• Home
  • »
  • News
  • »
  • technology
  • »
  • WINDOWS 11 MAY BE AVAILABLE AS A FREE UPGRADE FOR WINDOWS 7 WINDOWS 8 USERS MK GH

Windows 11: విండోస్‌ 7, విండోస్‌ 8 వాడుతున్నారా...అయితే మీకు గుడ్‌ న్యూస్‌

ప్రతీకాత్మక చిత్రం

విండోస్‌ 10 తర్వాత కొత్త ఓఎస్‌ తీసుకొచ్చే ఆలోచన లేదని, ఏ మార్పులు చేసినా ఈ ఆఖరి ఓఎస్‌లోనే చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ టీమ్‌ మనసు మార్చుకొని విండోస్‌ 11ను రూపొందించింది. దీనినే త్వరలో తీసుకొస్తోంది.

  • Share this:
విండోస్‌ ఆపరేటింగ్‌ సిస్టమ్‌లో కొత్త వెర్షన్‌ను ఈ నెల 24న లాంచ్‌ చేయబోతున్న విషయం తెలిసిందే. విండోస్‌ 11 పేరుతో ఈ ఓఎస్‌ను తీసుకొస్తున్నారు. అయితే దీనికి సంబంధించి ఓ ఆసక్తికరమైన విషయం బయటకు వచ్చింది. అదేంటంటే... విండోస్‌ పాత వెర్షన్‌ వాడుతున్న వారికి ఈ కొత్త ఓఎస్‌ను ఫ్రీ అప్‌డేట్‌ కింద ఇస్తారట. అందులో కొత్తేముంది విండోస్‌ 10కి ఎలాగూ ఇస్తారు కదా అంటారా. అయితే అంతకంటే ముందు వెర్షన్లకు కూడా ఇస్తారనేది కొత్త విషయమే కదా.

విండోస్‌ 10 తర్వాత కొత్త ఓఎస్‌ తీసుకొచ్చే ఆలోచన లేదని, ఏ మార్పులు చేసినా ఈ ఆఖరి ఓఎస్‌లోనే చేస్తారని గతంలో వార్తలొచ్చాయి. అయితే మైక్రోసాఫ్ట్‌ టీమ్‌ మనసు మార్చుకొని విండోస్‌ 11ను రూపొందించింది. దీనినే త్వరలో తీసుకొస్తోంది. అయితే ఈ ఓఎస్‌కు సంబంధించి కొన్ని వివరాలు ఇంటర్నెట్‌లో బయటికొచ్చేశాయి. కొన్ని టెక్‌ వెబ్‌సైట్లు, నిపుణులు విండోస్‌ 11కు సంబంధించి కొన్ని ఆసక్తికర విషయాలను తవ్వి తీస్తున్నారు.

విండోస్‌11 కోడింగ్‌లోని కొన్ని అంశాలను టెక్‌ నిపుణులు బయటకు తీశారు. వాటి ప్రకారం చూస్తే విండోస్‌ 10తోపాటు విండోస్‌ 7, విండోస్‌ 8.1 ఆపరేటింగ్‌ సిస్టమ్‌ వాడుతున్నవాళ్లు ఉచితంగా విండోస్‌ 11కు అప్‌గ్రేడ్‌ అవ్వొచ్చట. అయితే ఈ జాబితాలో విండోస్‌ 8 లేదు. వాళ్లు ఉచిత అప్‌గ్రేడేషన్‌ కోసం తొలుత విండోస్‌ 8.1కి రావాలి. ఆ తర్వాత విండోస్‌ 11కి అప్‌డేట్‌ అవ్వాల్సి ఉంటుంది. గతంలోనూ మైక్రోసాఫ్ట్‌ విండోస్‌ 10 విషయంలోనూ ఇలానే ఉచిత అప్‌గ్రేడేషన్‌ను తీసుకొచ్చింది.

విండోస్‌ 11 వచ్చిన వెంటనే... విండోస్‌ 10 వారికి ఓటీఏ ద్వారా అప్‌డేట్‌ ఇచ్చేస్తారు. మరి విండోస్‌ 7, విండోస్‌ 8.1 వారికి కూడా అప్పుడే అందుబాటులోకి తెస్తారా? లేక కొన్ని రోజులు ఆగాక తీసుకొస్తారా అనేది తెలియాల్సి ఉంది. ప్రస్తుతం ప్రపంచంలో విండోస్‌ 10 తర్వాత ఎక్కువ మంది వాడుతున్న ఆపరేటింగ్‌ సిస్టమ్‌... విండోస్‌ 7 అట. అందుకే వినియోగదారుల్ని వదులుకోకూడదనే మైక్రోసాఫ్ట్‌ వాళ్లకు కూడా అప్‌గ్రేడేషన్‌ను ఇస్తోందని సమాచారం.

విండోస్‌ ఓఎస్‌ను వాడుతున్నవాళ్ల శాతం పరిశీలిస్తే... విండోస్‌ 7ను 15.52 శాతం యూజర్లు వాడుతున్నారు. విండోస్‌ 8.1 ను 3.44 శాతం మంది యూజ్‌ చేస్తున్నారు. ఇక విండోస్‌ 8ను అతి తక్కువగా 1.27 శాతం మంది వినియోగిస్తున్నారు. వీళ్లకు విండోస్‌ 11 రావడం పక్కా అనేది తాజా సమాచారం. మెరుగైన సేవలు, సెక్యూరిటీ కోసం అందరూ విండోస్‌ 10కి రండి అంటూ మైక్రోసాఫ్ట్‌ చాలా రోజులుగా చెబుతున్నా, చాలామంది ఇటువైపు చూడటం లేదు.మరి విండో స్‌ 11 వస్తే... ఏం చేస్తారు అనేది చూడాలి.
Published by:Krishna Adithya
First published: