హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Tiny TV: ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!

Tiny TV: ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!

1 Inch TV: ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!

1 Inch TV: ఇలాంటి టీవీని మీరెప్పుడూ చూసి ఉండరు.. ధర రూ.4 వేలే, దీనికో ప్రపంచ రికార్డ్!

1 Inch TV | మీరు చాలా రకాల టీవీలు చూసి ఉంటారు. అయితే ఈ టీవీని మాత్రం మీరెప్పుడూ చూసి ఉండరు. ఎందుకని అనుకుంటున్నారా? అయితే ఈ విషయం తెలుసుకోండి.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Tiny TV Mini | ప్రస్తుతం స్మార్ట్ టీవీల ట్రెండ్ నడుస్తోంది. ఇదివరకు ఎల్ఈడీ టీవీలను వాడే వారు. కానీ ఇప్పుడు ప్రతి ఒక్కరూ స్మార్ట్ టీవీ (Smart TV) వైపు చూస్తున్నారు. చాలా మంది ఇంట్లోకి 32 అంగుళాల స్మార్ట్‌ టీవీ (TV) కొనాలని అనుకుంటారు. కొంత మంది 43 అంగుళాల టీవీ, ఇంకొంత మంది 55 అంగుళాల టీవీలు కొంటూ ఉంటారు. ఇలా స్క్రీన్ ఎక్కువ ఉంటే టీవీల వైపు ఇప్పుడు అందరూ చూస్తున్నారు. అయితే హార్డ్‌వేర్ కంపెనీ టినీ సర్క్యూట్ మాత్రం ట్రెండ్‌కు విరుద్ధంగా అతి చిన్న టీవీని మార్కెట్లోకి తెచ్చింది.

ఈ టీవీల సైజ్ ఎంతో తెలిస్తే మీ మతిపోతుంది. కేవలం ఒక ఇంచు మాత్రమే. ఈ టీవీ పేరు టిన్నీ టీవీ 2. ఇది ట్రడిషనల్ టీవీ ఎలా ఉంటుందో అలానే ఉంటుంది. ఇది 216x135 పిక్సల్ టీవీ. ఛానల్స్ మార్చడానికి డయల్ ఉంటుంది. ఇంకా వాల్యూమ్ పెంచుకోవచ్చు. ఇవే కాకుండా టీవీలో ఇన్‌ఫ్రారెడ్ రిసీవర్ ఫర్ స్పీకర్లు, పవర్ బటన్, రిమోట్ కంట్రోల్ వంటివి ఫీచర్లు కడా ఉన్నాయి.

ఒక్కసారి చార్జింగ్ పెడితే 500 కిలోమీటర్లు వెళ్లే టాప్ 5 ఎలక్ట్రిక్ కార్లు ఇవే

ఇంకా ఈ టీవీల్లో 2 అవర్ లిథియం అయాన్ బ్యాటరీ ఉంటుంది. అంటే మీరు వెళ్తూ వెళ్తూ కూడా ఈ టీవీని చూడొచ్చు. ఈ టీవీలో ర్యాస్ప్‌బెర్రీ పీఐ ఆర్‌పీ2040 కంప్యూటర్ ఉంటుంది. 8 జీబీ మెక్రో ఎస్‌డీ కార్డు ఉంటుంది. వీడియోపై టైమ్ స్టాంప్ కూడా కనిపిస్తుంది. కంపెనీ ఈ టీవీతో పాటుగా టిన్నీ టీవీ మినీ కూడా తీసుకువచ్చింది. ఈ టీవీలో 0.6 ఇంచు ఓఎల్ఈడీ స్క్రీన్ ఉంటుంది. ఐపీఎస్ డిస్‌ప్లే కాదు. ఈ టీవీ బ్యాటరీ లైఫ్ ఒక గంట.

ఈ రెండు టీవీలు ప్రస్తుతం కిక్‌స్టార్టర్‌లో అందుబాటులో ఉన్నాయి. వీటి ధర 50 డాలర్ల నుంచి ప్రారంభం అవుతోంది. మన కరెన్సీలో చెప్పుకుంటే దాదాపు రూ. 4 వేల నుంచి రేటు స్టార్ట్ అవుతోందని చెప్పొచ్చు. రెండు టీవీల్లో యాప్ ఉంటుంది. దీని ద్వారా నచ్చిన వీడియో ఫైల్‌ను సరైన రెజల్యూషన్‌లో చూడొచ్చు. వీటిని ప్రపంచంలోనే అతి చిన్న టీవీలుగా చెప్పుకుంటున్నారు.

స్టన్నింగ్ డీల్.. 55 అంగుళాల స్మార్ట్‌ టీవీపై రూ.17 వేల డిస్కౌంట్!

ఈ టీవీల ధరకే మరో రూ. 2 వేలు వేసుకుంటే 24 అంగుళాల టీవీ కొనొచ్చు. అయినా ఇలాంటి ఒక ఇంచు, అర ఇంచు టీవీలను కూడా కొనే వారు ఉంటారంటే నమ్మ బుద్ది కావడం లేదు. అందరూ ఇప్పుడు స్మార్ట్ టీవీల కోసం చూస్తూ ఉంటే.. ఇలాంటి అతి చిన్న టీవీలను ఎవరు కొంటారో ఎందుకు కొంటారో మనకు అర్థం కాకపోవచ్చు.

First published:

Tags: Budget smart tv, Latest offers, Smart TV

ఉత్తమ కథలు