హోమ్ /వార్తలు /టెక్నాలజీ /

Windows 10 update: త్వరలో విండోస్ 10కు భారీ అప్​డేట్.. ఈసారైనా

Windows 10 update: త్వరలో విండోస్ 10కు భారీ అప్​డేట్.. ఈసారైనా

ప్రతీకాత్మక చిత్రం

ప్రతీకాత్మక చిత్రం

2015 నుంచి చిన్నచిన్న మార్పులు మినహా విండోస్ 10కు భారీ ఆప్​డేట్ రాలేదు. అయితే ఈ ఏడాది మేజర్ అప్​డేట్ ఉంటుందని యూజర్లు ఆశిస్తున్నారు. కారణాలేంటి.. విండోస్ అప్​డేట్ల చరిత్రేంటి చూడండి..

  విండోస్ 10కు భారీ అప్​డేట్ ఇచ్చేందుకు మైక్రోసాఫ్ట్ సిద్ధమైనట్టు సమాచారం. మొత్తం ఆపరేటింగ్ సిస్టం లుక్​, ఫంక్షన్స్​ ను మార్చి కొత్తగా తీసుకురావాలని పని చేస్తోందట.

  విండోస్​ 10కు ప్రతి ఏడాది రెండు మేజర్​ అప్​డేట్లు వస్తున్నాయి. అయినా 2015 నుంచి ఆ ఆపరేటింగ్ సిస్టంలో చెప్పుకోదగ్గ మార్పులు, భారీ ఫీచర్లు కొత్తగా ఏం రాలేదు. ఏవో చిన్నచిన్న మార్పులే కనిపిస్తున్నాయి.

  అలాగే ఆపరేటింగ్ సిస్టంలో సమస్యలను సైతం చాలా ఆలస్యంగా ఫిక్స్ చేస్తుందనే పేరు మైక్రోసాఫ్ట్​ కు ఉంది. అందుకే కోట్లాది మంది యూజర్లను సంతృప్తి పరిచేలా.. కొత్త ఫీచర్లు, న్యూ లుక్​తో విండోస్ 10 అప్​డేట్ రావాల్సిన అవసరం ఉంది. యూజర్లు సైతం విండోస్ ఈ సారైనా మంచి ఆప్​డేట్​తో వస్తుందని ఆశిస్తున్నారు.

  అలాగే విండోస్ యూజర్లకు సరికొత్త ఎక్స్​పీరియన్స్​ను ఇవ్వబోతున్నామని, అత్యుత్తమ ఆపరేటింగ్ అనుభూతిని ఇస్తామని మైక్రోసాఫ్ట్ ఇటీవలే ప్రకటించింది. అయితే ఈ విషయంపై మిగతా వివరాలేవీ ఈ సంస్థ వెల్లడించలేదు.

  అంచనాల ప్రకారం విండోస్ 10 స్టార్ట్ మెనూ, ఫైల్ ఎక్స్ ప్లోరర్, యాక్షన్ సెంటర్​, టాస్క్ బార్​లో మైక్రోసాఫ్ట్ భారీ మార్చులు చేయనుందట. సన్​వ్యాలీ పేరితో ఇది రానుందని వాదనలు వినిపిస్తున్నాయి. టాబ్లెట్ యూజర్లకు రీడిజైన్ చేసిన వర్చువల్ కీబోర్డుతో పాటు కొన్ని ఎమోజీలను యాక్సెస్ చేసుకునేలా అప్​డేట్ వస్తుందని సమాచారం. అలాగే ఇటీవల ఇచ్చిన చిన్నచిన్న ఫీచర్లను క్రమంలో పెట్టి ఆపరేటింగ్ సిస్టం డిజైన్​ను మార్చాలని మెక్రోసాఫ్ట్ భావిస్తోంది.

  microsoft,iit bombay,telangana news,high salary package,మైక్రోసాఫ్ట్,ఐఐటీ బాంబే,తెలంగాణ వార్తలు,భారీ ఆదాయం,microsoft offers rs1.54cr package to bombay iit student
  ప్రతీకాత్మక చిత్రం

  విండోస్ మారాల్సిన అవసరముంది..

  ఈ మధ్య కాలంలో విండోస్​లో ఎక్కువగా గేమర్లకు అనుకూలించేలా అప్​డేట్లు వస్తున్నాయి. అయితే ప్రస్తుతం ఎక్కువ మంది వర్క్ ఫ్రం హోమ్​లో ఉన్న కారణంగా మైక్రోసాఫ్ట్ వారికి ఉపయోగపడేలా ఫీచర్లు తీసుకురావాల్సి ఉంది. కంప్యూటర్లను ఎక్కువ సేపు వినియోగించినా విసుగు రాకుండా ఏదో ఓ ప్రత్యేత అనుభూతిని కలిగించాలి. మ్యాక్ (Mac) ఆపరేటింగ్ సిస్టం కోసం స్మార్ట్ ఫోన్​కు వాడే లాంటి మైక్రోప్రాసెసర్​తో యాపిల్ కొత్త ఎం1 చిప్​ను తీసుకురాగా.. మైక్రోసాఫ్ట్ సైతం అలాంటి ప్రయత్నాలే చేస్తోంది. ఇదే జరిగితే కంప్యూటర్ల రంగంలో పెను మార్పు కాబోతోంది.

  యాపిల్ కొత్త మ్యాక్ ఓస్ వల్ల ఫోన్లు, ట్యాబ్లెట్లలో వాడే ఫీచర్లను సైతం కంప్యూటర్లలో సులువుగా వాడే అవకాశం ఉంటుంది. మైక్రోసాఫ్ట్ హైబ్రిడ్ డివైజ్​ సర్ఫెస్ ఎక్స్ ప్రొ సైతం ఇలాంటి దాదాపు ఇలాంటి చిప్​సెట్​, ఫీచర్లతోనే ఈ ఏడాది విండోస్ 10ఎక్స్​తో విడుదల కానుంది.

  అలాగే ప్రస్తుతం విండోస్ 10 ఆపరేటింగ్ సిస్టం సైతం మరింత యూజర్ ఫ్రెండ్లీగా మారాలని ఆశిస్తున్నట్టు కోట్లాది యూజర్లు ఆప్​డేట్ కోసం ఎదురుచూస్తూ.. ఈసారైనా భారీ మార్పులు ఉంటాయని భావిస్తున్నారు. మరి సంవత్సరాలుగా యూజర్లను అప్​డేట్లతో నిరాశ పరుస్తున్న మైక్రోసాఫ్ట్ ఈసారైనా సంతృప్తికర ఫీచర్లను తీసుకొస్తుందేమో చూడాలి.

  విండోస్ అప్​డేట్స్ చరిత్ర


  • విండోస్​ 3 పెద్ద హిట్​. కానీ విండోస్ 95 అనేక బగ్స్​ తో విసిగించింది.

  • విండోస్ బగ్స్​ను ఫిక్స్ చేసినా 98 ఫిక్స్ చేసినా పెద్దగా ఆకట్టుకోలేకపోయింది.

  • ఆ తర్వాత వచ్చిన విండోస్ ఎక్స్​పీ మైక్రోసాఫ్ట్ చరిత్రలోనే అతిపెద్ద సక్సెస్. కానీ విండోస్ విస్టా దారుణంగా విఫలమైంది.

  • విండోస్ 7 పర్వాలేదనిపించినా, విండోస్ 8 పూర్తిగా నిరాశపరిచింది.

  • ప్రస్తుతం విండోస్ 10 విజయవంతంగానే నడుస్తున్నా సంవత్సరాలుగా ఎలాంటి మార్పులు కనిపించడం లేదు.

  Published by:Krishna P
  First published:

  ఉత్తమ కథలు