Home /News /technology /

WOW WHAT A NEWS THERE ARE TWO TYPES OF CHARGERS FOR ALL DEVICES YOU KNOW HOW HAPPY YOU ARE IF YOU READ IT UMG GH

Common Chargers: వావ్ వాట్ ఏ న్యూస్! ఇక అన్నీ డివైజ్‌లకు ఆ రెండు రకాల చార్జర్లు.. చదివితే ఎంత హ్యాపీయో తెలుసా !

 వావ్ వాట్ ఏ న్యూస్! ఇక అన్నీ డివైస్ లకు .. రెండు రకాల చార్జర్లు.. చదివితే ఎంత హ్యాపీయో తెలుసా !

వావ్ వాట్ ఏ న్యూస్! ఇక అన్నీ డివైస్ లకు .. రెండు రకాల చార్జర్లు.. చదివితే ఎంత హ్యాపీయో తెలుసా !

అన్ని ఎలక్ట్రానిక్(Electronic) డివైజ్‌లలో కేవలం రెండు రకాల ఛార్జింగ్(Charging) పోర్ట్‌లను మాత్రమే అందించే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు పదుల కొద్దీ ఛార్జర్లు వాడాల్సిన పని ఉండదు.

ఇంకా చదవండి ...
  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India
అన్ని ఎలక్ట్రానిక్(Electronic) డివైజ్‌లలో కేవలం రెండు రకాల ఛార్జింగ్(Charging) పోర్ట్‌లను మాత్రమే అందించే మార్గాలను కేంద్రం అన్వేషిస్తోంది. ఈ ఆలోచన కార్యరూపం దాలిస్తే అన్ని ఎలక్ట్రానిక్ డివైజ్‌లకు పదుల కొద్దీ ఛార్జర్లు వాడాల్సిన పని ఉండదు. వివరాల్లోకి వెళ్తే.. ప్రస్తుతం యూజర్లు తమ ఫోన్లు, టాబ్లెట్‌లు, ఇయర్‌బడ్స్‌, స్పీకర్లు, ల్యాప్‌టాప్‌ల కోసం ప్రత్యేకంగా ఛార్జర్లను వాడాల్సి వస్తోంది. అయితే ఒక్కో ఎలక్ట్రానిక్ డివైజ్‌ కోసం ఒక్కో ఛార్జర్ కొనుగోలు చేయడం ఆర్థికంగా భారంగా మారుతోంది. అలాగే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు (Electronic Wastage) పెరుగుతున్నాయి. అయితే ఈ సమస్యలకు పరిష్కారం చూపాలని ప్రభుత్వం (Indian Government) యోచిస్తోంది.

కొత్త మార్గదర్శకాలు అమల్లోకి వస్తే.. యూజర్లు ఛార్జర్ల కోసం ప్రత్యేకంగా డబ్బు వెచ్చించాల్సిన అవసరం రాదు కాబట్టి వారికి చాలా డబ్బు ఆదా అవుతుంది. అలానే పర్యావరణానికి హానిచేసే ఎలక్ట్రానిక్ వ్యర్థాలు గణనీయంగా తగ్గుతాయి. రకరకాల ఛార్జర్లను మెయింటైన్ చేయాల్సిన అవసరం రాదు.

ఈ విషయమై సమావేశం కోసం వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆగస్టు 17న అన్ని ప్రధాన పరిశ్రమ సంఘాలు, సంస్థలకు పిలుపునిచ్చింది. ఈ సమావేశంలో ప్రతీ డివైజ్‌కు ప్రత్యేకంగా ఛార్జర్ అవసరం లేకుండా అన్నిటికీ కేవలం రెండు ఛార్జర్లు మాత్రమే తీసుకురావడం సాధ్యం అవుతుందా? కాదా? అనే అంశంపై చర్చించనున్నారు.

గత వారం వినియోగదారుల వ్యవహారాల కార్యదర్శి రోహిత్ కుమార్ సింగ్ ఇండస్ట్రీ వర్గాలకు రాసిన ఒక లేఖలో ఛార్జింగ్ పోర్ట్స్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు. రెండు ఛార్జింగ్ పిన్స్/పాయింట్స్/ఛార్జర్లు మాత్రమే అన్ని ఎలక్ట్రానిక్ పరికరాలకు సెట్ అయ్యేలా రెండు రకాలైన ఛార్జింగ్ పోర్ట్స్స్‌ తీసుకొచ్చే సమయం ఆసన్నమైందని రోహిత్ కుమార్ లేఖలో పేర్కొన్నారు. స్మార్ట్‌ఫోన్స్, ల్యాప్‌టాప్‌లు, ట్యాబ్లెట్స్, ఇయర్‌బడ్స్‌ వంటి చిన్న, మీడియం సైజు డివైజ్‌ల కోసం ఒక రకం ఛార్జింగ్ పోర్ట్‌... ఫీచర్ ఫోన్స్ వంటి వాటి కోసం మరొక రకం ఛార్జింగ్ పోర్ట్‌ తీసుకొస్తే ఎక్కువ ఛార్జర్లు కొనుగోలు చేయాల్సిన అవసరం రాదన్నారు. ప్రతి ఇంట్లో ఈ రెండు రకాల ఛార్జర్లు ఉంటే సరిపోతుందని పేర్కొన్నారు.

ఇదీ చదవండి: Tallest Flag Pole: దేశంలోనే ఎత్తైన జెండా .. ఎక్కడో తెలుసా ! దీని ప్రత్యేకతలు చదివితే సెల్యూట్ చేస్తారు..!



వినియోగ ఎలక్ట్రానిక్ పరికరాలకు "సింగిల్ ఛార్జింగ్ డివైజ్ మ్యాండేట్ (Single Charging Device Mandate)" అవసరాన్ని రాజ్యసభలో లేవనెత్తారు బీజేపీ నేత సుశీల్ కుమార్ మోదీ. 2024 నాటికి ఐరోపా సంఘం (EU) 27 యూరోపియన్ దేశాల్లో మొబైల్ ఫోన్లు, టాబ్లెట్‌లు, ల్యాప్‌టాప్‌లు.. కెమెరాల వంటి చిన్న, మీడియం సైజు పరికరాలకు USB టైప్-సీ కామన్ ఛార్జింగ్ పోర్ట్‌ను తీసుకురావాలనే ఒక ఒప్పందానికి అంగీకరించాయి.



ఈ విషయమై యూరోపియన్ పార్లమెంట్ ఇటీవల ఒక బహిరంగ ప్రకటన కూడా చేసింది. ఈ ప్రకటనను సుశీల్ కుమార్ మోదీ రాజ్యసభలో ప్రస్తావించారు. కొనుగోలు చేసే ప్రతి ఎలక్ట్రానిక్ వస్తువులతో వచ్చే ఛార్జర్లు పెరిగిపోవడం వల్ల అనేక సమస్యలు ఎదురవుతున్నాయని చెప్పుకొచ్చారు. అన్నిటికీ రెండు ఛార్జర్లే ఉపయోగించేలా ఛార్జింగ్ పోర్టులను అందించడం అత్యవసరమన్నారు. ప్రభుత్వ అంచనాల ప్రకారం, 2019, 2020 ఆర్థిక సంవత్సరాల మధ్య ఎలక్ట్రానిక్ వ్యర్థాల ఉత్పత్తి 32% పెరిగింది. అంతేకాకుండా, 25% కంటే తక్కువ వ్యర్థాలు క్రమపద్ధతిలో పెరిగిపోతున్నాయని మోదీ చెప్పారు.
Published by:Mahesh
First published:

Tags: Charger, Electronics, Smartphones, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు