హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Smartphone Blast: ఫోన్ ను పక్కనే ఉంచి పడుకునే వారికి షాక్? ఇది చదివితే అలా చేయరు ఇక..

Smartphone Blast: ఫోన్ ను పక్కనే ఉంచి పడుకునే వారికి షాక్? ఇది చదివితే అలా చేయరు ఇక..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్ (Smartphone) పక్కనే ఉంచుకుంటున్నారు చాలా మంది. ఇది ఓ అలవాటుగా మారింది. రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ ను చూడడం.. మళ్లీ ఉదయాన్నే లేవగానే కాసేపు మళ్లీ ఫోన్ నొక్కడం..

 • News18 Telugu
 • Last Updated :
 • Hyderabad | Vijayawada

  మారిన పరిస్థితుల్లో స్మార్ట్ ఫోన్ (Smartphone) మనిషి జీవితంలో ఓ భాగమైంది. ఎక్కడికి వెళ్లినా ఫోన్ మాత్రం పక్కనే ఉండాల్సిన పరిస్థితి. కాసేపు ఫోన్ కనిపించకపోతేనే ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు అనేక మంది. ఈ నేపథ్యంలో రాత్రి పడుకునే సమయంలోనూ ఫోన్ పక్కనే ఉంచుకుంటున్నారు చాలా మంది. ఇది ఓ అలవాటుగా మారింది. రాత్రి పడుకునే వరకు కూడా ఫోన్ ను చూడడం.. మళ్లీ ఉదయాన్నే లేవగానే కాసేపు మళ్లీ ఫోన్ నొక్కడం మనలో చాలా మంది చేసే పనే. ఇది ఆరోగ్యానికి (Health) అంత మంచిది కాదంటూ నిపణులు మొత్తుకుంటున్నా.. వినడం లేదు. అయితే.. చాలా రోజులుగా స్మార్ట్ ఫోన్లు పేలడం (Smartphone Blast) అనే వార్తలు మనకు వినిపిస్తూనే ఉన్నాయి. అయినా.. కూడా ఫోన్ ను పక్కలో పెట్టుకుని పడుకోవడం మాత్రం చాలా మంది మానుకోవడం లేదు. ఇలా ఫోన్ ను రాత్రి పక్కనే పెట్టుకుని నిద్రలోకి వెళ్లిన మహిళ.. ఆ ఫోన్ పేలడంతో ప్రాణాలు కోల్పోయిన ఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది.

  తాజాగా ఓ యువకుడు ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. ఓ మహిళ రెడ్ మీ 6ఏ స్మార్ట్ ఫోన్ ను వాడుతోంది. ఆ మహిళ కుమారుడు ఆర్మీలో పని చేస్తున్నాడు. ఎప్పటిలాగే రాత్రి సమయంలో కుమారుడితో ఫోన్లో మాట్లాడిన ఆ మహిళ ఫోన్ ను పక్కనే పెట్టుకుని నిద్రపోయింది. ఆ మరుసటి రోజు ఆమె అల్లుడు వచ్చి చేసేసరికి ప్రాణాలు పోల్పోయి కనిపించింది. ఆమె చుట్టూ రక్తం కనిపించింది. ఆమె ఫోన్ పేలిపోయి ఉంది. ఈ సందర్భంగా ఆ యువకుడు ఇలా ట్వీట్ చేశాడు.

  హెచ్చరిక.. మీ ఫోన్‌లో ఈ 2 యాప్స్ ఉంటే వెంటనే డిలేట్ చేయండి.. లేదంటే ఫసక్కే!

  ‘‘ నిన్న రాత్రి మా ఆంటీ చనిపోయారు. ఆమె రెడ్ మీ 6ఏ స్మార్ట్ ఫోన్ వాడుతున్నారు. పడుకునే సమయంలో ఆమె తన ఫోన్ ను దిండు పక్కనే పెట్టుకుని పడుకున్నారు. అయితే.. ఆ ఫోన్ పేలడంతో ఆమె ప్రాణాలను కోల్పోయారు. ఇది మాకు చాలా విషాదకరమైన సమయం. సెల్ ఫోన్ సంస్థ పైనే మాకు సాయం చేయాల్సిన బాధ్యత ఉంది’’ అంటూ ట్వీట్ చేశారు.

  ఇంకా బాధితురాలి ఫొటోను, పేలిన ఫోన్ కు సంబంధించి ఫొటోలను సైతం షేర్ చేశాడు. దీనిపై నెటిజన్లు తీవ్రంగా స్పందిస్తున్నారు. బాధిత మహిళ కుటుంబానికి న్యాయం చేయాలంటూ వారు డిమాండ్ చేస్తున్నారు. ఈ ఘటనపై రెడ్ మీ సంస్థ సైతం స్పందించింది. ఈ ఘటనపై విచారణ జరుపుతున్నామని తెలిపింది.

  Published by:Nikhil Kumar S
  First published:

  Tags: Redmi, Smartphone, Xiomi

  ఉత్తమ కథలు