www-డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ... ఈ మూడు అక్షరాలు ప్రపంచ గతిని మార్చేశాయి. ఈ మూడు అక్షరాలు ప్రపంచ గమనాన్ని మార్చేశాయి. ఈ మూడు అక్షరాలు చదువు, విజ్ఞానం, వినోదం, సాంకేతికతకు కొత్త పుంతలు తొక్కించాయి. వాల్డ్ వైడ్ వెబ్ అంటే అందరికీ పెద్దగా తెలియకపోవచ్చు కానీ... www అంటే తెలియనివాళ్లుండరు. సరిగ్గా 30 ఏళ్ల క్రితం మొదలైన వాల్డ్ వైడ్ వెబ్‌లో ఇప్పుడు కోట్లాది వెబ్‌సైట్‌లు కనిపిస్తాయి. ఇప్పటి తరానికి గూగుల్, ఫేస్‌బుక్, వికీపీడియా, ట్విట్టర్ లాంటివాటి గురించి తెలుసు కానీ... ఇలాంటి వెబ్‌సైట్లు ఎన్నెన్నో ఉన్నాయి. వాల్డ్ వైడ్ వెబ్‌కు 30 ఏళ్లు నిండిన సందర్భంగా గూగుల్ ప్రత్యేకంగా డూడుల్ రూపొందించింది.
మరి ఈ సాంకేతిక విప్లవానికి మొదటి అడుగు ఎప్పుడు పడింది? ఎలా పడింది? ప్రపంచంలో ఏ వెబ్‌సైట్ అయినా మీరు ఉచితంగా వీక్షించే అవకాశం ఎలా కలిగింది? www గురించి ఆసక్తికరమైన 10 అంశాలివే...
1. బ్రిటీష్ ఇంజనీర్, కంప్యూటర్ సైంటిస్ట్ సర్ టిమ్ బెర్నర్స్-లీ తొలిసారిగా 1989 మార్చిలో ఈ ప్రతిపాదన చేశారు. ఆ తర్వాత అదే వాల్డ్ వైడ్ వెబ్‌గా మారింది. దాన్నే www అని పిలుస్తోంది ప్రపంచం. ప్రస్తుతం సర్ టిమ్ బెర్నర్స్-లీ వాల్డ్ వైడ్ వెబ్ కన్సార్షియం(W3C) డైరెక్టర్‌గా ఉన్నారు.
2. వాల్డ్ వైడ్ వెబ్ ప్రారంభించిన తర్వాత మొదటి వెబ్‌సైట్ ఏదో తెలుసా? http://info.cern.ch. 1991 ఆగస్ట్ 6న ఈ వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లోకి వెళ్లింది.
Read this: SBI Minor Account: ఎస్‌బీఐలో పిల్లల కోసం రెండు అకౌంట్లు... లాభాలు ఇవే
3. ప్రపంచంలో మొదటి వెబ్ సర్వర్ కోసం NeXT కంప్యూటర్‌ను ఉపయోగించారు సర్ టిమ్ బెర్నర్స్-లీ.
4. సర్ టిమ్ బెర్నర్స్-లీ 1992లో మొదటి ఫోటో అప్‌లోడ్ చేశారు. అది సెర్న్స్ హౌజ్ ఇమేజ్.
5. వాల్డ్ వైడ్ వెబ్‌ని మలుపు తిప్పింది 1993లో మొజాయిక్ వెబ్ బ్రౌజర్ లాంఛింగ్ అని చరిత్ర చెబుతోంది. యూనివర్సిటీ ఆఫ్ ఇల్లినాయిస్‌లో నేషనల్ సెంటర్ ఫర్ సూపర్‌కంప్యూటింగ్ అప్లికేషన్స్ బృందం తయారు చేసిన గ్రాఫికల్ బ్రౌజర్ ఇది.
6. CERN నుంచి 1994 అక్టోబర్‌లో వైదొలగిన తర్వాత సర్ టిమ్ బెర్నర్స్-లీ వాల్డ్ వైడ్ వెబ్ అంతర్జాతీయ ప్రమాణాల సంస్థ వైడ్ వెబ్ కన్సార్షియం(W3C) ఏర్పాటు చేశారు.
Read this: Lok Sabha Election 2019: ఓటరు జాబితాలో మీ పేరు ఉందా? లేదా? 3 నిమిషాల్లో తెలుసుకోండి
7. మొదటి ఇంటర్నెట్ సెర్చ్ ఇంజిన్ Archie. FTP ఆర్కైవ్స్‌ని ఇండెక్స్ చేసిన మొదటి టూల్.
8. ఇంటర్నెట్ యూజర్లకు 'surfers' అని పేరు పెట్టిన మహిళ పేరు జీన్ ఆర్మర్ పాల్లీ.
9. వెబ్‌లో పోర్నోగ్రఫీ పెద్ద భాగమైపోయింది. .xxx డొమైన్‌తో 2011 ఆగస్ట్‌లో తొలి వెబ్‌సైట్ ఆన్‌లైన్‌లోకి వచ్చింది.
10. Internet , Web ఈ రెండూ పర్యాయపదాలని చాలామంది పొరబడుతుంటారు. ఒకదానికి ఒకటి సంబంధం ఉన్నా ఈ రెండూ పర్యాటపదాలు కాదు. ప్రపంచంలోని కోట్లాది కంప్యూటర్లను కనెక్ట్ చేసేది ఇంటర్నెట్. వాల్డ్ వైడ్ వెబ్ అంటే ప్రపంచవ్యాప్తంగా ఉన్న టెక్ట్స్ పేజీలు, డిజిటల్ ఫోటోగ్రాఫ్స్, మ్యూజిక్ ఫైల్స్, వీడియోస్, యానిమేషన్లతో కూడిన కలెక్షన్స్. వీటిని ఇంటర్నెట్ ద్వారానే యాక్సెస్ చేయొచ్చు.
Photos: రెడ్‌మీ నోట్ 7 ప్రో... ఎలా ఉందో చూడండి
ఇవి కూడా చదవండి:
Samsung Galaxy M30, M20: కాసేపట్లో సాంసంగ్ గెలాక్సీ ఎం30, ఎం20 సేల్
SBI Money Transfer: మనీ ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారా? ఎస్‌బీఐలో IMPS NEFT వివరాలు ఇవే...
Railway Jobs: పది పాసైతే చాలు... రైల్వేలో 1,00,000 ఉద్యోగాలు... మార్చి 12 నుంచి రిజిస్ట్రేషన్
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Google Doodle, Technology