Home /News /technology /

WINZO CARRIE MINNIE IS THE NUMBER ONE YOUTUBER IN ASIA AS THE BRAND AMBASSADOR OF WINZO BK TA

Winzo : ‘విన్‌జో’ బ్రాండ్ అంబాసిడర్‌గా ఆసియాలోనే నెంబర్ వన్ యూట్యూబర్ క్యారీ మినాటీ..

’విన్‌జో’ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘క్యారీ మినాటీ’ (File/Photo)

’విన్‌జో’ బ్రాండ్ అంబాసిడర్‌గా ‘క్యారీ మినాటీ’ (File/Photo)

Winzo Brand Ambassador Carrie Minnie | దేశంలోని అతి పెద్ద ఇంటెరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ అయిన, విన్ జో, ఆసియాలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచిన ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ అజయ్ నగర్ అలియాస్ క్యారీ మినాటీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది.

ఇంకా చదవండి ...
Winzo :  దేశంలోని అతి పెద్ద ఇంటెరాక్టివ్ ఎంటర్టైన్మెంట్ ప్లాట్‌ఫార్మ్ అయిన, విన్ జో, ఆసియాలోనే నెంబర్ ఒన్ స్థానంలో నిలిచిన ఇండిపెండెంట్ కంటెంట్ క్రియేటర్ అజయ్ నగర్ అలియాస్ క్యారీ మినాటీని తమ బ్రాండ్ అంబాసిడర్‌గా ఎంచుకుంది. న్యూ ఢిల్లీలో తమ హెడ్ క్వార్టర్స్ ను కలిగి ఉన్న ఈ ఇంటారాక్టివ్ సోషియల్ గేమింగ్ స్టార్టప్, సోషియల్ గేమింగ్ రంగంలో ముందంజలో ఉంటూ, ఈ వ్యూహాత్మక భాగస్వామ్యంతో గేమింగ్ కమ్యూనిటీలో బలమైన స్థానాన్నిఏర్పరుచుకోనుంది.
ఈ వ్యూహాత్మకమైన సహకారంలో భాగంగా, కంటెంట్ క్రియేటర్, విన్ జో కోసం ప్రత్యేకమైన, సాపేక్షమైన మరియు ఇంటారాక్టివ్ అయిన గేమింగ్ ప్రధానమైన కంటెంట్‌ని, తన స్ట్రీమింగ్ చానల్ అయిన క్యారీ ఇస్ లైవ్ లో విడుదల చేయనున్నారు.

అలాగే తన ప్రధాన యూట్యూబ్ చానల్ అయిన క్యారీ మినాటీలో కూడా ప్రత్యేకంగా అనుసంధానం చేసారు. దాదాపు 50 మిలియన్ల ఫ్యాన్ ఫాలోయింగ్ గల, పొట్ట చెక్కలయ్యేలా నవ్వించే అసాధారణమైన కామెడీ స్కిట్లు, వీడియోలతో, శరవేగంగా దుసుకెళ్తున్నఈ డిజిటల్ సంచలనం..  6 కంటే ఎక్కువ ఫార్మాట్లలో మరియు 12 వ్యావహారిక భాషలలో విస్తరించి ఉన్న విన్ జో యొక్క పరిధిని సుమారు 75 మిలియన్ల సంఖ్యలో ఉన్న తమ వినియోగదారులకు చేరువ చేస్తుంది.

HBD Krishnam Raju : హ్యాపీ బర్త్ డే రెబల్ స్టార్ కృష్ణంరాజు.. ఈయన నట ప్రస్థానంలో కీలక ఘట్టాలు..


తాజా ఇండస్ట్రీ నివేదికల ప్రకారం, భారతీయ గేమింగ్ రంగం $1.5 బిలియన్ డాలర్ల ఆదాయాన్ని గడిస్తోంది, అలాగే 2025 నాటికి ఇది ఒక ట్రిలియన్ డాలర్ ఇండస్ట్రీగా అభివృద్ధి చెందుతుందనే అంచనాలు ఉన్నాయి. సరసమైన ధరలో ఇంటెర్నెట్ లభించడం.. అలాగే స్మార్ట్ ప్జోన్ల వినియోగంలో పెరుగుదల, వ్యావహారిక భాషలో సామాజిక సంబంధమైన కంటెంట్ ను అందించడంపై ప్రత్యేకంగా దృష్టి పెట్టడం వంటివి ఇందులో ప్రధాన భూమికను పోషించాయి. ప్రపంచవ్యాప్తంగా జరిగే ప్రతి ఐదు మొబైల్ గేమ్ డౌన్లోడ్లలో ఒకటి భారతదేశం నుండి జరుతుండడం ఆసక్తికరమైన విషయం. 2021 మొదటి అర్ధ సంవత్సరంలో లో 4.8 మిలియన్ల డౌన్‌లోడ్ భారతదేశం, యు.ఎస్ మరియు బ్రెజిల్ ల కంటే ముందుకు దూసుకెళ్ళి, మొదటి స్థానంలో నిలిచింది.

BalaKrishna - Akhanda : ‘అఖండ’ 50 డేస్ 103 థియేటర్స్.. రూ. 200 కోట్ల క్లబ్బులో బాలయ్య బీభత్సం..


భారతదేశంలోనే డిజిటల్ కమ్యునిటీలో ప్రధానమైన ఇన్నోవేటర్లలో ఒకరుగా ప్రఖ్యాతి గాంచిన క్యారీ మినాటీ కి, మొత్తం మీద 50 మిలియన్ల కంటే ఎక్కువ డిజిటల్ ఫాలోయింగ్ ఉంది. సాటిలేని రోస్టింగ్ మరియు లైవ్ గేమింగ్ ఆప్టిట్యూడ్ కలిగిన ఇతను, ఆసియాలోనూ మరియు భారత దేశంలోనూ అత్యధికంగా సబ్ స్కైబ్ చేయబడుతున్న యూటూబర్ అన్న టైటిల్ ని సంపాదించుకోవడమే కాక, తన స్థానాన్ని నిర్విరామంగా కొనసాగిస్తున్నారు.

Chiranjeevi - Ravi Teja : చిరు, బాబీ సినిమాలో యాక్ట్ చేయడానికి రవితేజ రికార్డు రెమ్యునరేషన్..

ఢిల్లీకి చెందిన 22- ఏళ్ళ వయస్సు గల, యూట్యూబర్, స్ట్రీమర్, గేమర్ మరియు ర్యాపర్ అయినటువంటి క్యారీ మినాటీ, ఇలా పేర్కొన్నారు, “విన్ జో తో భాగస్వామ్యం పొందినందుకు నేను చాలా ఆనందిస్తున్నాను. అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ట్రిలియన్ డాలర్ గేమింగ్ కమ్యూనిటీకి భారత దేశం కేంద్ర స్థానంలో ఉంది. సోషియల్ గేమింగ్ కమ్యూనిటీ యొక్క అచంచలమైన సామర్థ్యాన్ని నిరూపించేలా.. ప్రపంచవ్యాప్తంగా 40% డౌన్‌లోడ్‌లతో భారతదేశం , మొబైల్ గేమ్స్ యొక్క అతిపెద్ద మార్కెట్ గా మారింది. విన్ జోకు మరియు నాకు మధ్య, ప్రధాన సామర్థ్యాలు మరియు బ్రాండ్ విలువలలో సారూప్యతలు ఉండడం వల్ల, నేను ఈ భాగస్వామ్యం ద్వారా వివిధ మార్గాలను అనుసరిస్తూ, దేశంలోని మారుమూల ప్రాంతాలలో ఉన్నవారిని సైతం కనెక్ట్ చేసేటువంటి, సాంస్కృతికపరమైన, సంబంధిత కంటెంట్ లను సృష్టించాలని అనుకుంటున్నాను.

Prabhas - Radhe Shyam : 1970 నాటి ఇట‌లీని రాధే శ్యామ్ లో ఎలా క్రీయేట్ చేశారు..? ఆర్ట్ డైరెక్ట‌ర్ చెప్పిన విశేషాలు.. ?

ఎదురులేని ఈ ఇండస్ట్రీని ఒక బలమైన వ్యవస్థగా అభివృద్ధి చేసేందుకు, ప్రస్తుత వ్యాపారరంగంలోని అనుభవఙ్ఞులు చేతులు కలపడం చాలా ప్రధానమైన అంశం.”
ఈ భాగస్వామ్యం గురించి మాట్లాడుతూ, విన్ జో యొక్క్ సహ వ్యవస్థాపకురాలైన సౌమ్య సింగ్ రాథోర్, ఇలా అన్నారు, “ ప్రపంచ మార్కెట్లో , భారతదేశం ప్రస్తుతం ఇంటెరాక్టివ్ ఎంటర్టైన్ మెంట్ రంగంలో ఒక కీలకమైన మార్కెట్ గా రూపుదిద్దుకుంటోంది. గేమింగ్ కూడా చాలా వేగంగా అభివృద్ధి చెందుతోంది, ఇది ఇప్పుడు కేవలం ఆటలకు మాత్రమే పరిమితం కాదు. లైవ్ స్ట్రీమింగ్ మరియు కమ్యూనిటీ ఎంగేజ్ మెంట్ యొక్క రాకతో, 360-డిగ్రీల గేమింగ్ ఎకోసిస్టమ్ గా రూపుదిద్దుకుంది, ఇందులో క్యారీ మినాటీ దిట్ట అనే చెప్పాలి. ఆయనతో కలిసి పనిచేయడం మాకు ఆనందంగా ఉంది. భారతదేశ వ్యాప్తంగా సాంస్కృతికపరమైన కంటెంట్ ను ప్రోత్స్దహించే దిశగా, విజయం సాధించాలన్నది మా సమిష్టి అభిప్రాయం.”

Suresh Gopi Corona Positive : మలయాళ స్టార్ హీరో సురేష్ గోపీకి కరోనా పాజిటివ్..

విన్ జో గురించి
విన్ జో అన్నది భారతదేశంలోని అతి పెద్ద సోషియల్ గేమింగ్ మరియు ఎంటర్టైన్ మెంట్ ప్లాట్ఫార్మ్. 2018 మొదట్లో ప్రారంభమైన ఈ కంపెనీ, థర్డ్ పార్టీ డెవలపర్లతో కలసి తమ ఆండ్రాయిడ్ యాప్ లో గేమ్స్‌ని హోస్ట్ చేస్తుంది. ఇక్కడ యూజర్లు వ్యక్తిగతమైన మల్టీ ప్లేయర్ అనుభవాలను ఆనందించవచ్చు. 75 మిలియన్ యూజర్లు కల ఈ ప్లాట్ఫార్మ్, ఇంగ్లిష్, హిందీ, గుజరాతీ, మరాఠీ, బెంగాలీ, భోజ్ పురీ వంటి 12 భాషలలో లభిస్తోంది. ఒక నెలలో 100 కంటే ఎక్కువ గేమ్‌లలో 2.5 బిలియన్ మైక్రో ట్రాన్సాక్షన్లకు విన్ జో ప్లాట్ఫార్మ్ లో అవకాశం ఉంది. భారదేశంలోని టయర్ II నుండి IV నగరాలలో ఆసక్తికరమైన గేమర్లు మరియు గేమింగ్ ఇన్ఫ్లుయన్సర్ల కమ్యూనిటీని అభివృద్ధి పరిచే దిశగా విన్ జో కృషి చేస్తోంది. ఒక ప్రత్యేకమైన ట్రాన్సాక్షన్ మోడల్ తో, భవిష్యత్తులో భారతీయ గేమింగ్ ఎకో సిస్టమ్ లో ఒక సాంస్కృతిపరమైన మరియు వినోధభరితమైన అనభవాన్ని అందించే దిశగా విన్ జో ప్లాట్‌ఫార్మ  దృష్టి సారిస్తోంది.

(న్యూస్ 18 సీనియర్ కరెస్పాండెంట్.. బాలకృష్ణ . ఎం (Balakrishna Medabayani)  )
Published by:Kiran Kumar Thanjavur
First published:

Tags: Bollywood news, Tollywood

ఉత్తమ కథలు

తదుపరి వార్తలు