Phone hacking: మీ ఫోన్ హ్యాక్ అయిందా.. ఎలా తెలుసుకోవాలి.. ఏం చేయాలి.. వివరాలను తెలుసుకోండి..

ప్రతీకాత్మక చిత్రం

స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిని ఎప్పుడూ వెంటాడే భయం.. హ్యాకింగ్. మ‌న ప్ర‌మేయం లేకుండానే మ‌న ఫోన్‌లోని డేటాను దొంగతనంగా సేకరించే మార్గాలను హ్యాకర్లు కనుగొంటున్నారు. అంతేకాదు.. దీని ద్వారా మ‌న‌కు తెలియ‌కుండానే ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ కూడా ఆన్ అయిపోతాయి. అయితే దీని గురించి పూర్తి వివరాలు ఇక్కడ తెలుసుకుందాం..

  • Share this:
స్మార్ట్‌ఫోన్ వాడుతున్న వారిని ఎప్పుడూ వెంటాడే భయం.. హ్యాకింగ్. మ‌న ప్ర‌మేయం లేకుండానే మ‌న ఫోన్‌లోని డేటాను దొంగతనంగా సేకరించే మార్గాలను హ్యాకర్లు కనుగొంటున్నారు. అంతేకాదు.. దీని ద్వారా మ‌న‌కు తెలియ‌కుండానే ఫోన్ కెమెరా, మైక్రోఫోన్ కూడా ఆన్ అయిపోతాయి. కేవ‌లం ఒకే ఒక మిస్డ్ వీడియో కాల్ ద్వారా కూడా ప్రమాదకరమైన పెగాస‌స్ వంటి స్పైవేర్ టూల్స్‌ను మ‌న ఫోన్‌లో ఇన్‌స్టాల్ చేయ‌వచ్చు. దేశంలోని ఎంతోమంది ప్ర‌ముఖులు దీని బారిన‌ప‌డినట్లు కథనాలు వెలువడుతున్నాయి. పార్ల‌మెంటును ఈ ఉదంతం కుదిపేస్తోంది. ఇందులో ప్ర‌తిప‌క్ష‌, అధికార‌ ప‌క్షమ‌నే తేడా లేకుండా చాలామంది పెగాస‌స్‌ బాధితులుగా మారారు. పెగాస‌స్ వంటి స్పైవేర్ టూల్స్ యూజర్‌కు తెలియకుండానే ఫోన్‌లో ఇన్‌స్టాల్ అయిపోతాయి. ఒకసారి ఇన్‌స్టాల్ అయ్యాక ఫోన్‌కు సంబంధించిన డేటానంతా ఎటాకర్‌కు పంపించడం మొదలుపెడతాయి. వ్యక్తిగత డేటాతో పాటు పాస్‌వర్డ్స్, కాంటాక్ట్‌ లిస్ట్, క్యాలెండర్ ఈవెంట్స్‌, ఈమెయిల్స్‌తో పాటు లైవ్ వాయిస్ కాల్స్‌ను కూడా ఇవి ట్రాక్ చేయగలవు. పైగా యూజ‌ర్‌కు అనుమానం రాకుండా త‌క్కువ‌డేటాను, మెమ‌రీని, బ్యాట‌రీనీ ఈ టూల్ వినియోగిస్తాయంటే.. వీటిని ఎంత ప‌క‌డ్బందీగా రూపొందించారో అర్థం చేసుకోవ‌చ్చు.

మ‌న ఫోన్‌లోకి ఎలా వ‌స్తుంది?
ఈ స్పైవేర్ వాట్సాప్ మెస్సేజ్‌లు, ఎస్‌ఎంఎస్‌లు, ఈమెయిల్స్ ద్వారా ఫోన్లలో చొర‌బ‌డుతుంది. లేదంటే ఓ మిస్డ్ కాల్ కూడా దీన్ని మ‌న ఫోన్‌లోకి మోసుకొస్తుంది. అంత‌గా భ‌ద్ర‌తా ప్ర‌మాణాలు పాటించ‌ని యాప్‌లు కూడా పెగాస‌స్‌ మ‌న ఫోన్‌లోకి చొర‌బ‌డేందుకు దారి ఇస్తాయి. ఇలాంటి గూఢ‌చ‌ర్యం కేవ‌లం ఇండియాలోనే కాదు ప్ర‌పంచ‌మంత‌టా ఉంది. అంతెందుకు ప్ర‌పంచ కుబేరుడు జెఫ్ బెజోస్ కూడా దీనికి అతీతుడు కాదని వార్తలు వస్తున్నాయంటే.. ఈ మాల్‌వేర్ ఎంత‌టి ప్ర‌మాద‌కరమో తెలుసుకోవచ్చు.

మన ఫోన్‌ హ్యాక్ అయితే ఎలా తెలుసుకోవాలి?
స్మార్ట్‌ఫోన్‌ను ఆప‌రేటింగ్ సిస్ట‌మ్‌ను ఎప్ప‌టిక‌ప్పుడు అప్‌డేట్ చేసుకోవాలి. దీని వ‌ల్ల మ‌న ఫోన్‌పై జ‌రిగే ఎటాక్‌ల‌ను 90శాతం నిరోధించ‌వ‌చ్చు. స్పైవేర్ టూల్ మ‌న ఫోన్‌లోకి వ‌చ్చాక కూడా.. ఫోన్ సాధార‌ణంగానే ప‌నిచేస్తుంటుంది. అయితే ఇవి స్మార్ట్‌ఫోన్‌లో చొర‌బ‌డిన విష‌యాన్ని నిర్ధారించేందుకు ఫోరెన్సిక్ ప‌రీక్ష చేయాల్సి ఉంటుంది. పెగాస‌స్, ఇతర సాఫ్ట్‌వేర్‌లు ఏ యాప్ ద్వారా మన ఫోన్‌లలో చొర‌బ‌డ్డాయనే విష‌యాన్ని ఇందులో ప‌రిశీలిస్తారు. స్మార్ట్‌ఫోన్‌కు ఫోరెన్సిక్ ప‌రీక్ష చేయిస్తే త‌ప్ప, అది హ్యాక్ అయిందీ లేనిది తెలియ‌దు. ఒక వేళ మ‌న ఫోన్ హ్యాక్ అయితే ఫోన్‌ను, ఫోన్ నెంబ‌రును రెండింటినీ వ‌దిలించుకోవ‌డ‌మే త‌ప్ప చేసేదేమీ ఉండ‌ద‌ని నిపుణులు చెపుతున్నారు.
Published by:Veera Babu
First published: