భద్రతా కారణాల రీత్యా చైనాకు చెందిన 59 యాప్స్‌ను భారత ప్రభుత్వం నిషేధించింది. అందులో ప్రజల ఆదరణ చూరగొన్న టిక్ టాక్ కూడా ఒకటి. టిక్ టాక్ బ్యాన్ చేయడంతో అందులో స్టార్లుగా గుర్తింపు పొందిన వారికి చేతులు, కాళ్లు నరికేసినట్టుగా ఉంది. ఈ క్రమంలో మరోయాప్ ప్రజల్లో ఆదరణ పొందుతోంది. అది డబ్ షూట్. ఔను. ప్రస్తుతం టిక్ టాక్‌కు ప్రత్యామ్నాయ యాప్స్ ఏమేం ఉన్నాయా అని ప్లే స్టోర్‌లో వెతుకుతున్న నెటిజన్లకు హైదరాబాద్‌కు చెందిన డబ్ షూట్ యాప్ ఓ వరంలా మారింది. ఈ యాప్ హైదరాబాద్ కంపెనీ ఎం టచ్ డెవలప్ చేసింది. ఇది ఇప్పుడిప్పుడే ఫేవరెట్ వీడియో షేరింగ్ యాప్‌గా మారుతోంది. గూగుల్ ప్లే స్టోర్‌లో డౌన్ లోడ్స్ కూడా పెరిగాయి. ఇందులో టాలీవుడ్, బాలీవుడ్ కోలీవుడ్, మల్లువుడ్ సినిమాల క్లిపింగ్స్, ఫన్నీ డైలాగ్స్ లాంటివి ఉంటాయి. తెలుగు, తమిళం, కన్నడ, మళయాళం, హిందీ, ఇంగ్లీష్ భాషల్లో అందుబాటులో ఉంది. ఇందులో ఆడియో క్లిప్స్‌ను వాట్సాప్‌లో షేర్ చేసుకోవచ్చు. వీడియో స్టేటస్‌లు పెట్టుకోవచ్చు. ప్రతి రోజూ కొత్తగా కొన్ని వేల వీడియోలు అందుబాటులోకి వస్తాయి. సెల్ఫీ వీడియోను రికార్డు చేసి దాన్ని వివిధ రకాల సౌండ్స్, డైలాగ్స్, సాంగ్, ఫేమస్ యాక్టర్స్ హావభావాలతో మిక్స్ చేసుకోవచ్చు.
తెలుగు వార్తలు, తెలుగులో బ్రేకింగ్ న్యూస్ న్యూస్ 18లో చదవండి. రాష్ట్రీయ, జాతీయ, అంతర్జాతీయ, టాలీవుడ్, క్రీడలు, బిజినెస్, ఆరోగ్యం, లైఫ్ స్టైల్, ఆధ్యాత్మిక, రాశిఫలాలు చదవండి.
Tags: Tiktok