హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Car Conversion: వావ్ .. వాట్ ఏ న్యూస్ .. మీ పెట్రోల్ కార్ ను ఇలా సులభంగా సీఎన్ జీ కార్ లాగా మార్చుకోవచ్చు !

Car Conversion: వావ్ .. వాట్ ఏ న్యూస్ .. మీ పెట్రోల్ కార్ ను ఇలా సులభంగా సీఎన్ జీ కార్ లాగా మార్చుకోవచ్చు !

 వావ్ .. వాట్ ఏ న్యూస్ .. మీ పెట్రోల్ కార్ ను ఇలా సులభంగా సీఎన్ జీ కార్ లాగా మార్చుకోవచ్చు !

వావ్ .. వాట్ ఏ న్యూస్ .. మీ పెట్రోల్ కార్ ను ఇలా సులభంగా సీఎన్ జీ కార్ లాగా మార్చుకోవచ్చు !

మీరు ఇప్పటికే పెట్రోల్(Petrol) కారును కొనుగోలు చేసి ఉండి, దాన్ని CNGలోకి మార్చాలనుకుంటే.. CNG కిట్‌లను ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. అనేక కంపెనీలు ఆటోమోటివ్ ఆఫ్టర్ మార్కెట్‌(Mraket)లో ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం CNG కిట్‌లను తయారు చేస్తున్నాయి. వీటి సాయంతో మీ పెట్రోల్ కారును సులభంగా cng కార్ గా మార్చుకోవచ్చు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

ప్రస్తుతం భారత్‌(India)తో పాటు ప్రపంచ వ్యాప్తంగా ఫ్యూయల్ కాస్ట్ పెరుగుతోంది. పెట్రోల్(Petrol) ధర లీటరుకు రూ.100 దాటింది. దీంతో పెట్రోల్ కారు కొన్నవారు వాటిని బయటకు తీసేందుకు వెనుకాడుతున్నారు. ఇదే సమయంలో తక్కువ ధరతో ప్రయాణించే మార్గాలను అన్వేషిస్తున్నారు. ఈ క్రమంలో చాలామంది సీఎన్ జీ (CNG) వాహనాలకు మారుతున్నారు. దీంతో CNG వాహనాలకు డిమాండ్‌ పెరుగుతోంది. ఫలితంగా కార్ల తయారీ కంపెనీలు ఇప్పుడు CNG కిట్‌లతో కూడిన CNG కార్లను పరిచయం చేస్తున్నాయి. అయితే మీరు ఇప్పటికే పెట్రోల్ కారును కొనుగోలు చేసి ఉండి, దాన్ని CNGలోకి మార్చాలనుకుంటే.. CNG కిట్‌లను ఇన్‌స్టాల్ చేస్తే సరిపోతుంది. అనేక కంపెనీలు ఆటోమోటివ్ ఆఫ్టర్ మార్కెట్‌(Market)లో ప్రభుత్వ ప్రమాణాల ప్రకారం CNG కిట్‌లను తయారు చేస్తున్నాయి. వీటి సాయంతో మీ పెట్రోల్ కారు(Car)ను సులభంగా CNG కారుగా మార్చుకోవచ్చు.

పెట్రోల్ కారును CNGలోకి మార్చడం వల్ల అనేక రకాల ప్రయోజనాలు పొందవచ్చు. వీటితో ఆపరేటింగ్ కాస్ట్ చాలా వరకు తగ్గుతుంది. వాహన ఉద్గారాలు కూడా భారీగా తగ్గుతాయి. ఇది వాహనం పెట్రోల్, CNG రెండింటితోనూ నడిచేలా సెటప్‌ను అందిస్తుంది. అయితే ఈ కన్వర్షన్‌తో కొన్ని సవాళ్లు కూడా ఉన్నాయి. CNG రీఫ్యూయలింగ్ స్టేషన్లు ఎక్కువగా లేకపోవడం, వాహనాల బరువు పెరగడం, బూట్ స్టోరేజ్ వద్ద స్పేస్ మొత్తం సీఎన్‌జీ కిట్ ఆక్రమించుకోవడం.. వంటివి ఉన్నాయి. అలాగే CNGని ఉపయోగించడం వల్ల దీర్ఘకాలంలో ఇంజిన్‌పై ప్రభావం చూపవచ్చు. ఫలితంగా లాంగ్ టర్మ్‌లో నిర్వహణ ఖర్చు కూడా పెరగవచ్చు.

పెట్రోల్ కారును CNGలోకి ఎలా మార్చుకోవాలి..?

రిసెర్చ్

వాహనం CNG ఫ్యూయల్‌కు కంపాటబుల్‌గా ఉందో లేదో చెక్ చేయాలి. సాధారణంగా పాత కార్లు CNG కిట్‌లకు కంపాటబుల్‌గా ఉండవు. అయితే కొత్త మోడల్‌లు ఈ క్లీన్ అండ్ గ్రీన్ ఫ్యూయల్ కిట్‌కు సపోర్ట్ చేస్తాయి. అలాగే మార్కెట్‌లో గవర్నమెంట్ ఆథరైజ్డ్ CNG ఫ్యూయల్ కిట్‌ను మాత్రమే కొనుగోలు చేయండి. ఇవి భద్రతా నిబంధనలకు అనుగుణంగా ఉంటాయి. వెహికల్ ఇన్సూరెన్స్‌పై అది ఎలా ప్రభావం చూపుతుందో ఆరా తీయండి.

ఇదీ చదవండి: Airlines Fares: విమాన ప్రయాణికులకు గుడ్ న్యూస్.. తగ్గనున్న ఫ్లయిట్ చార్జీలు.. ఎప్పటినుంచంటే !


 లైసెన్సింగ్

కారు CNG ఫ్యూయల్‌కు కంపాటబుల్‌గా ఉంటే, CNG కన్వర్షన్ కోసం యజమాని ప్రభుత్వం నుంచి అనుమతి పొందాల్సి ఉంటుంది. రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లో ఇంధన రకాన్ని మార్చాలి. ఈ ప్రక్రియకు కొంత సమయం పట్టవచ్చు.


CNG కిట్‌ను కొనుగోలు చేయడం

గవర్నమెంట్ ఆథరైజ్డ్ డీలర్ నుంచి బ్రాండెడ్ CNG కిట్‌ను కొనుగోలు చేయండి. అలాగే మీరు కొనుగోలు చేస్తున్న CNG కిట్ జెన్యూన్ సెటప్ అని నిర్ధారించుకోండి. CNG కిట్‌ కోసం ఎక్కువ డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది.

ఇన్‌స్టలేషన్

CNG కిట్‌ని కొనుగోలు చేసిన తర్వాత, శిక్షణ పొందిన నిపుణులతో దాన్ని ఇన్‌స్టాల్ చేయించండి. సొంతంగా ఈ పని చేయడానికి ప్రయత్నించవద్దు, ఎందుకంటే ఈ ప్రక్రియలో ఏదైనా సమస్య తలెత్తితే, అది వాహనం భద్రతతో పాటు మెకానికల్ మాడ్యులేషన్‌ను దెబ్బతీస్తుంది.

First published:

Tags: Automobiles, CNG, Insurance, Petrol

ఉత్తమ కథలు