హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

iPhone 11: ఈ ఆఫర్‌లో ఈజీగా ఐఫోన్ కొనేస్తారు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. ఒక్కసారి చూడండీ..!

iPhone 11: ఈ ఆఫర్‌లో ఈజీగా ఐఫోన్ కొనేస్తారు.. ఫ్లిప్‌కార్ట్‌లో భారీ డిస్కౌంట్.. ఒక్కసారి చూడండీ..!

 వావ్.. కొంటే ఐ ఫోనే కొనాలి.. ఫ్లిప్‌కార్ట్  లో భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేస్తారు !

వావ్.. కొంటే ఐ ఫోనే కొనాలి.. ఫ్లిప్‌కార్ట్ లో భారీ డిస్కౌంట్.. వెంటనే కొనేస్తారు !

బిగ్ సేవింగ్(Savings) డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ టాప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్(iPhone) డివైజ్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. తాజా సేల్‌లో యాపిల్ ఐఫోన్‌ 11ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌పై ఉన్న ఆఫర్లు ఏవో చూద్?

ఇంకా చదవండి ...

ఇండియన్ ఈ-కామర్స్(Ecommerce) పోర్టళ్లు మరోసారి డిస్కౌంట్(Discount) సేల్స్‌తో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. ఫ్లిప్‌కార్ట్(Flip kart) ఈరోజు నుంచి బిగ్ సేవింగ్ డేస్ సేల్‌ను నిర్వహిస్తోంది. ప్లస్ మెంబర్స్‌కు నిన్న ఆఫర్లు స్టార్ట్ అవ్వగా.. జులై 23 నుంచి అందరికీ సేల్ ప్రారంభమైంది. బిగ్ సేవింగ్ డేస్ సేల్ సందర్భంగా ఫ్లిప్‌కార్ట్ టాప్ స్మార్ట్‌ఫోన్లపై భారీ డిస్కౌంట్ అందిస్తోంది. ముఖ్యంగా యాపిల్ డివైజ్‌లపై కళ్లు చెదిరే ఆఫర్లు ఉన్నాయి. తాజా సేల్‌లో యాపిల్ ఐఫోన్‌ 11ను అతి తక్కువ ధరకే సొంతం చేసుకోవచ్చు. ఈ హ్యాండ్‌సెట్‌పై ఉన్న ఆఫర్లు ఏవో చూద్దాం.

ఐఫోన్(iPhone) మోడళ్లపై ఫ్లిప్‌కార్ట్ అందిస్తున్న బెస్ట్ డీల్స్‌లో ఐఫోన్ 11 ఒకటి. ఐఫోన్ 11లో 64GB బ్లాక్ వేరియంట్ రూ. 2,000 బ్యాంక్ డిస్కౌంట్‌తో కలిపి రూ. 39,999 కంటే తక్కువ ధరకే లభిస్తుంది. ఫ్లిప్‌కార్ట్ ఐఫోన్ 11 మోడల్‌ను రూ. 42,999కి లిస్ట్ చేసింది. RBL బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్, సిటీ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్.. కోటక్ బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డ్ ఉన్న కస్టమర్‌లు అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అన్ని ఆఫర్‌లు కలిపి ఐఫోన్ 11, 64GB స్టోరేజ్ వేరియంట్ ధర రూ. 40,000 లేదా రూ. 39,999 వరకు తగ్గుతుంది. బ్యాంక్ డిస్కౌంట్లతో పాటు ఐఫోన్ 11పై ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ను కూడా అందిస్తోంది ఫ్లిప్‌కార్ట్. దీనిపై ఏకంగా రూ. 17,000 వరకు ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఉంది. దీన్ని యూజ్ చేసుకుంటే ఐఫోన్ 11 ధర మరింత తగ్గుతుంది. అయితే మీ పాత ఫోన్ ఎక్స్చేంజ్ వాల్యూ అనేది దాని వర్కింగ్ కండిషన్, మోడల్‌పై ఆధారపడి ఉంటుంది.

అయితే ఈ ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ ఐఫోన్ 11లోని 64GB, బ్లాక్ మోడల్‌కు మాత్రమే అందుబాటులో ఉంటుంది. ఇతర కలర్ ఆప్షన్లలో లభించే ఐఫోన్ 11, 64GB స్టోరేజ్‌ వేరియంట్ ధరలు రూ. 46,999కి లిస్ట్ అయ్యి ఉన్నాయి. ఐఫోన్ 11, 128GB ధర రూ. 51,999గా ఉంది. వీటిపై కూడా బ్యాంక్ ఆఫర్‌లు అందుబాటులో ఉన్నాయి.

ఇదీ చదవండి: china-India tension: మిసైల్ పరీక్ష తో మరో కుట్రకు తెరలేపిన డ్రాగన్.. రాఫెల్ తో భారత్ దిమ్మతిరిగే సమాధానం..ఐఫోన్ 12పై కూడా..

ఫ్లిప్‌కార్ట్ తాజా సేల్‌లో ఐఫోన్ 12పై కూడా ఆఫర్లు, డిస్కౌంట్లు అందిస్తోంది. కస్టమర్లు బ్యాంక్ ఆఫర్‌తో ఐఫోన్ 12ను రూ. 51,999కే కొనుగోలు చేయవచ్చు. ఐఫోన్ 12ను ఈ పోర్టల్ రూ. 52,999కి లిస్ట్ చేయగా, దీనిపై బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ ఆఫర్లు కూడా అందుబాటులో ఉన్నాయి. పాత ఫోన్‌ని మార్చుకోవాలనుకుంటే, ఎక్స్ఛేంజ్ ఆఫర్‌ మీకు బెస్ట్ ఆప్షన్‌గా చెప్పవచ్చు. అయితే ఎక్స్ఛేంజ్ వ్యాల్యూ మీ పాత ఫోన్ వర్కింగ్ కండిషన్‌పై ఆధారపడి ఉంటుంది.

ఆఫర్లు ఎప్పటి వరకు ఉంటాయి?

ఫ్లిప్‌కార్ట్ బిగ్ సేవింగ్ డేస్ సేల్స్ జులై 23 నుంచి లైవ్‌లోకి వచ్చింది. జులై 27 వరకు స్పెషల్ సేల్ కొనసాగుతుంది.

First published:

Tags: Apple iphone, Budget smart phone, Flipkart, Tech news

ఉత్తమ కథలు