఫోన్ ధర రూ. 20,499 నుంచి ప్రారంభం అవుతోంది. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుపై అయితే 12 శాతం వరకు తగ్గింపు ఉంది. రూ. 2 వేల వరకు డిస్కౌంట్ సొంతం చేసుకోవచ్చు. డెబిట్ కార్డు, క్రెడిట్ కార్డులపై అదనంగా రూ. 3 వేల డిస్కౌంట్ ఆఫర్ కూడా ఉంది.
రూ.20 వేలకే ఐఫోన్ .. ఫ్లిప్‌కార్ట్ కిర్రాక్ ఆఫర్!
అంతేకాకుండా ఈ ఫోన్‌పై ఏకంగా రూ. 20,500 వరకు ఎక్స్చేంజ్ ఆఫర్ ఉంది. అంటే మీరు మీ పాత ఫోన్ ఇచ్చి రూ. 20,500 వరకు తగ్గింపు పొందొచ్చు. అయితే అన్ని ఫోన్లకు ఈ ఎక్స్చేంజ్ ఆఫర్ వర్తించదు. మీ ఫోన్ మోడల్, దాని కండీషన్ ప్రాతిపదికన ఎక్స్చేంజ్ ఆఫర్ ఆధారపడి ఉంటుంది. మీ పాత ఫోన్‌కు రూ. 20,500 ఎక్స్చేంజ్ ఆఫర్ వస్తే.. మీకు ఈ ఫోన్‌ను ఉచితంగా పొందినట్లు అవుతుంది. ఇకపోతే ఈ ఫోన్లో 120 వాట్ ఫాస్ట్ చార్జింగ్, 4500 ఎంఏహెచ్ బ్యాటరీ, 6.67 అంగుళాల స్క్రీన్, 108 ఎంపీ రియర్ కెమెరా, 16 ఎంపీ ఫ్రంట్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి. అదిరిపోయే ఫీచర్లు కలిగిన ఫోన్ కొనాలని భావించే వారు ఈ ఆఫర్‌ను పరిశీలించొచ్చు. మీ ఫోన్‌కు ఎంత ఎక్స్చేంజ్ విలువ ఉందో చెక్ చేసుకోండి. ఆఫర్ ఈ ఒక్క రోజే ఉంటుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Flipkart, Latest offers, Mobile offers, Xiaomi