Home /News /technology /

WILL TIKTOK RETURN TO INDIA WITH NEW INVESTOR TWITTER ALSO IN DISCUSSIONS TO BUY TIKTOK US SS

TikTok: కొత్త ఓనర్‌తో టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?

TikTok: కొత్త ఓనర్‌తో టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ వస్తుందా?
(ప్రతీకాత్మక చిత్రం)

TikTok: కొత్త ఓనర్‌తో టిక్‌టాక్ భారత్‌లోకి మళ్లీ వస్తుందా? (ప్రతీకాత్మక చిత్రం)

TikTok | టిక్‌టాక్... భారతదేశంలో నిషేధానికి గురైన తర్వాత భవిష్యత్తు ఆగమ్యగోచరంగా మారిన వీడియో క్రియేటింగ్ ప్లాట్‌ఫామ్ ఇది. ఇటీవల టిక్‌టాక్ చుట్టూ అనేక వార్తలొస్తున్నాయి.

    కొత్త ఓనర్‌తో భారత్‌లోకి మళ్లీ టిక్ టాక్ మళ్లీ అడుగుపెట్టబోతోందా? ప్రస్తుతం అలాంటి వార్తలే చక్కర్లు కొడుతున్నాయి. అమెరికాలో టిక్‌టాక్‌ను మైక్రోసాఫ్ట్ సొంతం చేసుకుంటుందన్న వార్తలు మొదట వచ్చాయి. ఆ తర్వాత ఇండియా, యూరప్ యూనిట్లను కూడా మైక్రోసాఫ్ట్ తీసుకుంటుందన్న వార్తలొచ్చాయి. దీంతో మైక్రోసాఫ్ట్ నేతృత్వంలో టిక్‌టాక్ మళ్లీ ఇండియాలో అడుగుపెడుతుందన్న చర్చ మొదలైంది. ఇప్పుడు టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవడానికి ట్విట్టర్ కూడా పోటీపడుతుందన్న ప్రచారం జరుగుతోంది. టిక్‌టాక్ యూఎస్‌ను సొంతం చేసుకోవడానికి ట్విట్టర్ కూడా ప్రయత్నాలు చేస్తోందని ది వాల్ స్ట్రీట్ జనరల్ కథనం. భారత ప్రభుత్వం టిక్‌టాక్ సహా 59 చైనా యాప్స్‌ని నిషేధించడం సంచలనం సృష్టించింది. ఇక అప్పట్నుంచీ టిక్‌టాక్ చుట్టూ అనేక వార్తలొస్తున్నాయి.

    Smartphone: ఆగస్టులో రూ.10,000 లోపు 5 బెస్ట్ స్మార్ట్‌ఫోన్స్ ఇవే

    Amazon Prime Day Sale: అమెజాన్ ప్రైమ్ మెంబర్‌షిప్ ఉచితం... వారికి మాత్రమే

    చైనా ముద్రను తొలగించుకునేందుకు టిక్‌టాక్ పేరెంట్ కంపెనీ అయిన బైట్‌డ్యాన్స్ ప్రయత్నాలు చేస్తోంది. తమ హెడ్ క్వార్టర్స్‌ను చైనా నుంచి తరలించేందుకు ప్రయత్నిస్తోంది. ఈ పరిణామాల నేపథ్యంలో అనేకమంది పెట్టుబడిదారులు టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవడానికి ప్రత్నిస్తున్నారు. మైక్రోసాఫ్ట్, ట్విట్టర్ లాంటి దిగ్గజ కంపెనీలు ఆ జాబితాలో ఉన్నాయి. అయితే వీటిపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. టిక్‌టాక్ లాంటి యాప్ రూపొందించడమా లేక టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవడమా అన్న ఆప్షన్స్ ఆ కంపెనీల ముందున్నాయి. అయితే ఇప్పటికే పాపులర్ అయిన టిక్‌టాక్‌ను సొంతం చేసుకోవడానికే ఎక్కువ అవకాశాలు కనిపిస్తున్నాయి.

    ఈ స్మార్ట్‌ఫోన్ ధర రూ.7,777 మాత్రమే... మేడ్ ఇన్ ఇండియా మొబైల్ ఫీచర్స్ ఇవే

    Redmi 9 Prime: రూ.10,000 లోపే రెడ్‌మీ 9 ప్రైమ్... భారీ బ్యాటరీతో పాటు మరెన్నో ప్రత్యేకతలు

    టిక్‌టాక్ విషయానికొస్తే ఎక్కువమంది యూజర్లు ఇండియాలో, అమెరికాలో ఉన్నారు. సెన్సార్ టవర్ లెక్కల ప్రకారం 650 మిలియన్స్ అంటే 65 కోట్ల డౌన్‌లోడ్స్‌ ఉండటం విశేషం. కాబట్టి టిక్‌టాక్‌కు ఈ రెండు దేశాలు పెద్ద మార్కెట్లే. భారతదేశంలో ఇప్పటికే టిక్‌టాక్ లాంటి యాప్స్ కొత్తవి వస్తున్న సంగతి తెలిసిందే. ఇన్‌స్టాగ్రామ్ రీల్స్, గానా షార్ట్స్, జీ5 హిపీ, ఎంఎక్స్ ప్లేయర్ టకాటక్, షేర్‌చాట్ మోజ్ లాంటి వాటితో పాటు మేడ్ ఇన్ ఇండియా యాప్స్ అయిన చింగారీ లాంటి ప్లాట్‌ఫామ్స్ టిక్‌టాక్ ప్లేస్‌ను రీప్లేస్ చేసే పనిలో ఉన్నాయి.
    Published by:Santhosh Kumar S
    First published:

    Tags: Tik tok, Tiktok, Twitter

    తదుపరి వార్తలు