Home /News /technology /

XIAOMI 11I 5G SMARTPHONE HIGH PRICE CUT IN FLIPKART END OF SEASON SALE HERE BANK AND EXCHANGE OFFERS DETAILS NS

Flipkart Best Offer: ఫ్లిప్ కార్ట్ లో సీజన్ ఎండ్ సేల్.. ఈ 24 వేల Xiaomi 5G ఫోన్ కేవలం రూ.8 వేలకే.. ఇలా కొనేయండి

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ ప్రస్తుతం ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (EOSS) నిర్వహిస్తోంది. ఈ సేల్ లో కస్టమర్లకు భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ ను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ సేల్ మీకు బెస్ట్ ఆప్షన్.

    ప్రముఖ ఈ కామర్స్ సంస్థ ఫ్లిప్ కార్ట్ (Flipkart) ప్రస్తుతం ఎండ్ ఆఫ్ సీజన్ సేల్ (EOSS) నిర్వహిస్తోంది. ఈ సేల్ లో కస్టమర్లకు భారీ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. మీరు కొత్తగా స్మార్ట్ ఫోన్ (Smartphone) ను కొనుగోలు చేయాలని భావిస్తే ఈ సేల్ ను సద్వినియోగం చేసుకోవచ్చు. ఈ సేల్ లో అన్ని రకాల స్మార్ట్ ఫోన్లపై భారీ డిస్కౌంట్ ఆఫర్లు అందుబాటులో ఉన్నాయి. ప్రముఖ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ షియోమీ (Xiaomi) కి చెందిన Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్ ను ఈ సేల్ లో చాలా తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి. ఈ ఫోన్ వాస్తవ ధర రూ.29,999. కాగా ఈ ఫోన్ పై ప్రస్తుతం 16 శాతం తగ్గింపు అందుబాటులో ఉంది. అంటే ఎవరైనా ఈ ఫోన్ ను రూ.5 వేల తగ్గింపుతో రూ.24,999కే కొనుగోలు చేయొచ్చు. ఇంకా అనేక బ్యాంక్ ఆఫర్లు సైతం ఈ ఫోన్ పై అందుబాటులో ఉన్నాయి. ముఖ్యంగా యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో షాపింగ్ చేయడం ద్వారా మీరు రూ.750 వరకు తగ్గింపు అందుకోవచ్చు.

    ఇంకా ఈ స్మార్ట్ ఫోన్ పై రూ.16,500 భారీ డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది. అంటే మీ పాత ఫోన్ ను ఎక్సేంజ్ చేసి ఈ ఫోన్ ను కొనుగోలు చేస్తే మీకు ఈ ఆఫర్ అప్లై అవుతుంది. మీ పాత ఫోన్ మోడల్, కండిషన్ పై మీకు లభించే డిస్కౌంట్ ఆధారపడి ఉంటుంది. మీ ఫోన్ మోడల్ కొత్తది అయి.. కండిషన్ బాగుంటే మీకు పూర్తి ఎక్సేంజ్ లభించే అవకాశం ఉంటుంది. మీకు ఈ ఎక్సేంజ్ ఆఫర్ పూర్తిగా లభిస్తే మీరు కేవలం 8,499 రూపాయలకే Xiaomi 11i 5G స్మార్ట్ ఫోన్ ను సొంతం చేసుకోవచ్చు.
    Flipkart EOSS Offers: ఫ్లిప్ కార్ట్ లో సీజన్ ఎండ్ సేల్.. ఈ 6000mAh స్మార్ట్‌ఫోన్‌ కేవలం రూ.7 వేలకే.. పూర్తి వివరాలివే.. ఓ లుక్కేయండి

    ఈ ఫోన్ స్పెసిఫికేషన్ల విషయానికి వస్తే.. ఈ ఫోన్ 6GB+128GB స్టోరేజ్ ను కలిగి ఉంటుంది. 5160 mAh భారీ బ్యాటరీ ఈ ఫోన్ సొంతం.108 MP మెయిన్ కెమెరా, 16 MP ఫ్రంట్ కెమెరా ఈ ఫోన్ సొంతం. ఇంకా 16.94 సె.మీ (6.67 ఇంచుల) Full HD+ AMOLED Display ఈ ఫోన్లో ఉంటుంది.
    Published by:Nikhil Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Flipkart, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు