Home /News /technology /

WOW ONE PLUS LAUNCHED SMART TV WITH 5G TECHNOLOGY AFFORDABLE PRICE IF YOU SEE THE FEATURES YOU WILL BUY IT UMG GH

OnePlus 10T 5G: వావ్.. వన్‌ప్లస్ 5జీ స్మార్ట్ టీవీ.. ఒక్కసారి ఈ ధర, ఫీచర్స్ చూస్తే వెంటనే కొనేస్తారంతే..!

5జీ టెక్నాలజీతో స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన ఒన్ ప్లస్.. అందుబాటు ధర.. ఫీచర్స్ చూశారంటే కొనేస్తారు.. !

5జీ టెక్నాలజీతో స్మార్ట్ టీవీ లాంచ్ చేసిన ఒన్ ప్లస్.. అందుబాటు ధర.. ఫీచర్స్ చూశారంటే కొనేస్తారు.. !

ఒన్‌ప్లస్ నుంచి తర్వలో లాంచ్‌ కానున్న కొత్త ఫోన్‌ గురించి ఇంటర్నెట్‌(Internet)లో కొంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ(OnePlus 10T 5G) త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ కానుంది. ఈ సస్పెక్ట్‌ డివైజ్‌ను భారతదేశ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు 3C సర్టిఫికేషన్ సైట్‌లో టిప్‌స్టర్ ముకుల్ శర్మ కనుగొన్నారు.

ఇంకా చదవండి ...
ఒన్‌ప్లస్ (OnePlus)నుంచి తర్వలో లాంచ్‌ కానున్న కొత్త ఫోన్‌(Phone) గురించి ఇంటర్నెట్‌లో కొంత సమాచారం అందుబాటులోకి వచ్చింది. ధర, స్సెసిఫికేషన్‌ల గురించి ఓ వెబ్‌సైట్‌లో పేర్కొన్నారు. ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ(OnePlus 10T 5G) త్వరలో ఇండియన్‌ మార్కెట్‌లోకి లాంచ్‌ కానుంది. ఈ సస్పెక్ట్‌ డివైజ్‌ను భారతదేశ అధికారిక వెబ్‌సైట్‌తో పాటు 3C సర్టిఫికేషన్ సైట్‌లో టిప్‌స్టర్ ముకుల్ శర్మ కనుగొన్నారు. ఆయన ఫోన్ స్పెసిఫికేషన్‌లను కూడా వెల్లడించారు. ముఖ్యంగా ఇంకా స్మార్ట్‌ఫోన్ అధికారిక లాంచ్ తేదీని ప్రకటించలేదు. అయితే ఇది జులైలో అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది.

3C సర్టిఫికేషన్ వెబ్‌సైట్‌లో ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ ఫోన్‌ వివరాలు కనిపించాయి. డివైజ్‌ త్వరలో విడుదల అవుతుందని సమాచారం. హ్యాండ్‌సెట్ 160W ఫాస్ట్ ఛార్జింగ్‌ అవుట్‌ ఆఫ్‌ ది బాక్స్‌ ఎనేబుల్‌ చేస్తుందని వెబ్‌సైట్‌ పేర్కొంటోంది.
ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ 6.7-అంగుళాల ఫుల్‌HD+ డిస్‌ప్లే(Dispaly)ను అందిస్తుంది. దీని కోసం కంపెనీ 120Hz రిఫ్రెష్ రేట్‌తో AMOLED డిస్‌ప్లేను ఉపయోగిస్తుంది. రైట్‌ కార్నర్‌లో డిస్టింక్టివ్‌ అలర్ట్‌ స్లైడర్ కూడా స్మార్ట్‌ఫోన్‌లో ఉంటుందని భావిస్తున్నారు. స్నాప్‌డ్రాగన్ 8+ Gen 1 చిప్‌సెట్ అందిస్తున్నట్లు సమాచారం.

ఇదీ చదవండి:  Sexual Health: శృంగారం కోసం ఈ మందులు వాడుతున్నారా ? అంతే సంగతులు .. ఎలాంటి నష్టాలు ఉంటాయంటే..?

కెమెరా పరంగా, ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్(OIS)తో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ లెన్స్‌ని అందించవచ్చు. 32-మెగాపిక్సెల్ ఫ్రంట్ ఫేసింగ్ కెమెరా కూడా ఉంటుంది. కెమెరా సాఫ్ట్‌వేర్‌లో హాసెల్‌బ్లాడ్ మాస్టర్ స్టైల్ ఉంటుంది, ఇది కెమెరా సిస్టమ్ కోసం మూడు ప్రీసెట్‌లలో ఒకదాన్ని ఎంచుకోవడానికి వినియోగదారులను అవకాశం కల్పిస్తుంది.
ఒన్‌ప్లస్‌ స్మార్ట్‌ఫోన్‌లో 80W ఫాస్ట్ ఛార్జింగ్‌ను సపోర్ట్‌ చేసే 4,800mAh బ్యాటరీ కూడా ఉండే అవకాశం ఉంది.  అంతర్గత సమాచారం ప్రకారం.. ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ భారతదేశంలో జులై 25, ఆగస్టు 1 మధ్య అందుబాటులోకి వచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. ఇది మూన్‌స్టోన్ బ్లాక్‌లో అందుబాటులో ఉంటుందని అంచనా. దీని ధర 799 యూరోలు(సుమారు రూ.65,300) ఉండవచ్చు. ఒన్‌ప్లస్‌ 10టీ 5జీ డివైజ్‌ 8GB RAM, 128GB ఇంటర్నల్‌ స్టోరేజ్‌ అందిస్తుంది.



మిడ్‌ రేంజ్‌లో వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ బెస్ట్‌
వన్‌ప్లస్‌ నోర్డ్‌ 2టీ ఫోన్‌ 90Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.43-అంగుళాల AMOLED డిస్‌ప్లే అందిస్తుంది. కొత్త MediaTek డైమెన్సిటీ 1300 చిప్‌సెట్, గరిష్టంగా 12GB RAM, 256GB ఇంటర్నల్ స్టోరేజ్‌ ఫీచర్‌లతో వస్తుంది. ఈ ఫోన్‌ 80W ఫాస్ట్ ఛార్జింగ్‌కు సపోర్ట్‌ చేసే 4,500mAh బ్యాటరీని అందిస్తుంది. ఇది OISతో 50-మెగాపిక్సెల్ ప్రైమరీ సెన్సార్, 8-మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ సెన్సార్, 2-మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్‌తో ట్రిపుల్‌ రియర్‌ కెమెరా సెటప్‌ను అందిస్తుంది. ఫోన్ ముందు భాగంలో సెల్ఫీలు, వీడియో రికార్డింగ్ కోసం 32-మెగాపిక్సెల్ షూటర్ ఉంది.
Published by:Mahesh
First published:

Tags: New features, ONE PLUS, Smart tvs, Tech news

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు