ప్రముఖ మెసేజింగ్ యాప్ వాట్సాప్ (WhatsApp) సరికొత్త ఫీచర్లు తీసుకొస్తూ యూజర్ ఎక్స్‌పీరియన్స్ ఇంప్రూవ్ చేస్తోంది. అలానే ఆల్రెడీ ఉన్న ఫీచర్లలో మెరుగైన అప్‌డేట్స్ తీసుకొస్తోంది. అయితే తాజాగా వాట్సాప్ ‘Delete For Everyone’ ఫీచర్(Features)లో కొత్త అప్‌డేట్‌ను విడుదల చేసింది. దాంతో యూజర్లు రెండు రోజుల క్రితం పంపిన మెసేజ్‌లను కూడా డిలీట్ చేసుకోవడం సాధ్యమవుతుంది. ఇంతకుముందు గంట క్రితం పంపిన మెసేజ్‌లు మాత్రమే అందరికీ డిలీట్ చేయడం కుదరేది. ఈ టైమ్(Time) లిమిట్ ఇప్పుడు పెరిగింది.
ఈ విషయాన్ని వాట్సాప్ ఒక ట్వీట్(Tweet) ద్వారా వెల్లడించింది. ఇకనుంచి యూజర్లు ఒక వ్యక్తికి లేదా గ్రూప్ చాట్‌కు పంపిన మెసేజ్‌ను రెండు రోజుల తర్వాత కూడా "అన్‌సెండ్ (Unsend)" చేయవచ్చని పేర్కొంది. ఈ ఫీచర్‌ను ఇంకా పొందని వారు గూగుల్ ప్లేస్టోర్‌లో తమ యాప్‌ను అప్‌డేట్ చేసుకోవాల్సి ఉంటుంది.
వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీ వన్ టైమ్ లిమిట్‌ను బీటా టెస్టర్లకు కొన్ని వారాల క్రితమే తీసుకువచ్చింది. మొదటగా ఈ సమయాన్ని ఏడురోజుల వరకు పొడిగించాలని భావించింది కానీ దీనివల్ల ప్రైవసీకి భంగం వాటిల్లే అవకాశం ఉంటుందని రెండు రోజుల వరకు పొడిగించింది. అయితే కొంతమంది వాట్సాప్ యూజర్లు మెసేజ్ డిలీట్ చేశాక "థిస్ మెసేజ్ వజ్ డిలీటెడ్" అని పడే టెక్స్ట్‌ను కూడా తొలగించాలని డెవలపర్లను కోరుతున్నారు. అవతలి వ్యక్తికి పంపిన మెసేజ్ డిలీట్ చేసినట్టుగా తెలియకుండా ఒక అప్‌డేట్ తీసుకు రావాలి అంటున్నారు. వారి అభ్యర్థన మేరకు భవిష్యత్తులో వాట్సాప్ ఈ సదుపాయాన్ని కూడా తీసుకొచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే గతంలో యూజర్లు సూచించిన చాలా ఫీచర్లను వాట్సాప్ పరిచయం చేసింది.
కొత్త అప్‌డేట్‌తో వాట్సాప్ ఇన్‌స్టంట్ మెసేజింగ్ యాప్ ఐమెసేజ్ (Apple iMessage) కంటే ఇప్పుడు మరింత మెరుగ్గా మారిందని చెప్పవచ్చు. యాపిల్ ప్రస్తుతం ఈ ఫీచర్‌లో రెండు నిమిషాలు టైమ్ లిమిట్ మాత్రమే తన యూజర్లకు అందిస్తోంది. అంటే పంపిన రెండు నిమిషాల్లో అందరికీ డిలీట్ చేసుకోవాల్సి ఉంటుంది. కొత్త iPhone, iPad, Mac ఆపరేటింగ్ సిస్టమ్‌లు విడుదలయ్యే వరకు ఎక్కువ టైమ్ లిమిట్‌ను ఐమెసేజ్ అందుబాటులోకి తీసుకు రాకపోవచ్చు. వాట్సాప్ యూజర్లు మాత్రం తాము పంపిన మెసేజ్‌ను డిలీట్ చేయడం మర్చిపోయినా ఒకరోజు తర్వాత లేదా రెండు రోజుల తర్వాత అయినా డిలీట్ చేసుకోవచ్చు. ఇది చాలా మందికి ఉపయోగకరంగా ఉంటుందని చెప్పొచ్చు. దీనివల్ల ప్రైవసీ అనేది చాలా పెరుగుతుంది.
యూజర్లు తమ ఆన్‌లైన్ స్టేటస్‌ను కాంటాక్ట్‌ల నుంచి దాచడం, యూజర్లందరికీ తెలియజేయకుండా గ్రూప్ నుంచి లెఫ్ట్ కావడం, వ్యూ వన్స్ మెసేజ్‌ల్లో పంపిన ఫొటోలు స్క్రీన్‌షాట్‌లను తీసుకోకుండా ఆపేయడం వంటి వివిధ ప్రైవసీ ఫీచర్లను వాట్సాప్ తీసుకువస్తుందని వాట్సాప్ హెడ్ విల్ క్యాత్‌కార్ట్ ఇటీవల ట్వీట్ చేశారు. వాట్సాప్ బీటా ఇన్ఫో ప్రకారం, ఈ మెసేజింగ్ యాప్ గ్రూప్స్‌లో చాలా ఫీచర్లను తీసుకొస్తోంది. గ్రూప్‌లో అప్రూవల్ న్యూ పార్టిసిపెంట్స్ అనే కొత్త ఫీచర్ తీసుకొస్తున్నట్లు తాజాగా WABetaInfo వెల్లడించింది. ఈ ఫీచర్ అందుబాటులోకి వస్తే అడ్మిన్స్ గ్రూప్‌లో జాయిన్ అయ్యేందుకు ఎవరిని అప్రూవ్ చేయాలి? ఎవరిని అప్రూవ్ చేయకూడదనేది నిర్ణయించడం సాధ్యమవుతుంది.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Apple iphone, New features, Tech news, Whatsapp