Windows 11: ఉచితంగా విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ, ఫైనల్​ వెర్షన్లు.. మీ డెస్క్​టాప్​లో ఇలా డౌన్ లోడ్ చేసుకోండి..

Windows 11

మైక్రోసాఫ్ట్ తొందర్లోనే విండోస్ 11 అప్ డేట్ ని అందించనుంది. మీరు ఇప్పటికే విండోస్ 10 సిస్టమ్ ని ఉపయోగిస్తున్నట్లైతే ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్ గ్రేడ్ చేయించుకోవాలి. ఇది ఉచితంగానే లభిస్తుంది.

  • Share this:
మైక్రోసాఫ్ట్ తొందర్లోనే విండోస్ 11 అప్ డేట్ ని అందించనుంది. మీరు ఇప్పటికే విండోస్ 10 సిస్టమ్ ని ఉపయోగిస్తున్నట్లైతే ఆపరేటింగ్ సిస్టమ్ ని అప్ గ్రేడ్ చేయించుకోవాలి. ఇది ఉచితంగానే లభిస్తుంది. ఇది అధికారికంగా ఇంకా విడుదల కాలేదు. ఈ ఏడాది ఆఖరి వరకు ఇది విడుదలయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. అది అందుబాటులోకి రాగానే యూజర్లు ఈ కొత్త ఆపరేటింగ్ సిస్టమ్ కి అప్ గ్రేడ్ చేసుకునే వీలు కలుగుతుంది. విండోస్ 9 నుంచి 10 కి మారినట్లుగానే ప్రస్తుతం కూడా మరో కొత్త ఓఎస్ కి మారాల్సిన అవసరం ఉంటుంది. దీని కోసం మీ డెస్క్ టాప్ లేదా లాప్ టాప్ కొన్ని అవసరమైన లక్షణాలను కలిగి ఉండాలి.

ఒకవేళ మీరు విండోస్ ఇన్ సైడర్ ప్రోగ్రాం మెంబర్లు అయితే మీరు ముందుగానే విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ ని డౌన్ లోడ్ చేసుకొని అందులోని కొన్ని కొత్త ఫీచర్లు ప్రయత్నించే వీలుంటుంది. ఇందులో భాగంగా వర్చువల్ డెస్క్ టాప్, స్నాప్ లేఅవుట్స్, విడ్జెట్స్, మైక్రోసాఫ్ట్ స్టోర్ వంటివన్నీ ప్రయత్నించవచ్చు. అయితే ఇందుకోసం మీ ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ విండోస్ 11 కి అప్ గ్రేడ్ చేసుకోవడానికి అర్హత సాధిస్తుందా లేదా తెలుసుకోవాలి. ఇందుకోసం మైక్రోసాఫ్ట్ సైట్ ని చెక్ చేసి స్పెసిఫికేషన్స్ తెలుసుకోవచ్చు.

విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్ ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
విండోస్ 11 ఇన్ సైడర్ ప్రోగ్రాం ద్వారా ఫస్ట్ ఇన్ సైడర్ ప్రివ్యూని డౌన్ లోడ్ చేసుకునే వీలుంటుంది. అయితే బీటా వర్షన్లలో బగ్స్ ఉంటాయి కాబట్టి మీ ప్రైమరీ డివైజ్ లో కాకుండా టెస్టర్ డివైజ్ లో దీన్ని ప్రయత్నించడం మంచిది. విండోస్ 11 ఇన్ సైడర్ ప్రివ్యూ బిల్డ్ డౌన్ లోడ్ చేయాలంటే ఈ కింది స్టెప్స్ ఫాలో అవ్వాలి.

1. మీ సిస్టమ్ లో విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టమ్ లైసెన్స్డ్ వెర్షన్ ఉండేలా చూసుకోవాలి.
2. సెట్టింగ్స్ ఓపెన్ చేసి అప్ డేట్ అండ్ సెక్యూరిటీ ఎంచుకోవాలి. అందులో విండోస్ ఇన్ సైడర్ ప్రోగ్రాం ఎంచుకోవాలి.
3. ఆ తర్వాత ఒక అకౌంట్ ఎంచుకొని ‘+’సెలెక్ట్ చేసి మైక్రోసాఫ్ట్ అకౌంట్ తో కనెక్ట్ చేసి కంటిన్యూ పై క్లిక్ చేయాలి.
4. అన్ని సూచనలను పాటించాలి. ఆ తర్వాత మీకు కావాల్సిన ఛానల్ ఎంచుకోవాలి. ఇందులో బీటా ఛానల్, రిలీజ్ ప్రివ్యూ ఛానల్, డెవ్ ఛానల్ లు ఉంటాయి.
5. ప్రైవసీ స్టేట్ మెంట్, టర్మ్స్, అండ్ కండిషన్స్ అన్నీ చదివి కన్ఫర్మ్ పై క్లిక్ చేయాలి.
6. ఆ తర్వాత సిస్టమ్ ని రీస్టార్ట్ చేయాలి. దీనికి ముందు డేటా సెట్టింగ్స్ అన్నీ సరిగ్గా ఉన్నాయో లేదో చెక్ చేయాలి. ప్రివ్యూ బిల్డ్స్ డౌన్ లోడింగ్ కి ఇవి సరిగ్గా ఉండడం అవసరం.
7. ఆ తర్వాత సెట్టింగ్స్ లోకి వెళ్లి అప్ డేట్ అండ్ సెక్యూరిటీ, విండోస్ అప్ డేట్ క్లిక్ చేయాలి. చెక్ ఫర్ అప్ డేట్స్ పై క్లిక్ చేసి లేటెస్ట్ ఇన్ సైడర్ ప్రివ్యూ బేస్డ్ అని కనిపిస్తుంది. అది ఎంచుకోవాలి.

విండోస్ 11 ఫైనల్ వర్షన్ ఎలా డౌన్ లోడ్ చేయాలంటే..
విండోస్ 11 అందరికీ అందుబాటులోకి రాగానే అచ్చం ఇలాగే సిస్టమ్ సెట్టింగ్స్ లోని వెళ్లి అప్ డేట్ అండ్ సెక్యూరిటీ పై క్లిక్ చేయాలి. చెక్ ఫర్ అప్ డేట్స్ పై క్లిక్ చేయాలి. విండోస్ 11 అప్ డేట్ మీ ల్యాప్ టాప్ లేదా డెస్క్ టాప్ కి కంపాటబుల్ అయితే అది మీకు కనిపిస్తుంది. అప్ డేట్ టు విండోస్ 11 అనే ఫీచర్ మీకు కనిపిస్తే దానిపై క్లిక్ చేసి డౌన్ లోడ్ చేసి ఇన్ స్టాల్ చేసుకోవచ్చు.
Published by:Sumanth Kanukula
First published: