Home /News /technology /

WORLDS THINNEST 5G SMARTPHONE MOTOROLA MOTO EDGE 30 LAUNCH DATE REVEALED GH VB

Motorola: ప్రపంచంలోనే అత్యంత సన్నని 5G స్మార్ట్‌ఫోన్.. త్వరలో ఇండియాలో లాంచ్.. వివరాలిలా..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మోటొరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. అతి తక్కువ మందంతో రూపొందించిన మోటొరోలా మోటో ఎడ్జ్ 30 (Motorola Moto Edge 30) డివైజ్‌ను ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా దీనికి గుర్తింపు ఉంది.

ఇంకా చదవండి ...
స్మార్ట్‌ఫోన్(Smartphone) తయారీ కంపెనీలు వినూత్న ఫీచర్లు, స్పెసిఫికేషన్లు(Specification), ప్రత్యేకతలతో యూజర్లను(Users) ఆకర్షిస్తుంటాయి. సరికొత్త టెక్నాలజీని(Technology) పరిచయం చేస్తూ మార్కెట్లో(Market) దూసుకుపోతాయి. ఈ క్రమంలో మోటొరోలా కంపెనీ సరికొత్త స్మార్ట్‌ ఫోన్‌ను ఆవిష్కరించింది. అతి తక్కువ మందంతో రూపొందించిన మోటొరోలా(Motorola) మోటో ఎడ్జ్ 30 (Motorola Moto Edge 30) డివైజ్‌ను ఇండియాలో లాంచ్(India Launch) చేస్తున్నట్లు ప్రకటించింది. ప్రపంచంలోని అత్యంత సన్నని స్మార్ట్‌ఫోన్‌గా దీనికి గుర్తింపు ఉంది. ఈ లేటెస్ట్ 5G స్మార్ట్‌ఫోన్ మే 12న ఇండియాలో విడుదల కానుంది. ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఫ్లిప్‌కార్ట్‌లో మోటొరోలా ఈ స్మార్ట్‌ఫోన్ టీజర్‌ను విడుదల చేసింది. ఈ ఫోన్ 6.79mm సన్నగా, 155gm బరువు మాత్రమే ఉంటుంది. కొత్త Moto Edge 30 క్వాల్కమ్ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్, 144Hz రిఫ్రెష్ రేట్ డిస్‌ప్లే వంటి స్పెసిఫికేషన్లతో రానుంది. ఈ స్మార్ట్‌ఫోన్ లాంచ్ డేట్, ధర, లభ్యత, స్పెసిఫికేషన్ల వివరాలు తెలుసుకుందాం.

* లాంచ్ డేట్ ఎప్పుడు?
మోటో ఎడ్జ్ 30 ఫోన్ మే 12, గురువారం నాడు భారతదేశంలో లాంచ్ కానుంది. కంపెనీ అదేరోజు మధ్యాహ్నం 12 గంటల నుంచి ఆన్‌లైన్ లాంచ్ ఈవెంట్‌ను నిర్వహిస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్, రిలయన్స్ డిజిటల్, భారతదేశంలోని ఇతర ప్రముఖ రిటైల్ అవుట్‌లెట్‌ల ద్వారా సేల్‌కు రానుంది.

ఇది కూడా చదవండి  : విశ్రాంతి పేరుతో వేటుకు రంగం సిద్ధం చేసిన బీసీసీఐ! సౌతాఫ్రికాతో సిరీస్ కు కోహ్లీని పక్కన పెట్టే ఛాన్స్!

* మోటో ఎడ్జ్ 30 స్పెసిఫికేషన్లు
ఈ స్మార్ట్‌ఫోన్ 144Hz రిఫ్రెష్ రేట్‌ను అందించే 6.5-అంగుళాల FHD+ AMOLED ప్యానెల్‌తో వస్తుందని భావిస్తున్నారు. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 778G+ ప్రాసెసర్ ద్వారా పనిచేస్తుంది. ఆండ్రాయిడ్ 12-బేస్డ్ MyUX స్కిన్ అవుట్ ఆఫ్ బాక్స్‌పై రన్ అవుతుంది. ఇది గరిష్టంగా 8GB RAM, 256GB వరకు ఇంటర్నల్ స్టోరేజ్‌ను అందించే అవకాశం ఉంది. మోటో ఎడ్జ్ 30 ఫోన్ 50MP ప్రైమరీ సెన్సార్, 50MP అల్ట్రా-వైడ్-యాంగిల్ లెన్స్, 2MP డెప్త్ సెన్సార్‌ ఉన్న ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ఈ హ్యాండ్‌సెట్‌లో 32 MP ఫ్రంట్ ఫేసింగ్ కెమెరాను అందించారు.

మోటో ఎడ్జ్ 30 ఫోన్ 4,020mAh బ్యాటరీతో రానుంది. ఇది 33W ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తుంది. కనెక్టివిటీ ఆప్షన్లలో 5G SA/NSA, డ్యూయల్ 4G VoLTE, Wi-Fi 6E, బ్లూటూత్ 5.2, GPS, USB టైప్-C పోర్ట్, NFC వంటివి ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్ టీజర్ ప్రకారం, ఈ స్మార్ట్‌ఫోన్ డాల్బీ అట్మోస్ సపోర్ట్‌తో వస్తుంది. ఇది బ్లాక్, బ్లూ, గ్రీన్ కలర్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది.

* ధర ఎంత ఉండవచ్చు?
ఇండియాలో ఈ స్మార్ట్‌ఫోన్ ధర దాదాపు రూ.30,000 వరకు ఉండవచ్చు. ఇది యూరోపియన్ మార్కెట్లలో EUR 450 వద్ద లాంచ్ అయింది. దీనికి సంబంధించిన మరిన్ని వివరాలను మోటొరోలా లాంచ్ ఈవెంట్లో ప్రకటించే అవకాశం ఉంది.
Published by:Veera Babu
First published:

Tags: 5g smart phone, Motorola, Technology

తదుపరి వార్తలు