Home /News /technology /

Tiktok ప్లేస్ భర్తీ చేసేందుకు Instagram నుంచి Reels యాప్ ఇండియాలో విడుదల...

Tiktok ప్లేస్ భర్తీ చేసేందుకు Instagram నుంచి Reels యాప్ ఇండియాలో విడుదల...

ప్రతీకాత్మకచిత్రం

ప్రతీకాత్మకచిత్రం

ఫేస్‌బుక్‌కు చెందిన Instagram యాప్ నుంచి Reels అనే కొత్త ఫీచర్‌ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సెలబ్రిటీ క్రియేటర్లు నుంచి కొత్త వీడియోలు వినోదాన్ని అందించేలా ఏర్పాటు చేసింది.

    భారత్‌లో టిక్‌టాక్‌కు నిషేధంతో ప్రస్తుతం వీడియో యాప్‌ డిమాండ్‌ నెలకొంది. టిక్‌టాక్‌ వదిలేసిన భారీ మార్కెట్‌ను దక్కించుకునేందుకు పెద్ద ఎత్తున సంస్థలు ప్రయత్నాలు ప్రారంభించాయి. ఇప్పటికే భారతీయ సంస్థలైన రొపోసో, చింగారి, మిత్రోన్ యాప్ లకు ఆదరణ పెరిగిప్పటికీ, వాటి సర్వీసులు టిక్ టాక్ తో సమానంగా లేవు. దీంతో కస్టమర్లు సంతృప్తి చెందడం లేదు. ఈ క్రమంలో, ఫేస్‌బుక్‌కు చెందిన Instagram యాప్ నుంచి Reels అనే కొత్త ఫీచర్‌ను భారత మార్కెట్లోకి అందుబాటులోకి తీసుకొచ్చింది. ఇందులో సెలబ్రిటీ క్రియేటర్లు నుంచి కొత్త వీడియోలు వినోదాన్ని అందించేలా ఏర్పాటు చేసింది. రీల్స్‌లో పేరు తెచ్చుకున్న క్రియేటర్లు, మోడల్స్‌.. ఆదాయం కూడా పొందేలా కూడా ఏర్పాట్లు చేసినట్లు ఇన్‌స్టాగ్రామ్‌ స్పష్టం చేసింది.

    టిక్‌టాక్‌ తరహాలోనే 15సెకన్ల వీడియోను వివిధ రకాలైన బీజీఎం మ్యూజిక్ తో పాటు, ఎఫెక్ట్స్‌, క్రియేటివ్‌ టూల్స్‌ వినియోగించి ఇందులో వీడియోలను రూపొందించవచ్చు. భారత్‌లో ఇంటర్నెట్‌ వినియోగంతో పాటే.. వీడియో షేరింగ్‌ యాప్‌లకు మార్కెట్‌ పెరుగుతూ వచ్చిందని ఫేస్‌బుక్‌ ఇండియా ఎండీ అజిత్‌ మోహన్‌ ఈ సందర్భంగా పేర్కొన్నారు.
    Published by:Krishna Adithya
    First published:

    Tags: Technology, Tiktok

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు