Home /News /technology /

XIAOMI 11 LITE 5G NE SMARTPHONE LAUNCHED IN INDIA WITH QUALCOMM SNAPDRAGON 778G PROCESSOR KNOW PRICE AND SPECIFICATIONS SS

Xiaomi 11 Lite 5G NE: షావోమీ నుంచి మరో మొబైల్ రిలీజ్... తొలి సేల్‌లో రూ.3,500 డిస్కౌంట్

Xiaomi 11 Lite 5G NE: షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలివే
(image: Xiaomi India)

Xiaomi 11 Lite 5G NE: షావోమీ నుంచి మరో స్మార్ట్‌ఫోన్ రిలీజ్... ధర, స్పెసిఫికేషన్స్, ఆఫర్ వివరాలివే (image: Xiaomi India)

Xiaomi 11 Lite 5G NE | ఇండియన్ స్మార్ట్‌ఫోన్ మార్కెట్లోకి మరో 5జీ స్మార్ట్‌ఫోన్ (5G Smartphone) రిలీజ్ అయింది. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ (Xiaomi 11 Lite 5G NE) ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ తెలుసుకోండి.

    ఇండియాలో షావోమీ మరో స్మార్ట్‌ఫోన్‌ను లాంఛ్ చేసింది. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ పేరుతో కొత్త మోడల్‌ను పరిచయం చేసింది. షావోమీ 11టీ, షావోమీ 11టీ ప్రో మోడల్స్‌తో పాటు షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ (Xiaomi 11 Lite 5G NE) ఇటీవల గ్లోబల్ మార్కెట్‌లో రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఇక ఇండియాలో ఎంఐ 11 లైట్ (Mi 11 Lite) స్మార్ట్‌ఫోన్ ఇప్పటికే అందుబాటులో ఉంది. ఇప్పుడు షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ మోడల్‌ను షావోమీ రిలీజ్ చేసింది. షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్ 6జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.26,999 కాగా, 8జీబీ ర్యామ్ + 128జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.28,999. అక్టోబర్ 2న అర్ధరాత్రి 12 గంటలకు సేల్ ప్రారంభం కానుంది.

    దివాళీ డిస్కౌంట్


    షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌పై షావోమీ రూ.1,500 దివాళీ డిస్కౌంట్ ప్రకటించింది. ఈ డిస్కౌంట్‌తో 6జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.25,499 ధరకు, 8జీబీ+128జీబీ వేరియంట్‌ను రూ.27,499 ధరకు సొంతం చేసుకోవచ్చు. అక్టోబర్ 2 నుంచి 7 వరకు రెండు వేరియంట్లపై రూ.1,500 తగ్గింపు లభిస్తుంది. బ్యాంక్ ఆఫర్ ద్వారా మరో రూ.2,000 తగ్గుతుంది. అమెజాన్‌తో పాటు షావోమీ ఇండియా అధికారిక వెబ్‌సైట్, ఎంఐ హోమ్ స్టోర్స్, రీటైల్ స్టోర్లలో షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ కొనొచ్చు.

    Flipkart Big Billion Days Sale: ఫ్లిప్‌కార్ట్‌లో ముందే మొదలైన స్మార్ట్‌ఫోన్ సేల్... ఈ 15 మొబైల్స్‌పై డిస్కౌంట్


    అమొలెడ్ డిస్‌ప్లే


    షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్ స్పెసిఫికేషన్స్ చూస్తే 90Hz రిఫ్రెష్ రేట్‌తో 6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ సూపర్ అమొలెడ్ డిస్‌ప్లే ఉంది. క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఆండ్రాయిడ్ 11 + ఎంఐయూఐ 12.5 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది.

    Samsung Galaxy F42 5G: సాంసంగ్ గెలాక్సీ ఎఫ్42 5జీ స్మార్ట్‌ఫోన్ వచ్చేసింది... ధర రూ.20,000 లోపే

    కెమెరా ఫీచర్స్


    షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 64మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్ + 8మెగాపిక్సెల్ అల్‌ట్రా వైడ్ సెన్సార్ + 5 మెగాపిక్సెల్ టెలీమ్యాక్రో సెన్సార్లతో ట్రిపుల్ కెమెరా సెటప్ ఉంది. కెమెరాలో 50 డైరెక్టర్ మోడ్స్ ఉన్నాయని షావోమీ చెబుతోంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 20మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.

    బ్యాటరీ ఎంత?


    షావోమీ 11 లైట్ 5జీ ఎన్ఈ స్మార్ట్‌ఫోన్‌లో 4,250ఎంఏహెచ్ బ్యాటరీ ఉంది. 33వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ చేస్తుంది. ఫాస్ట్ ఛార్జర్ బాక్సులోనే ఉంటుంది. 12 5జీ బ్యాండ్స్ సపోర్ట్, 4జీ ఎల్‌టీఈ, వైఫై 6, యూఎస్‌బీ టైప్ సీ పోర్ట్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. ఈ స్మార్ట్‌ఫోన్‌ను టుస్కానీ కోరల్, వినైల్ బ్లాక్, జాజ్ బ్లూ, డైమండ్ డాజిల్ కలర్స్‌లో కొనొచ్చు.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: 5G Smartphone, Amazon Great Indian Festival Sale, Mobile News, Mobiles, Smartphone, Xiaomi

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు