హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరమే లేదు.. అవేంటంటే..

Electric Scooters: ఈ 5 ఎలక్ట్రిక్ స్కూటర్లను నడపడానికి లైసెన్స్ అవసరమే లేదు.. అవేంటంటే..

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

మీకు డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా బైక్ నడపాలన్న కోరిక ఉండి ఉంటే.. మీరు కొన్ని ఎలక్ట్రిక్ బైక్ లను అందుకోసం ఎంచుకోవచ్చు. ఈ 5 ఎలక్ట్రిక్ బైక్ లను డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా నడపొచ్చు. ఓ లుక్కేయండి.

పెరిగిన పెట్రోల్ ధరల కారణంగా మార్కెట్లోకి భారీగా ఎలక్ట్రిక్ వాహనాలు (Electric Vehicle) వచ్చి చేరుతున్నాయి. మీకు డ్రైవింగ్ లైసెన్స్ (Driving licence) లేకుండా బైక్ నడపాలన్న కోరిక ఉండి ఉంటే.. మీరు కొన్ని ఎలక్ట్రిక్ బైక్ (Electric Bike) లను అందుకోసం ఎంచుకోవచ్చు. గరిష్టంగా 25 kmph వేగంతో మరియు 250 వాట్ల గరిష్ట పవర్ అవుట్‌పుట్‌తో కూడిన ఎలక్ట్రిక్ వాహనాలను నడపొచ్చు. మీరు అలాంటి వాహనం కోసం ఎవరు చూస్తూ ఉంటే కనుక.. ఈ కింది ఉన్న 4 వాహనాలను ఎంచుకోవచ్చు.

1. హీరో ఎలక్ట్రిక్ ఫ్లాష్ E2 (Hero Electric Flash E2):

Hero Electric Flash E2 ఆపరేట్ చేయడానికి డ్రైవింగ్ లైసెన్స్ అవసరం లేని ఎలక్ట్రిక్ వాహనాల్లో ఒకటి. స్కూటర్ 48-వోల్ట్ 28 Ah లిథియం-అయాన్ బ్యాటరీ ఆధారంగా 250-వాట్ ఎలక్ట్రిక్ మోటార్ నుంచి శక్తిని తీసుకుంటుంది. గరిష్టంగా గంటకు 25 కి.మీ ప్రయాణిస్తుంది. మంచి విషయం ఏమిటంటే స్కూటర్ బరువు కేవలం 69 కిలోలు మాత్రమే. మరియు ధర రూ. 59,099.

Electric Scooter: ఈ ఎలక్ట్రిక్ స్కూటర్ ఫుల్ ఛార్జ్ చేసి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్లొచ్చు

2. హీరో ఎలక్ట్రిక్ ఆప్టిమా E5 (Hero Electric Optima E5)

ఈ స్కూటర్ 250-వాట్ ఎలక్ట్రిక్ హబ్ మోటార్‌తో శక్తిని పొందుతుంది. ఫ్లోర్‌బోర్డ్‌లో ఇన్‌స్టాల్ చేయబడిన లిథియం-అయాన్ / లెడ్-యాసిడ్ బ్యాటరీ ప్యాక్ 4-5 గంటల్లో పూర్తిగా ఛార్జ్ చేయబడుతుంది. ఒక్క ఛార్జి చేస్తే 55 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరియు గంటకు 42 కిలోమీటర్ల గరిష్ట వేగాన్ని అందుకోవచ్చు.

Audi e-Rikshaw: ఆడి కార్లు మర్చిపోండి... ఆడి ఇ-రిక్షాలు వచ్చేస్తున్నాయి (Photos)

3. హాప్ లియో (HOP LEO)

HOP LEO ఎలక్ట్రిక్ స్కూటర్ విభాగాల్లో అనేక ఫీచర్లు కలిగినది. USB ఛార్జింగ్, ఆటోమేటిక్ పార్కింగ్ అసిస్టెన్స్, రిమోట్ కీ, సైడ్ స్టాండ్ సెన్సార్, యాంటీ థెఫ్ట్ అలారం మరియు GPS వంటి ఇతర ఫీచర్లు ఇందులో ఉన్నాయి. అదనంగా, ఈ స్కూటర్ ఫుల్ ఛార్జింగ్ పై 70 నుండి 125 కి.మీ ప్రయాణిస్తుంది.

4. Jaunty Pro

249 W ఎలక్ట్రిక్ మోటార్ Jaunty Proకి శక్తినిస్తుంది. ఒక్క సారి ఛార్జ్‌ చేస్తే 75 కిలోమీటర్లు ప్రయాణించవచ్చు. మరియు గరిష్ట వేగం గంటకు 25 కిలోమీటర్లు. 6 గంటల్లో, బ్యాటరీని పూర్తిగా ఛార్జ్ చేయవచ్చు.

5. జాయ్ ఇ-బైక్ మాన్స్టర్ (Joy E-bike Monster)

వాస్తవానికి ఈ బైక్ చాలా భిన్నంగా ఉంటుంది. మినీ-బైక్ 250 kW హబ్ మోటార్ నుంచి శక్తిని పొందవచ్చు. మినీ బైక్ డిజిటల్ ఇన్స్ట్రుమెంట్ కన్సోల్, అల్లాయ్ వీల్స్ మరియు వెనుక మోనో-షాక్ వంటి ఫీచర్లతో వస్తుంది. మీరు రూ. 1,10,000కి ఈ బైక్ ను కొనుగోలు చేయవచ్చు. ఈ బైక్ ను నడపడానికి కూడా ఎలాంటి లైసెన్స్ అవసరం లేదు.

First published:

Tags: Driving licence, Electric Scooter, Electric Vehicles

ఉత్తమ కథలు