Home /News /technology /

WITH 6000MAH BATTERY SAMSUNG GALAXY F13 LAUNCHED IN INDIA AT A BUDGET PRICE KNOW PRICE SPECIFICATIONS SRD

Samsung Galaxy F13 : 6000mAh బ్యాటరీతో శాంసంగ్ కొత్త ఫోన్ లాంచ్.. బడ్జెట్ ధరలో అదిరిపోయే ఫీచర్లు..

Samsung Galaxy F13

Samsung Galaxy F13

Samsung Galaxy F13 : స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇండియా (Samsung India) మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) మొబైల్ ను ఇవాళ విడుదల చేసింది. బడ్జెట్ ధరలోనే అదిరిపోయే ఫీచర్లు ఈ స్మార్ట్ ఫోన్ సొంతం. పూర్తి వివరాలపై ఓ లుక్కేయండి.

ఇంకా చదవండి ...
    మన దేశంలో ప్రస్తుతం మిడ్ రేంజ్, ఫ్లాగ్‌షిప్ రేంజ్ ఫోన్లపై టాప్ స్మార్ట్‌ఫోన్ (Smartphone) బ్రాండ్లు దృష్టి పెడుతున్నాయి. అయితే ఇండియా(India)లో బడ్జెట్ ఫోన్ల హవా మాత్రం ఏమాత్రం తగ్గట్లేదు. దాదాపు అన్ని కంపెనీలో క్రమం తప్పకుండా తక్కువ ధరలో రీజనబుల్ ఫీచర్లతో బడ్జెట్ ఫోన్లు రిలీజ్ చేస్తున్నాయి. తాజాగా స్మార్ట్‌ఫోన్ దిగ్గజం శాంసంగ్ ఇండియా (Samsung India) మరో కొత్త స్మార్ట్ ఫోన్ ను రిలీజ్ చేసింది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 (Samsung Galaxy F13) మొబైల్ ను ఇవాళ విడుదల చేసింది. మంచి స్పెసిఫికేషన్లతో ఈ స్మార్ట్ ఫోన్ బడ్జెట్ ధరలో లభించనుంది. 6000mAh బ్యాటరీతో గెలాక్సీ ఎఫ్13 అత్యంత శక్తివంతమైన ఫోన్.

    Samsung Galaxy F13 స్పెసిఫికేషన్లు

    శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 6.6 ఇంచుల Full HD+ LCD డిస్‌ప్లే కలిగి ఉంది. బెజిల్, నాచ్ సాధారణం కంటే తక్కువగా ఉండడంతో లుక్ పరంగానూ ఈ మొబైల్ స్టైలిష్‌గా అనిపిస్తోంది. Samsung Galaxy F13 మొబైల్‌లో 6000mAh బ్యాటరీ ఉంటుంది. 15వాట్ల ఫాస్ట్ చార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. బాక్స్‌లోనే చార్జర్‌ను ఇవ్వనుంది Samsung. గరిష్ఠంగా 8జీబీ ర్యామ్ వేరియంట్ అందుబాటులోకి వస్తుందని శాంసంగ్ వెల్లడించింది. వర్చువల్‌గా ర్యామ్‌ను పొడిగించుకునే ఫీచర్ కూడా ఉంది. RAMని అక్షరాలా 8GB వరకు విస్తరించవచ్చు.

    Samsung Galaxy F13 డేటా స్విచ్చింగ్ ఫీచర్ కూడా ఉంటుంది. ఈ మొబైల్ మూడు కలర్ ఆప్షన్‌లలో లభ్యమవుతుంది. పింక్, బ్లూ, గ్రీన్‌ కలర్లలో అందుబాటులో ఉంది. ఈ వివరాలను శాంసంగ్ వెల్లడించింది. ఈ మొబైల్‌లో Exynos 850 ప్రాసెసర్‌ ఉంది. వెఆండ్రాయిడ్ 12 బేస్డ్ వన్‌యూఐ 4.1 ఓఎస్‌తో లాంచ్ అయింది.

    ఇది కూడా చదవండి : స్మార్ట్ ఫోన్ కొనాలనుకుంటున్న వారికి శుభవార్త.. ఈ రెడ్ మీ ఫోన్ పై రూ.5 వేలకు పైగా తగ్గింపు.. వివరాలివే

    ఇక పవర్ బటన్‌కే ఫింగర్‌ప్రింట్ సెన్సార్ ఉంటుంది. ఇక, Samsung Galaxy F13లో 50-మెగాపిక్సెల్ ట్రిపుల్ రియర్ కెమెరా అందుబాటులో ఉంది. ఇందులో 5-మెగాపిక్సెల్ అల్ట్రావైడ్ లెన్స్, 50-మెగాపిక్సెల్ ప్రధాన కెమెరా మరియు 2-మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఉన్నాయి. సెల్ఫీ కోసం, ఈ ఫోన్‌లో 5 మెగాపిక్సెల్ అల్ట్రా-వైడ్ లెన్స్ ఉంది.

    శాంసంగ్ గెలాక్సీ ఎఫ్13 ధర :

    Galaxy F13 ధర కూడా సామాన్యులకు అందుబాటులోనే ఉంది. 4GB + 64GB వేరియంట్ ధర రూ. 11,999 మరియు 4GB + 128GB వేరియంట్ ధర రూ. 12,999 లకి లభిస్తోంది. కానీ, లాంఛింగ్ ఆఫర్ కింద ఫోన్ ప్రారంభ ధర రూ. 10,999కి అందుబాటులోకి వస్తోంది.
    Published by:Sridhar Reddy
    First published:

    Tags: Samsung, Samsung Galaxy, Smart phones, Tech news

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు