హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Windows PC: విండోస్ పీసీ యూజర్లకు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌.. మీ సిస్టమ్‌ను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..

Windows PC: విండోస్ పీసీ యూజర్లకు ప్ర‌భుత్వం హెచ్చ‌రిక‌.. మీ సిస్టమ్‌ను ఇప్పుడే అప్‌డేట్ చేసుకోండి..

Windows PC

Windows PC

Windows PC: విండోస్ పీసీ యూజర్లకు అలర్ట్. ఒక కొత్త సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ వల్ల ఇప్పుడు విండోస్ పీసీ (Windows PC) యూజర్ల భద్రత ప్రమాదంలో పడింది.

  • Trending Desk
  • Last Updated :
  • Hyderabad, India

విండోస్ పీసీ (Windows PC) యూజర్లకు అలర్ట్. ఒక కొత్త సెక్యూరిటీ ప్రాబ్లమ్‌ వల్ల ఇప్పుడు విండోస్ పీసీ (Windows PC) యూజర్ల భద్రత ప్రమాదంలో పడింది. దీంతో విండోస్ పీసీ సిస్టమ్‌లను వెంటనే అప్‌డేట్ చేయాలని హెచ్చరిస్తోంది భారత ప్రభుత్వం (Indian Government). కేంద్ర ఐటీ శాఖ ఆధ్వర్యంలోని ఇండియన్ కంప్యూటర్ ఎమర్జెన్సీ రెస్పాన్స్ టీమ్ (CERT-In).. భారత పీసీ యూజర్ల హెచ్చరిస్తూ ఒక కొత్త భద్రతా సమస్య గురించి వెల్లడించింది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ (Microsoft Defender)లో కొత్త భద్రతా సమస్య ఉన్నట్లు CERT-In పేర్కొంది. మైక్రోసాఫ్ట్ డిఫెండర్‌ అనేది వైరస్, మాల్వేర్ వంటి వాటి నుంచి పీసీని ప్రొటెక్ట్ చేసే ఒక సాఫ్ట్‌వేర్. అందువల్ల పీసీ యూజర్లు దీన్ని వెంటనే అప్‌డేట్ చేసుకోవాలి.


ఈ సెక్యూరిటీ సమస్య చాలా ప్రమాదకరమైనదని.. దీనివల్ల సెక్యూరిటీ సిస్టమ్స్ అలర్ట్ కాకుండానే పీసీని హ్యాకర్లు యాక్సెస్ చేయగలుగుతారని CERT-In తెలిపింది. 'హై' కేటగిరీ కింద ఈ సమస్యను గుర్తించింది. విండోస్ డిఫెండర్ క్రెడెన్షియల్ గార్డ్ టూల్‌లో విండోస్ యూజర్లు సెక్యూరిటీ సమస్యలను ఎదుర్కొంటున్నారని CERT-In పోస్ట్ పేర్కొంది.


ఇది చాలా విండోస్ పీసీలలో ముందే ఇన్‌స్టాల్ అయి వస్తుంది. "Windows డిఫెండర్ క్రెడెన్షియల్ గార్డ్‌లో ప్రివిలేజ్ ఎస్కలేషన్, సెక్యూరిటీ బైపాస్ లో సాంకేతిక లోపాలున్నాయి. ఇది లోకల్ అథెంటికెడ్ హ్యాకర్ సెక్యూరిటీ పరిమితులు క్రాస్ చేసి.. టార్గెటెడ్ సిస్టమ్‌పై ఉన్నత అధికారాలను పొందేందుకు వీలు కల్పిస్తుంది." అని CERT-In వెల్లడించింది.దీని అర్థం దాడి చేసే వ్యక్తి మీ సిస్టమ్‌లోని మొత్తం డేటాను యాక్సెస్ చేయగలరు. అలానే సిస్టమ్‌లో నడుస్తున్న మెషీన్ లేదా విండోస్ డిఫెండర్‌ను అప్రమత్తం చేయకుండా అన్ని భద్రతా సెట్టింగ్‌లను బైపాస్ చేయగలరు. Windows డిఫెండర్‌లోని సమస్య చాలా మంది ప్రజలను ప్రభావితం చేస్తుంది.


ఇది కూడా చదవండి : యూట్యూబ్‌లో మీరేం చూశారు? హిస్టరీ మొత్తం ఆటోమెటిక్‌గా డిలిట్ చేయండిలా


ఎందుకంటే ఈ ప్రాబ్లమ్‌ వల్ల చాలా విండోస్ 10 వెర్షన్స్ ప్రభావితం అవుతాయి. Windows 11, విండోస్ సర్వర్ వెర్షన్ 2022, 2019, 2016 వెర్షన్‌లను వాడే వారికి కూడా ఈ సమస్య ఒక ప్రమాదంలా పరిణమిస్తుంది కాబట్టి వీరందరూ వీలైనంత త్వరగా సిస్టమ్ సెక్యూరిటీని అప్‌డేట్ చేసుకోవడం మంచిది.


ఈ లోపం వల్ల హ్యాకర్లకు బాధితులు అవ్వకుండా ఉండాలంటే.. విండోస్ పీసీ యూజర్లు తమ సిస్టమ్‌లను చాలా సేఫ్ గా ఉంచుకోవాలి. మైక్రోసాఫ్ట్ ఇప్పటికే ఈ సమస్యకు ఓ సాఫ్ట్‌వేర్ ఫిక్స్ జారీ చేసిందని.. Windows రకరకాల వెర్షన్లను యూజ్ చేసే వారు వెంటనే వారి సిస్టమ్‌లను అప్‌డేట్ చేయాలని CERT-In తెలియజేస్తోంది. మైక్రోసాఫ్ట్ ఈ విండోస్ డిఫెండర్ ప్యాచ్ వివరాలను మైక్రోసాఫ్ట్ సెక్యూరిటీ బులెటిన్‌లో షేర్ చేసింది.

Published by:Sridhar Reddy
First published:

Tags: Central Government, Tech news, Windows

ఉత్తమ కథలు