'నన్ను పెళ్లి చేసుకుంటావా?': గూగుల్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రపోజల్స్

"నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ గూగుల్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఇది ఇప్పుడు కాదు... చాలాకాలంగా ఈ ప్రపోజల్స్ గూగుల్ అసిస్టెంట్‌కు వస్తున్నాయి.

news18-telugu
Updated: January 30, 2019, 12:26 PM IST
'నన్ను పెళ్లి చేసుకుంటావా?': గూగుల్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రపోజల్స్
Will you marry me?: వాయిస్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నలు... గూగుల్ ఫన్నీ రిప్లై
  • Share this:
గూగుల్ అసిస్టెంట్... ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌తో పనిచేసే ఈ వర్చువల్ అసిస్టెంట్ గురించి ఆండ్రాయిడ్ స్మార్ట్‌ఫోన్ యూజర్లందరికీ తెలుసు. వెదర్ ఎలా ఉంది? దగ్గర్లో హోటల్ ఎక్కడ ఉంది? ఇండియాలో బెస్ట్ టూరిస్ట్ స్పాట్ ఏంటీ? ఇలాంటి ప్రశ్నలు ఎన్ని వేసినా సమాధానం చెప్పేస్తుంది గూగుల్ అసిస్టెంట్. ఫోన్‌లోనే కాదు ఇంట్లో కూడా వాడుకోవడానికి గూగుల్ హోమ్ వర్చువల్ అసిస్టెంట్ డివైజ్‌లను రిలీజ్ చేసింది గూగుల్. ఈ వర్చువల్ అసిస్టెంట్ ఫీమేల్ వాయిస్‌తో సమాధానాలు ఇస్తుంటుంది. ప్రతీ ప్రశ్నకు సమాధానం చెబుతుండటంతో యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ను ప్రతీ అవసరానికి వాడేస్తుంటారు. ఇంతవరకు బాగానే ఉంది కానీ... "నన్ను పెళ్లి చేసుకుంటావా?" అంటూ గూగుల్ అసిస్టెంట్‌కు యూజర్ల ప్రశ్నల వర్షం కురిపిస్తున్నారట. ఇది ఇప్పుడు కాదు... చాలాకాలంగా ఈ ప్రపోజల్స్ గూగుల్ అసిస్టెంట్‌కు వస్తున్నాయి. ఒక్క ఇండియా నుంచే గూగుల్ అసిస్టెంట్‌కు 4.5 లక్షల మ్యారేజ్ ప్రపోజల్స్ వెళ్లినట్టు గతేడాది లెక్క తేలింది. ఈ విషయాన్ని గతేడాది గూగుల్ స్వయంగా బయటపెట్టడం విశేషం.

ఇప్పటికీ గూగుల్ అసిస్టెంట్‌కు మ్యారేజ్ ప్రపోజల్స్ వస్తూనే ఉన్నాయి. దీంతో గూగుల్ యూజర్లపై ట్విట్టర్‌లో సెటైర్ వేసింది. "పెళ్లి చేసుకుంటావా అంటూ గూగుల్ అసిస్టెంట్‌ని ఎందుకు అడుగుతున్నారు?" అంటూ యూజర్లను అడుగుతోంది గూగుల్.


గూగుల్ అసిస్టెంట్‌నే పెళ్లి చేసుకుంటావా అని అడిగిన యూజర్లు ఇక ఊరుకుంటారా? గూగుల్‌కు ట్విట్టర్‌లో తమదైన శైలిలో సమాధానాలు ఇచ్చారు.
కొందరు యూజర్లు గూగుల్ అసిస్టెంట్‌ని "will you marry me" అని అడిగిమరీ వచ్చిన సమాధానాలను స్క్రీన్‌షాట్ తీసి ట్విట్టర్‌లో పోస్ట్ చేశారు. ఇంకొందరైతే... అమ్మాయిల కోసం మేల్ వాయిస్ కూడా పెట్టండి అంటూ ట్వీట్ చేశారు.

Photos: మహాత్మాగాంధీ వర్ధంతి... మీరు చూడని జాతిపిత అరుదైన 100 చిత్రాలు ఇవే...

ఇవి కూడా చదవండి:

మొబైల్ యాప్స్‌తో లోన్... తీసుకోవాల్సిన జాగ్రత్తలు

Discount on Gold: బంగారంపై 10% డిస్కౌంట్... కొనేందుకు మీరు రెడీనా?
First published: January 30, 2019
మరిన్ని చదవండి
Loading...
తదుపరి వార్తలు
Loading...