ఆ మెమొరీ కార్డ్ సైజ్ 1024 జీబీ... ధర ఎంతో తెలుసా?

Sandisk Extreme microSD card | సాన్‌డిస్క్ సంస్థ '1 టీబీ సాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ మైక్రోఎస్‌డీ కార్డు' పేరుతో మెమొరీ కార్డును తయారు చేసింది. ఫిబ్రవరిలోనే మొబైల్ వాల్డ్ కాంగ్రెస్ 2019లో ఈ మెమొరీ కార్డును ప్రపంచానికి పరిచయం చేసింది సాన్‌డిస్క్.

news18-telugu
Updated: May 16, 2019, 6:46 PM IST
ఆ మెమొరీ కార్డ్ సైజ్ 1024 జీబీ... ధర ఎంతో తెలుసా?
ఆ మెమొరీ కార్డ్ సైజ్ 1024 జీబీ... ధర ఎంతో తెలుసా? (Image: SanDisk)
news18-telugu
Updated: May 16, 2019, 6:46 PM IST
మీరు 8 జీబీ, 16 జీబీ, 32 జీబీ చూసే ఉంటారు. ఎవరైనా తమ స్మార్ట్‌ఫోన్‌లో ఎక్కువగా 32 జీబీ మెమొరీ కార్డునే ఉపయోగిస్తారు. ఫైల్స్ ఎక్కువగా స్టోర్ చేసుకునేవారి 64 జీబీ లేదా 128 జీబీ మెమొరీ కార్డ్ తీసుకుంటారు. ఇవే కాకుండా 256 జీబీ, 512 జీబీ మెమొరీ కార్డులు కూడా ఉన్నాయి. ఇప్పుడు ఏకంగా 1024 జీబీ (1 టీబీ) మెమొరీ కార్డ్ వచ్చేసింది. ప్రపంచంలోనే మొదటి 1 టీబీ మెమొరీ కార్డ్ ఇది. సాన్‌డిస్క్ సంస్థ '1 టీబీ సాన్‌డిస్క్ ఎక్స్‌ట్రీమ్ మైక్రోఎస్‌డీ కార్డు' పేరుతో మెమొరీ కార్డును తయారు చేసింది. ఫిబ్రవరిలోనే మొబైల్ వాల్డ్ కాంగ్రెస్ 2019లో ఈ మెమొరీ కార్డును ప్రపంచానికి పరిచయం చేసింది సాన్‌డిస్క్. ఇప్పుడు ఈ మెమొరీ కార్డ్ స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, జెర్మనీలో అమెజాన్‌లో అందుబాటులో ఉంది.

మీ స్మార్ట్‌ఫోన్‌లో స్టోరేజ్ సరిపోవట్లేదని అనుకుంటే ఈ మెమొరీ కార్డు కొనొచ్చు. ఇందులో కావాల్సినన్ని ఫైల్స్ దాచుకోవచ్చు. 4కే వీడియోలను స్టోర్ చేసుకోవచ్చు. ఇంతకీ ఈ మెమొరీ కార్డ్ ధర ఎంతో తెలుసా? 450 డాలర్లు. అంటే ఇండియన్ కరెన్సీలో రూ.31 వేలకన్నా ఎక్కువే. ప్రస్తుతమైతే స్పెయిన్, యునైటెడ్ కింగ్డమ్, జెర్మనీలో అందుబాటులో ఉంది. ఇండియాలో ఎప్పుడు రిలీజ్ అవుతుందో తెలియదు. ఇంత ఖర్చు పెడితే ఏకంగా కంప్యూటర్, ల్యాప్‌టాపే వస్తుంది కదా.

OnePlus 7 Series: అదిరిపోయిన వన్‌ప్లస్ 7, వన్‌ప్లస్ 7 ప్రో స్మార్ట్‌ఫోన్స్
ఇవి కూడా చదవండి:

Redmi Note 7S: షావోమీ నుంచి మరో ఫోన్... రెడ్‌మీ నోట్ 7ఎస్

Tata Sky-Amazon: టాటాస్కై యూజర్లకు గుడ్ న్యూస్... ఫ్రీగా అమెజాన్ ఫైర్ టీవీ స్టిక్
Loading...
Redmi K20: వన్‌ప్లస్‌ 7 సిరీస్‌కు పోటీగా రెడ్‌మీ కే20
First published: May 16, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...