Home /News /technology /

WINDOWS 11 NOW AVAILABLE INDIA KNOW UPGRADE HOW TO DOWNLOAD INSTALL EVK

Windows 11 : విండోస్ 11 వ‌చ్చేసింది.. ఫీచ‌ర్స్ ఇవే

విండోస్ 11 (ఫోటో ట్విట్ట‌ర్‌)

విండోస్ 11 (ఫోటో ట్విట్ట‌ర్‌)

వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విండోస్ 11 అప్‌డేట్ వ‌చ్చేసింది. వినియోగ‌దారుల‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియ‌న్‌ మార్కెట్‌లోకి విండోస్ 11ను విడుద‌ల చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ట్విట్ట‌ర్ (Twitter) ద్వారా వెల్ల‌డించింది.

ఇంకా చదవండి ...
    వినియోగ‌దారులు ఎంతో ఆస‌క్తిగా ఎదురు చూస్తున్న విండోస్ 11 అప్‌డేట్ వ‌చ్చేసింది. వినియోగ‌దారుల‌కు మైక్రోసాఫ్ట్ గుడ్‌న్యూస్ చెప్పింది. ఇండియ‌న్‌ మార్కెట్‌లోకి విండోస్ 11ను విడుద‌ల చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ (Microsoft) ప్ర‌క‌టించింది. దీనికి సంబంధించిన వివ‌రాల‌ను ట్విట్ట‌ర్ (Twitter) ద్వారా వెల్ల‌డించింది. ఈ నేప‌థ్యంలో అంద‌రిలో ఒక‌టే ఆలోచ‌న విండోస్ 11 (Windows 11) ఫీచ‌ర్స్ ఏంటీ?.. ప్ర‌స్తుతం వినియోగిస్తున్న ల్యాప్‌టాప్‌ (Laptops), డెస్క్‌టాప్‌ (Desktop)ల‌కు ఈ వ‌ర్ష‌న్ (Version) ప‌ని చేస్తుందా. ప్ర‌స్తుతం ఇప్పుడిప్పుడే విండోస్ 10 వ‌ర్ష‌న్‌కి చాలా మంది మారారు. ఇక విండోస్ 11కు అప్‌డేట్ అవ్వాలంటే ఎంత స‌మ‌యం ప‌డుతుందో.. అని మార్కెట్ వ‌ర్గాలు అభిప్రాయ ప‌డుతున్నాయి. కొన్ని సాంకేతిక యాప్‌ల ద్వారా మ‌న ల్యాప్‌టాప్‌లు, పీసీ విండోస్‌ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చంటున్నారు టెక్కీలు.

    విండోస్ 11ను డౌన్‌లోడ్ చేసుకోనే ముందు మీ ల్యాప్‌టాప్‌, పీసీ క్యాప‌బిలిటీస్‌ను పరిశీలించుకోవాలి. పీసీ హెల్త్‌ చెకప్‌ వంటి యాప్‌ల ద్వారా మన దగ్గరున్న ల్యాపీ లేదా పీసీ విండోస్‌ 11 వెర్షన్‌కి అనువుగా ఉందా లేదా అనే విషయం తెలుసుకోవచ్చు.



    మీ పీసీ లేదా ల్యాప్‌టాప్ విండోస్ 11కు అనుగుణంగా ఉన్న‌ట్టు నిర్ధారించుకొన్న త‌రువాత‌. సెట్టింగ్స్‌లోకి వెళ్లాలి. సెక్యూరిటీ అండ్‌ అప్‌డేట్‌ ఆప్షన్‌ని ఎంచుకోవాలి. అక్కడున్న విండోస్‌ అప్‌డేట్‌లో అప్‌డేట్‌పై క్లిక్‌ చేయాలి. సిస్టమ్‌ అప్‌డేట్‌కి అనువుగా ఉంటే అక్కడ డౌన్‌లోడ్‌ ఆప్షన్‌ కనిపిస్తుంది. డౌన్‌లోడ్‌ చేసుకుని ఇన్‌స్టాల్‌ చేస్తే.. సరికొత్త ఫీచర్లు అందుబాటులోకి వస్తాయి.

    Apple iPhone 12 : ఫ్లిప్‌కార్ట్ అదిరిపోయే ఆఫ‌ర్‌.. రూ.38,699 ధరకే ఐఫోన్‌ 12


    ఇప్పటికే ఆసూస్‌, హెచ్‌పీ, లెనోవాల నుంచి త్వరలో మార్కెట్‌లోకి రాబోతున్న ల్యాప్‌టాప్‌, పర్సనల్‌ కంప్యూటర్లకు ఇప్పటికే విండోస్‌​ 11ని అందించినట్టు మైక్రోసాఫ్ట్‌ తెలిపింది. అతి త్వరలోనే ఏసర్‌, డెల్‌లు కూడా ఈ జాబితాలో చేరుతాయని ఆ సంస్థ ప్రకటించింది.

    విండోస్ 11 ఫీచ‌ర్స్ ఇవే..
    - మైక్రోసాఫ్ట్‌ చెబుతున్నదాని ప్రకారం యూజర్‌ ఇంటర్‌ఫేస్‌లో చాలా మార్పుల‌ను ప్ర‌వేశ‌పెట్టింది.
    - వేగంలో, RAM వినియోగంలో ప‌నితీరు విండోస్ 10 కంటే మెరుగ్గా ఉంటుంది.
    - విండ్స్ స్టార్ట్ బ‌ట‌న్‌, టాస్క్‌బార్‌లో ప‌లు మార్పులు ప్ర‌వేశ‌పెట్టింది.
    - విండోస్‌ 8 నుంచి విండోస్ 10 వస్తోన్న లైవ్‌ టైటిల్స్‌ ఆప్షన్‌ని తొలగించారు.
    - అద‌నంగా వినియోగ దారుల కోసం మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌, డైరెక్ట్‌ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
    - మైక్రోసాఫ్ట్‌ స్టోర్‌ యాప్‌, డైరెక్ట్‌ స్టోరేజీ, ఆటో హెచ్‌డీఆర్‌ తదితర ఫీచర్లు కూడా ఉన్నాయి.
    Published by:Sharath Chandra
    First published:

    Tags: Latest Technology, Microsoft, Windows 11

    ఉత్తమ కథలు

    తదుపరి వార్తలు