Home /News /technology /

WITH A PROMISE OF SEAMLESS CONNECTIVITY AND SMART FEATURES THE ONEPLUS BUDS PRO MIGHT JUST SET THE BAR FOR ALL OTHER TWS SETS SA

OnePlus Buds Proలో అద్భుతమైన ఫిచర్స్.. మరిన్ని వివరాలు ఇక్కడ తెలుసుకొండి!

OnePlus Buds Pro

OnePlus Buds Pro

OnePlus, తన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం, అదే జరిగితే, Buds Pro ఇతర TWS సెట్లకు ఒక బెంచ్ మార్క్‌గా నిలవనుంది.

   

  OnePlus Buds Proను స్వంతం చేసుకునే అదృష్టం మనకి ఇంకా రానప్పటికీ, దాని లక్షణాలను నిశితంగా పరిశీలించడం మరియు దాని విలువను తెలుసుకోవడం ఖచ్చితంగా మంచి విషయం.  రూ.9,990కు, మీరు ఎడాప్టివ్ ANC, IP55 నీరు మరియు దుమ్ము నుండి తట్టుకునే రేటింగ్, వేగవంతమైన మరియు వైర్‌లెస్ ఛార్జింగ్ ఆప్షన్‌లు, ఇతర OnePlus పరికరాలతో అంతరాయం లేని కనెక్టివిటీ మరియు అసాధారణ నాణ్యతతో ఆడియో వాగ్దానం చేయబడింది. మీ వినికిడి, తక్కువ లేటెన్సీ గేమింగ్ మోడ్ మరియు మరిఅన్నింటికి సరిపోయే విధంగా అవుట్ పుట్ ను ట్యూన్ చేసే ఆడియో ఐడి ఫీచర్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. అంతే కాదు మీ చెవులకు ఎలాంటి హాని లేని శబ్దాన్ని పంప్ చేయడానికి ఒక మోడ్ కూడా ఉంది.

  Buds Pro వాగ్దానం చేసిన అనుభవాన్ని అందిస్తుందా లేదా అన్న విషయానికి వస్తే – అందించకపోవడానికి మాకేమీ కారణాలు కనిపించడం లేదు - ఈ Buds Pro అంచనాలు మరియు విలువ విషయంలో అధిక స్థాయిని సెట్ చేస్తుంది.  

  ఇతర OnePlus పరికరాలతో –పెయిరింగ్ నుండి మొదలుకుని ప్రతిదీ, సులభంగా ఉపయోగించగలగడం మరియు తెలివిగా అవసరాలకు తగ్గట్టు అనుకూలంగా ఉండటాన్ని దృష్టిలో పెట్టుకుని తయారు చేసినట్టు కనిపిస్తుంది. ఒకవేళ ఇది ప్రకటన చేసినట్లుగా పనిచేస్తే, కేస్‌ను తెరిచిన వెంటనే మీ OnePlus స్మార్ట్ ఫోన్‌తో ఇయర్ బడ్స్ వెంటనే జత అవ్వడం అలాగే ఎలాంటి అంతరాయం లేకుండా ఉండటాన్ని ఆశించవచ్చు, మరియు ఆడియో మీ ఇష్టానికి అనుగుణంగా ట్యూన్ చేయబడుతుంది  ఒకసారి జత చేసిన తర్వాత, అంత సవ్యంగా సాగిపోవాలి. అడాప్టివ్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిల్ (ANC) మోడ్ మీ పరిసరాలను వింటుంది మరియు మీ పర్యావరణానికి సరిపోయే తీవ్రతలో శబ్దాలను అందిస్తుంది. ఇది యూజర్‌కు అనుభవాన్ని సరళతరం చేస్తుంది, మరియు తెలివైన ANC నిశ్శబ్ద వాతావరణాల్లో తక్కువ శక్తిని తీసుకోవడం ద్వారా బ్యాటరీ జీవితకాలాన్ని కూడా మెరుగుపరుస్తుంది. అలాగే ఇది కేవలం ANC మాత్రమే కాకుండా, కాల్స్ కోసం 'Buds Pro' ఉపయోగించేటప్పుడు గాలి మరియు పరిసర ధ్వని తగ్గించబడుతుంది.  చిరాకు లేని వినికిడి అనుభవం యొక్క వాగ్దానం బ్యాటరీ జీవితకాలం మరియు ఛార్జింగ్‌కు కూడా వర్తిస్తుంది. కేసుతో పాటు, ANC ఆఫ్ చేయబడి ఉండగా 38 గంటల పాటు ప్లేటైమ్ మరియు ANCతో 28 గంటల ప్లేటైమ్ మీరు ఆశించవచ్చని OnePlus పేర్కొంది. అదనంగా, ప్రొప్రైటరీ వార్ప్ ఛార్జ్ టెక్ కేవలం 10 నిమిషాల్లో మీకు 10 గంటల ప్లేటైమ్‌ని అందిస్తుంది, క్వి వైర్ లెస్ ఛార్జింగ్‌కు మద్దతు మరియు కేసు కోసం మీ 9 ప్రోను ఛార్జర్‌గా ఉపయోగించే సామర్థ్యం గురించి చెప్పనవసరం లేదు. మీరు సుదీర్ఘ విమానం ప్రయాణంలో ఉన్నా లేదా రాత్రి మీ ఇయర్ బడ్స్ ఛార్జ్ చేయడం మర్చిపోయినా, ఇలాంటి చిన్న, నాణ్యమైన జీవిత కాలం అందించే లక్షణాలు ఈ పరికరాన్ని ప్రత్యేకమైన దానిగా నిలుపుతాయి.  Buds Pro యొక్క డిజైన్ నిజంగా ఆసక్తికరంగా ఉంది. రెండు-టోన్ల ఫినిష్ వాటిని పోటీలో ఉన్న ఇతర పరికరాలలో ప్రత్యేకంగా నిలుపుతుంది, మరియు స్క్వీజ్-టు-ట్రిగ్గర్ స్టెమ్‌లు మరింత సాంప్రదాయ ట్యాప్-టు-ట్రిగ్గర్ ఇంటర్ ఫేస్‌తో పోలిస్తే మంచి అప్‌గ్రేడ్ అని నేను అనుకుంటున్నాను. టచ్ సెన్సిటివ్ ఉపరితలాలు ఇయర్ బడ్స్ సర్దుబాటు చేసుకుంటూ ఉండే అలవాటు లేదా గ్లవుజులు ధరించే వారికి ఉపయోగించడానికి చిరాకు కలిగిస్తాయి.

  ఆహ్లాదమైన అనుభవానికి ప్రాధాన్యత ఇచ్చే వారికి, బడ్స్ ఫీచర్లను నిర్వహించడానికి HeyMelody యాప్ AudioID అనే ట్రిక్‌ను కలిగి ఉంది. మీరు చేయాల్సిందల్లా OnePlus Buds Proను మీ చెవుల్లోకి ప్లగ్ చేసి, AudioID ఫీచర్‌ను ట్రిగ్గర్ చేయండి. ప్రత్యేకంగా ఎంచుకున్న ట్రాక్ ప్లే చేయబడుతుంది మరియు మైక్రోఫోన్‌లు మీ చెవి యొక్క ప్రతిస్పందనను మ్యాప్ చేయడానికి సహాయపడతాయి, ఇది మీ చెవులకు కస్టమ్ ప్రొఫైల్‌ని సృష్టిస్తుంది. ప్లాన్ ప్రకారం విషయాలు జరుగుతాయని భావించినట్లయితే, సెట్ మెరుగైన శ్రవణ అనుభవాన్ని అందించాల్సిన కస్టమ్ ఈక్వలైజర్ ప్రొఫైల్‌ని ఎనేబుల్ చేస్తుంది.

  వాస్తవానికి, మీరు కావలనుకుంటే సెట్టింగ్‌లు మరియు నియంత్రణలను మాన్యువల్ గా మార్చుకోవచ్చు.  OnePlus, తన వాగ్దానాలను నిలబెట్టుకుంటుందని ఆశిద్దాం, అదే జరిగితే, Buds Pro ఇతర TWS సెట్లకు ఒక బెంచ్ మార్క్‌గా నిలవనుంది.
  Published by:Rekulapally Saichand
  First published:

  Tags: Oneplus

  ఉత్తమ కథలు

  తదుపరి వార్తలు