Home /News /technology /

WILL YOU NEED TO PAY MORE AND 5 OTHER COMMON QUESTIONS ANSWERED ABOUT 5G IN INDIA UMG GH

5G In India: 5G అంటే ఏంటి? ఈ టెక్నాలజీతో ఇంటర్నెట్‌ ప్లాన్‌ ధరలు పెరుగుతాయా? 5Gతో వచ్చే మార్పులు ఇవే..

5g వస్తే రేట్లు పెరుగుతాయా..? అసలు 5జీ అంటే ఏంటి..? (Image: Pixabay)

5g వస్తే రేట్లు పెరుగుతాయా..? అసలు 5జీ అంటే ఏంటి..? (Image: Pixabay)

5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం (Government) పచ్చజెండా ఊపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 5G నెట్‌వర్క్ (Mobile Network) అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటి? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

ఇంకా చదవండి ...
5G స్పెక్ట్రమ్ వేలం నిర్వహించడానికి ప్రభుత్వం పచ్చజెండా ఊపింది. దేశంలో 5జీ సేవలు అందుబాటులోకి తీసుకువచ్చేందుకు వడివడిగా అడుగులు పడుతున్నాయి. ఈ నేపథ్యంలో 5G నెట్‌వర్క్ అంటే ఏంటి? దాని ప్రయోజనాలు ఏంటి? తదితర అంశాలను ఇప్పుడు తెలుసుకుందాం.

5G అంటే ఏంటి?
5జీ నెట్‌వర్క్ కస్టమర్‌లకు అల్ట్రా ఫాస్ట్ ఇంటర్నెట్, మల్టీమీడియా సర్వీసెస్ అందించడానికి అధునాతన సాంకేతికతలను ఉపయోగిస్తోంది. 5జీ నెట్‌వర్క్‌ ఒక మిల్లీసెకన్ లేటెన్సీని అందిస్తుంది. అంటే ఒక మిల్లీసెకనులో డేటా ట్రాన్స్‌ఫర్‌ అవుతుంది. ఇది 4జీ కంటే 50 రెట్లు వేగవంతమైనదని చెప్పవచ్చు. 5జీ ఫోన్ల బ్యాటరీ లైఫ్ కూడా పెంచుతుందని తేలింది. 5జీ డౌన్‌లోడ్ స్పీడ్‌తో ఎలక్ట్రానిక్ పరికరాలను ఒకదానికొకటి కమ్యూనికేట్ చేయడం సులభతరం అవుతుంది. రిమోట్‌గా ఎలక్ట్రానిక్ వస్తువులను కంట్రోల్ చేయడం సాధ్యమవుతుంది. ఇంటర్నెట్ ఆఫ్ థింగ్స్ టెక్నాలజీ మరింత మెరుగు పడుతుంది. భవిష్యత్తులో 5జీ వల్ల స్మార్ట్ సిటీ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, సెల్ఫ్ డ్రైవింగ్ కార్లు, రోబోటిక్ సర్జరీ వంటి కొత్త టెక్నాలజీ ప్రాధాన్యత పెరుగుతుంది. 5జీ దక్షిణ కొరియా, యునైటెడ్ స్టేట్స్, కెనడాతో సహా అనేక ప్రదేశాలలో అందుబాటులోకి వచ్చింది.భారతదేశంలో ఏ 5G బ్యాండ్ ఉపయోగిస్తారు?
ప్రస్తుత 4G సేవల ద్వారా సాధ్యమయ్యే దానికంటే దాదాపు 10 రెట్లు అధికంగా ఉండే వేగం, సామర్థ్యాలను అందించగల 5G టెక్నాలజీ బేస్డ్ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి టెలికాం సర్వీస్ ప్రొవైడర్లు మిడ్, హై బ్యాండ్ స్పెక్ట్రమ్‌ను ఉపయోగించుకోవచ్చని భావిస్తున్నారు.

ఇదీ చదవండి: ఫిక్స్‌డ్ డిపాజిటర్లకు గుడ్ న్యూస్.. వడ్డీ రేట్లు పెంచిన పంజాబ్ నేషనల్ బ్యాంక్.. కొత్త వడ్డీ రేట్లు ఇవే


4G, 5G మధ్య తేడా ఏంటి?
4Gతో పోలిస్తే, 5G మరింత సామర్థ్యం గల ఇంటర్‌ఫేస్. 4G గరిష్టంగా 150mbps వేగాన్ని అందిస్తోంది, 5G 10Gbps డౌన్‌లోడ్ వేగాన్ని అందించగలదు, ఇది 4G సామర్థ్యం కంటే అనేక రెట్లు ఎక్కువ. 5Gతో పూర్తి నిడివి గల HD సినిమాలను సెకన్లలో డౌన్‌లోడ్ చేసుకోగలరు. అప్‌లోడ్ వేగం పరంగా, 4G నెట్‌వర్క్‌లలో 50Mbps అప్‌లోడ్ వేగంతో పోలిస్తే, 5G నెట్‌వర్క్‌లు 1Gbps అప్‌లోడ్ వేగాన్ని అందించగలవు. ఇది కాకుండా, 5G 4G కంటే అనేక పరికరాలకు కనెక్ట్ చేయగలదు.

ఇదీ చదవండి: పెన్షనర్లకు బిగ్ అలర్ట్.. సంవత్సరంలో నాలుగు సార్లే ఆ ఆప్షన్..!


భారతదేశంలో 4G కంటే 5G మరింత ఖరీదవుతుందా?
ఇప్పుడు భారతదేశంలో 5G ప్లాన్‌ల ధర ఎలా ఉంటుందనే దాని గురించి ఎటువంటి సమాచారం లేనప్పటికీ, దేశంలో 4G కోసం మనం చెల్లిస్తున్న దానికంటే కొంచెం ఎక్కువగా ఉంటుందని భావిస్తున్నారు. భారతదేశం ప్రపంచంలోనే అత్యంత చౌకైన ఇంటర్నెట్‌ సేవలను అందిస్తోంది. 2022 మార్చిలో ఎయిర్‌టెల్ చీఫ్ టెక్నాలజీ ఆఫీసర్(CTO), రణ్‌దీప్ సెఖోన్ మాట్లాడుతూ.. భారతదేశంలో 5G ప్లాన్‌లు ప్రస్తుతం చెల్లిస్తున్న 4G ప్లాన్‌ల ధరతో సమానంగా ఉంటాయని భావిస్తున్నామని చెప్పారు.

ఇదీ చదవండి: సైబర్‌ బుల్లీయింగ్.. అసలు ఏంటి ఇదీ..? డేటా చోరీ కాకూడదంటే.. కచ్చితంగా ఇది చదవాల్సిందే!


5G సేవలు ఎప్పుడు ప్రారంభమవుతాయి?
వచ్చే నెలలో 5G స్పెక్ట్రమ్ వేలం జరుగుతుంది. ఈ ఏడాది చివర్లో లేదా 2023 ప్రారంభంలో 5G సేవలు అందుబాటులోకి వస్తాయని భావిస్తున్నారు. ఈ ఏడాది ప్రారంభంలో, ఎయిర్‌టెల్ CTO వేలం ముగిసిన తర్వాత 2- 4 నెలల్లో తమ 5G సేవలను తీసుకువస్తామని చెప్పారు.

ఇదీ చదవండి: శ్రీలంక ప్రభుత్వ ఉద్యోగులకు వారానికి 4 రోజులే పని.. మిగతా సమయం వ్యవసాయం చేయాలని పిలుపు


5Gకి కొత్త మొబైల్ టవర్లు అవసరమా?
5G ప్రస్తుతం మీ మొబైల్ డేటా, Wi-Fi, శాటిలైట్ కమ్యూనికేషన్‌ల కోసం ఉపయోగిస్తున్న అదే రేడియో ఫ్రీక్వెన్సీలలో రన్ అవుతుంది. టెలికాం ప్రొవైడర్లు సేవలను అమలు చేయడానికి తమ టవర్‌లను మార్చాల్సిన అవసరం లేదు, ఎందుకంటే ఇది ఒకే ఫ్రీక్వెన్సీలో నడుస్తుంది.
Published by:Mahesh
First published:

Tags: 5G, 5g mobile, Cell phone, Towers

తదుపరి వార్తలు