Whatsapp: వాట్సాప్ లో చిన్న పొరపాటు చేసిన మహిళ.. ఫలితంగా రూ. 3 లక్షలు లాస్.. అసలు ఏమైందంటే?

(ప్రతీకాత్మక చిత్రం)

వాట్సాప్ లో వచ్చిన ఆ మెసేజ్ తో మహిళ రూ. 3 లక్షలకు పైగా డబ్బులను పోగొట్టుకుంది. చివరకు పోలీసులను ఆశ్రయించి తనకు న్యాయం చేయాలని వేడుకుంటోంది. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి.

  • Share this:
    సైబర్ నేరాలపై పోలీసులు, బ్యాంకులు, వివిధ సంస్థలు ఎంత అవగాహన కల్పిస్తున్నా అనేక మంది మాత్రం మోసపోతూనే ఉన్నారు. తాజాగా వాట్సాప్ ద్వారా వచ్చిన ఓ లింక్ పై క్లిక్ చేసి ఏకంగా రూ. 3 లక్షలకు పైగా డబ్బులు కోల్పోయింది. చివరికి మోసపోయానని గ్రహించి పోలీసులను ఆశ్రయించింది బాధితురాలు. ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ముంబాయిలో కాండివలికి చెందిన ఓ మహిళకు వాట్సాప్ లో ఓ మెసేజ్ వచ్చింది. ఆన్లైన్ షాపింగ్ కు సంబంధించినట్లుగా ఉన్న లింక్ పై క్లిక్ చేసి వివరాలను నమోదు చేస్తే రివార్డ్ వస్తుందని ఆ మెసేజ్ లో ఉంది. దీంతో ఆ మహిళ నిజమని నమ్మి ఆ లింక్ పై క్లిక్ చేసి యూజర్ ఐడీ, పాస్ వర్డ్ ని క్రియేట్ చేసింది. దీంతో ఆమెకు రూ. 64 రివార్డ్ లభించింది. అనంతరం రీఛార్జ్ చేసుకుంటే మరో రివార్డ్ లభిస్తుందని సైబర్ నేరగాడు ఆమెకు మళ్లీ మెసేజ్ పంపండంతో ఆమె రీఛార్జ్ చేసింది. దీంతో ఆమెకు మళ్లీ రివార్డ్ లభించింది.

    దీంతో సైబర్ నేరగాడు మరో అడుగు ముందుకేసి డబ్బులు డిపాజిట్ చేస్తే భారీగా రివార్డ్ వస్తుందని నమ్మించారు. ఇలా ఆ మహిళతో రూ. 3.11 లక్షలను డిపాజిట్ చేయించారు. అయితే మొదటి రెండు సార్లు రివార్డు అందుకున్న ఆ మహిళకు మూడో సారి ఏమీ రాలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న ఆ బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. IPC సెక్షన్ 420 (చీటింగ్) మరియు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం యొక్క సంబంధిత నిబంధనల కింద పోలీసులు FIR నమోదు చేశారు. ఈ మేరకు దర్యాప్తు ప్రారంభించినట్లు వారు వెల్లడించారు.
    Cyber Crime: కుక్కపిల్లకి రూ. 66 లక్షలు: మోసపోయిన మహిళ

    అలాంటి తప్పు ఎప్పుడూ చేయవద్దు!
    ఈ సందర్భంగా పోలీసులు మాట్లాడుతూ.. ఇటీవల ప్రజలు తరచుగా ఆన్‌లైన్ మోసానికి గురవుతున్నారని తెలిపారు. ఉచిత రివార్డ్ లేదా ఉచిత డబ్బు ఇస్తామంటూ ఫోన్లకు వచ్చే లింకులపై అస్సలు క్లిక్ చేయవద్దని సూచించారు. సైబర్ నేరగాళ్లే అలాంటి లింకులను పంపిస్తారని చెప్పారు. ఫ్రీగా ఏదీ ఎవరూ ఇవ్వరని.. ఇలాంటి మోసాలపై అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.
    Published by:Nikhil Kumar S
    First published: