హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Money Fraud: టీవీ రీచార్జ్ చేసుకోవాలనుకుంది.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.81 వేలు మాయం!

Money Fraud: టీవీ రీచార్జ్ చేసుకోవాలనుకుంది.. బ్యాంక్ అకౌంట్‌లో రూ.81 వేలు మాయం!

 Money Fraud: టీవీ రీచార్జ్ చేసుకోవాలనుకుంది.. రూ.81వేలు పోగొట్టుకుంది!

Money Fraud: టీవీ రీచార్జ్ చేసుకోవాలనుకుంది.. రూ.81వేలు పోగొట్టుకుంది!

DTH Recharge | మీరు జాగ్రత్తగా ఉండాలి. లేదంటే మాత్రం బ్యాంక్ అకౌంట్ ఖాళీ అయిపోతుంది. ఎందుకని అనుకుంటున్నారా? మోసగాళ్లు ఎప్పుడు ఎలా మిమ్మల్ని బురిడీ కొట్టిస్తారో చెప్పలేం.

  • News18 Telugu
  • Last Updated :
  • Hyderabad | Visakhapatnam

Woman | బ్యాంక్ అకౌంట్ కలిగిన వారు జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే మోసగాళ్లు ఎప్పుడు ఎలా మనల్ని బురిడీ కొట్టిస్తారో చెప్పలేం. అందుకే బ్యాంక్ కస్టమర్లకు ఎప్పటికీ జాగ్రత్తగా ఉండాలి. ఏమరపాటుగా ఉంటే మాత్రం బ్యాంక్ (Bank) అకౌంట్ ఖాళీ అవుతుంది. ఇప్పుడు ఇది ఎందుకని అనుకుంటున్నారా? తాజాగా మోసగాళ్లు ఒక మహిళ అకౌంట్ నుంచి ఏకంగా రూ. 81 వేలు కొట్టేశారు. మోసగాళ్లు ఎలా ఈ మహిళను మోసం చేసి బ్యాంక్ అకౌంట్ నుంచి డబ్బులు (Money) కొట్టేశారో ఇప్పుడు మనం ఒకసారి తెలుసుకుందాం.

ముంబైకి చెందిన ఒక 47 ఏళ్ల మహిళ ఆన్‌లైన్‌లో డీటీహెచ్ రీచార్జ్ చేసుకోవాలని భావించారు. టీవీ రావడం లేదు. రీచార్జ్ అయిపోయింది. దీంతో ఆమె ఆన్‌లైన్‌లో డీటీహెచ్ రీచార్జ్ చేసుకోవాలని అనుకున్నారు. అలాగే డీటీహెచ్ రీచార్జ్ చేసుకున్నారు. అయితే రీచార్జ్ చేసుకున్న తర్వాత మొబైల్‌కు రీచార్జ్ కన్ఫర్మేషన్ మెసేజ్ రాలేదు. అలాగే టీవీ కూడా రాలేదు. దీంతో ఆమె కస్టమర్ కేర్ వారితో మాట్లాడాలని అనుకున్నారు.

రూ.250 ఖర్చుతో నెలంతా తిరగొచ్చు.. ఎలక్ట్రిక్ స్కూటర్ అదిరింది.. ధర తక్కువ రేంజ్ ఎక్కువ!

అయితే ఇక్కడి నుంచే సమస్య వచ్చింది. ఆమె గూగుల్‌లో కస్టమర్ కేర్ నెంబర్‌ కోసం సెర్చ్ చేశారు. తర్వాత గూగుల్‌లో కనిపించిన ఒక నెంబర్‌కు కాల్ చేశారు. అయితే అది కనెక్ట్ కాలేదు. కానీ తర్వాత ఆమె నెంబర్‌కు డీటీహెచ్ ప్రతినిధి అంటూ కాల్ వచ్చింది. ఆమె కూడా డీటీహెచ్ కంపెనీకి చెందిన ప్రతినిధి అని అనుకున్నారు. సమస్య చెప్పారు. కానీ అతను మోసగాడు. ఆమెను ప్లేస్టోర్ నుంచి యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరారు. అది రిమోట్ యాక్సెస్ యాప్. అతను చెప్పినట్ల ఆమె చేసింది. ఇప్పుడు ఈమె ఫోన్ యాక్సెస్ అతని చేతికి వెళ్లింది. అంతే సంగతి బ్యాంక్ అకౌంట్ నుంచి రూ. 81 వేలు కట్ అయిపోయాయి. డబ్బులు కట్ అయిపోయిన తర్వాత అప్రమత్తమైన ఆమె దగ్గరిలోని పోలీస్ స్టేషన్‌కు వెళ్లి ఫిర్యాదు చేశారు.

రూ.25 వేలకే ఎలక్ట్రిక్ స్కూటర్.. రూ.6,500 కడితే ఇంటికి తెచ్చుకోవచ్చు!

అందువల్ల మీరు కూడా ఇలాంటి విషయాల్లో జాగ్రత్తగా ఉండాలి. గూగుల్‌లో అందుబాటులో ఉన్న సమాచారం నిజమా? కాదా? అని చెక్ చేసుకోవాలి. తర్వాతనే అందులోని నెంబర్లకు కాల్ చేయాలి. లేదంటే మాత్రంచాలా ఇబ్బందులు పడాల్సి వస్తుంది. బ్యాంక్ అకౌంట్‌లో డబ్బులు పోగొట్టుకోవాల్సి వచ్చింది. అలాగే మీకు ఎవరైనా కాల్ చేసి యాప్స్ డౌన్‌లోడ్ చేసుకోవాలని కోరితే.. ఆ పని మాత్రం చేయవద్దు. ఎందుకంటే ఆ యాప్స్ వల్ల మీ ఫోన్ యాక్సెస్ అవతలి వ్యక్తి చేతికి వెళ్లిపోతుంది.

First published:

Tags: Bank account, Bank fraud, Bank news, Banks, DTH

ఉత్తమ కథలు